బ్యాంక్ ఇంటర్వ్యూలు
Sakshi Education
ప్రస్తుత జాబ్ మార్కెట్‌లో.. బ్యాంకింగ్ రంగానిదే హవా.. గత కొంత కాలంగా విస్తరిస్తున్న సేవలు.. పెరుగుతున్న అవసరాలకనుగుణంగా సిబ్బంది నియామకం కోసం బ్యాంకులు వివిధ విభాగాల్లో వేల పోస్టులను భర్తీ చేస్తున్నాయి. ఇటీవలి కాలంలో పలు బ్యాంకులు దాదాపు 3500 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్లు విడుదల చేశాయి. ఐబీపీఎస్ కామన్ రిటెన్ ఎగ్జామ్‌లో అర్హత సాధిస్తే ఈ ఉద్యోగాలకు సంబంధించి తొలి దశను విజయవంతంగా ఛేదించినట్టే. మలి దశ ఇంటర్వ్యూను అధిగ మిస్తే.. సమున్నతమైన కెరీర్ సొంతమవుతుంది.. ఈ నేపథ్యంలో.. ఇంటర్వ్యూ దశలో రాణించడానికి పాటించాల్సిన వ్యూహాలు..
ఇంటర్వ్యూను ఉద్యోగం సాధించే చక్కటి వేదికగా భావించాలి. అప్పుడే ఆత్మవిశ్వాసంతో ఇంటర్వ్యూ చేయవచ్చు. ఇంటర్వ్యూ బోర్డులో సాధారణంగా సైకాలజిస్ట్‌తో కలిపి నలుగురు సభ్యులు ఉంటారు. ఈ సైకాలజిస్ట్ మీ కదలికలను నిరంతరం పరిశీలిస్తుంటారు. బ్యాంకింగ్ రంగంపై మీ ఆసక్తి.. ఇందులోకి రావడానికి కారణం..ఈ రంగానికి సరితూగుతారా? లేదా? అనే లక్షణాలకు ఇంటర్వ్యూలో ప్రాధాన్యతనిస్తారు. అదే విధంగా మీ వ్యక్తిత్వాన్ని కూడా అంచనా వేస్తారు.
ఎటువంటి ప్రశ్నలు:
ఇంటర్వ్యూ సమయం 15-20 నిమిషాలు ఉంటుంది. అన్ని బ్యాంకుల ఇంటర్వ్యూల్లో అభ్యర్థిలోని ఎమోషనల్ కోషియెంట్‌ను పరిశీలిస్తారు. జాబ్‌కు సరిపడ స్కిల్స్ ఉన్నాయా? వ్యక్తిగత నేపథ్యం? కరెంట్ అఫైర్స్? బ్యాంకింగ్ రంగంపై మీకు ఉన్న అవగాహనను పరీక్షించే ప్రశ్నలు అడుగుతారు. అభ్యర్థులు అందించిన రెజ్యుమే ఆధారంగా కూడా ప్రశ్నలడిగే అవకాశాలున్నాయి. ఈ క్రమంలో.. మీ గురించి చెప్పండి? బ్యాంకింగ్ రంగాన్ని కెరీర్‌గా ఎంచుకోవడానికి కారణం? వ్యక్తిగత, అకడెమిక్ నేపథ్యం? బ్యాంకింగ్ ఆపరేషన్స్-పదజాలంపై ప్రశ్నలు? బలాలు, బలహీనతలకు సంబంధించిన ప్రశ్నలు? రాబోయే పదేళ్లలో కెరీర్‌ను ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారు? ఇటీవలి కాలంలో జాతీయంగా, అంతర్జాతీయంగా చోటు చేసుకున్న సంఘటనలపై ప్రశ్నలు ఎదురవుతాయి. జాబ్ ప్రొఫైల్, ఉద్యోగ అనుభవం ఉన్నవారిని, రంగం మారుతున్న వారిని సంబంధిత రంగాలకి సంబంధించి ప్రశ్నలు అడిగే అవకాశముంది.
రిక్రూట్‌మెంట్ విధానం బ్యాంకు, పోస్టును బట్టి వేర్వేరుగా ఉంటుంది. క్లరికల్ కేడర్ పోస్టులను మాత్రం ఐబీపీఎస్ స్కోర్, ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేస్తారు. పీఓ/మేనేజ్‌మెంట్ ట్రైనీ/స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల రిక్రూట్‌మెంట్ మాత్రం ఐబీపీఎస్ స్కోర్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు నిర్వహించే ఇంటర్వ్యూలో పోస్టును బట్టి ప్రొఫెషనల్/టెక్నికల్ నాలెడ్జ్‌ను కూడా పరీక్షిస్తారు.
ఉదాహరణలతో:
ఇంటర్వ్యూలో అభ్యర్థులు అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని.. అన్నీ తెలిసి ఉండాలని ఏ బోర్డు సభ్యుడూ ఆశించరు. అభ్యర్థి తనకు తెలిసిన విషయూలను ఆర్గనైజ్ చేసుకొని సమాధానం చెప్పాలి. విమర్శనాత్మక ధోరణి కాకుండా సమాధానం ‘బ్యాలెన్స్‌డ్’గా ఉండాలి. సమాధానాలకు ఒకట్రెండు ఉదాహరణలు జోడిస్తే పోటీలో మీరొక అడుగు ముందుకేసినట్లే. అభ్యర్థిలోని సహనాన్ని పరీక్షించడానికి కొన్నిసార్లు ఉద్దేశపూర్వకంగానే విసిగించే ప్రశ్నలు అడిగే అవకాశాముంటుంది. అలాంటి ప్రశ్నలు ఎదురైనప్పుడు సహనం కోల్పోకుండా స్పందించడం ఎంతో ప్రధానం. ముఖ్యంగా అభ్యర్థులు కరెంట్ అఫైర్స్‌లో పొరపాటు చేస్తుంటారు. కాబట్టి ఈ అంశంపై దృష్టి పెట్టాలి. ఇంటర్వ్యూ తేదీకి ముందు ఏడాది కాలంలో రాష్ట్రంలో, దేశం, ప్రపంచంలో చోటు చేసుకున్న సంఘటనలపై అవగాహన కలిగి ఉండాలి. అదేవిధంగా అభ్యర్థులు తమ స్వస్థలానికి ఉన్న ప్రాధాన్యత, ఇటీవల అక్కడ సంభవించిన ప్రధాన సంఘటనలను తెలుసుకోవాలి. బ్యాంకింగ్ రంగంలో వాడే పదాలు.. సీఆర్‌ఆర్, ఆర్‌ఆర్‌ఆర్, రూపాయి విలువలో హెచ్చుతగ్గులు, ఎస్‌ఎల్‌ఆర్, వడ్డీ రేట్ల హెచ్చుతగ్గులు, అకౌంట్స్, బ్యాంకింగ్ ఆపరేషన్స్ గురించి అవగాహన పెంచుకోవాలి. ఏ బ్యాంకులో ఇంటర్వ్యూకు వెళుతున్నారో.. ఆ బ్యాంకు ప్రొఫైల్ తెలుసుకోవాలి. భారత ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థలో బ్యాంకింగ్ రంగం పాత్ర, ద్రవ్యపరపతి విధానం, బ్యాంకులందించే సేవల గురించి కూడా అవగాహన పెంచుకోవాలి. ఇంటర్వ్యూ రోజు.. ఆ రోజు న్యూస్ పేపర్లలో వచ్చిన వార్తల నుంచి కచ్చితంగా ప్రశ్నలు వస్తాయి. కాబట్టి దీనిపై విధిగా దృష్టి సారించాలి.
స్కిల్స్‌కే పెద్ద పీట:
అభ్యర్థి గుణగణాలను, వ్యక్తిత్వాన్ని పరీక్షించేందుకే పెద్ద పీట వేస్తారు. కమ్యూనికేషన్ స్కిల్స్, ఇతరులతో ప్రవర్తించే తీరు, క్లిష్ట పరిస్థితుల్లో అభ్యర్థి స్పందన, ఆప్టిట్యూడ్, నిరంతరం కొత్త విషయాలను నేర్చుకోవాలనే తపన, సందర్భానుసారంగా సమయస్ఫూర్తిగా వ్యవహరించడం, జట్టుతో కలిసి పనిచేయడం, ఆలోచనలో స్పష్టత, ఉన్నత స్థానాలను నిర్వహించే సామర్థ్యం వంటి అంశాలను క్షుణ్నంగా పరిశీలిస్తారు. వీటిపైనే విజయం ఆధారపడి ఉంటుంది. హాబీస్ కూడా కీలక పాత్ర పోషిస్తాయి. వీటి ఆధారంగా మీ వ్యక్తిత్వంపై ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి.
ఫిజికల్ అపీయరెన్స్:
ఫిజికల్ ఆపిరీయెన్స్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ‘ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్’.. అభ్యర్థులు కచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం. కాబట్టి ఇంటర్వ్యూ రోజు అభ్యర్థి తనను తాను ప్రెజెంట్ చేసుకునే క్రమంలో దుస్తుల దగ్గర్నుండి పాదరక్షల వరకు పలు అంశాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఫ్యాషనబుల్ కాకుండా హుందాగా ఉండేలా ఫార్మల్ దుస్తులను మాత్రమే ధరించాలి. పురుష అభ్యర్థులైతే విధిగా ఇన్‌షర్ట్ చేయడంతోపాటు ఫార్మల్ షూస్ వేసుకోవాలి. మహిళా అభ్యర్థులైతే సల్వార్ కమీజ్ లేదా చీరను ధరించాలి. ప్రొబేషనరీ/స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగానికి వెళ్తుంటే మాత్రం కనీసం టై అవసరం.
గ్రామర్ కాదు ప్రధానం:
ఇంటర్వ్యూ పూర్తిగా ఇంగ్లిష్ భాషలోనే ఉంటుంది. సమాధానాలను ఇచ్చే క్రమంలో ఇంగ్లిష్ నుంచి ఇతర భాష/మాతృ భాషలోకి ఏ విధంగా మారకూడదు. ఇంటర్వ్యూలో ముఖ్యంగా కమ్యూనికేషన్ స్కిల్స్‌ను టెస్ట్ చేస్తారు. సమాధానాన్ని ఎంత స్పష్టంగా, సూటిగా, ఆత్మవిశ్వాసంతో ప్రజెంట్ చేస్తున్నారనే అంశానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి గ్రామర్ ఎర్రర్స్‌ను పట్టించుకోకుండా సమాధానాన్ని సూటిగా చెప్పాలి. ఇంటర్వ్యూ చివర్లో స్థానిక భాష/మాతృ భాషలో మీ సామర్థ్యాన్ని పరీక్షించడానికి ఒకటి, రెండు ప్రశ్నలు వేస్తారు. వాటికి బోర్డు అనుమతితో సంబంధిత భాషలోనే సమాధానం చెప్పాలి.
ఇంటర్వ్యూ గదిలో:
బోర్డ్ గదిలోకి వెళ్లేముందు ఒకసారి తలుపు తట్టి లోపలికి రావచ్చా అని అడిగి లోపలికి వెళ్లాలి. లోపలికి వెళ్లిన తర్వాత వారిని గ్రీట్ చేసి, వారు కూర్చోమనేవరకు ఎదురుచూసి, తర్వాత నిర్దేశించిన స్థానంలో కూర్చోవాలి. అలా కూర్చునేటప్పుడు మరీ బిగదీసుకుని కాకుండా ప్లీజింగ్‌గా కనిపిస్తూ కూర్చోవాలి. ఇంటర్వ్యూ బోర్డు సభ్యులకు సమాధానాలిచ్చేటపుడు వారి కళ్ల వైపు చూస్తూ మాట్లాడాలి. ఏ సభ్యుడి ప్రశ్నకు సమాధానం ఇస్తే వారి వంకే చూడాలి. ఇంటర్వ్యూ ముగిశాక బయటకు వచ్చే ముందు మరొక సారి బోర్డుకి కృతజ్ఞతలు చెప్పి బయటకు రావాలి.
డోన్ట్

- వాచ్ వైపు చూసుకోవడం.
- జుట్టుపై చేయి పెట్టుకోవడం.
- శబ్దం చేసే షూస్ ధరించడం.
- టేబుల్‌పై చేతులు పెట్టడం.
- శరీరాన్ని కదిలించడం.
- బిగ్గరగా నవ్వడం.
- వేరే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నట్టు చెప్పడం.
డూస్
ప్యానల్ సభ్యులందరి వైపు చూస్తూ విష్ చేయాలి.
ప్రశాంతంగా ఉండాలి.
ఆ రోజు పేపర్ క్షుణ్నంగా చదవడం అవసరం.
ప్రతి కదలికను పరిశీలిస్తారు
ఇంటర్వ్యూ దాదాపు 15 నుంచి 25 నిమిషాలు ఉంటుంది. ఇంటర్వ్యూ ప్యానల్‌లో నలుగురు సభ్యులు ఉంటారు. రెజ్యుమే ఆధారంగా ప్రశ్నలు అడుగుతారు. మొత్తం ఇంగ్లిష్‌లోనే ఉంటుంది. ఇంటర్వ్యూ హాల్‌లోకి ప్రవేశించినప్పటి నుంచి.. పూర్తయ్యే వరకు పూర్తిగా ఆత్మవిశ్వాసంతో ఉండాలి. బోర్డు సభ్యులు మన ప్రతి కదలికను క్షుణ్నంగా పరిశీలిస్తుంటారు. కాబట్టి సమయస్ఫూర్తిగా వ్యవహరించాలి. మొద ట మన ప్రొఫైల్‌కు సంబంధించిన ప్రశ్నలు, తర్వాత ఈ రంగాన్ని కెరీర్‌గా ఎంచుకోవడానికి కారణం? ప్రీవియస్ జాబ్ ఎక్స్‌పీరియెన్స్ ఉంటే దానికి సంబంధించిన సమాచారం తెలుసుకుంటారు. కరెంట్ అఫైర్స్‌పై కూడా ప్రశ్నలు వేస్తారు. చాలా మంది అభ్యర్థులు ఈ అంశంలోనే సరిగా సమాధానాలు చెప్పలేకపోతున్నారు. కాబట్టి ఈ అంశంపై దృష్టి సారించాలి. ఇంటర్వ్యూ రోజు న్యూస్ పేపర్లలో వచ్చిన వార్తల నుంచి కచ్చితంగా ప్రశ్నలు వస్తాయి. బ్యాంకింగ్ ఆపరేషన్స్‌పై అవగాహనను కూడా పరిశీలిస్తారు. బ్యాంకింగ్ రేట్లు..రెపో రేట్లు, ఎస్‌ఎల్‌ఆర్, సీఆర్‌ఆర్ త రహా అంశాలను క్షుణ్నంగా తెలుసుకోవాలి. ఎటువంటి తడబాటు లేకుండా సూటిగా, స్పష్టంగా సమాధానాలు చెప్పాలి. డ్రెస్సింగ్ సెన్స్ కూడా ముఖ్యం. ఏదైనా ప్రశ్నకు సమాధానం తెలియకపోతే..తెలియదు, రాదు, గుర్తులేదు తరహాలో కాకుండా "Actually I have an idea about this topic but unfortunately unable to recollect at present" అని సమాధానం ఇవ్వాలి.
-రాము సిద్దోజు, ఎస్‌డబ్ల్యూఓ-ఎస్‌బీహెచ్-పులిచర్ల.
సూటిగా, సరళంగా, స్పష్టంగా
బ్యాంకుల్లో రిక్రూట్‌మెంట్ కోసం నిర్వహించే ఇంటర్వ్యూ ఏ విధంగా ఉంటుంది? ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు? సక్సెస్ సాధించటం కష్టమా? ఇటువంటి సందేహాలు సాధారణంగా ఆశావహుల్లో మెదులుతుంటాయి. ఇక్కడ గమనించాల్సిన అంశం.. బ్యాంకింగ్ రంగం ఇతర రంగాలకు భిన్నమైంది కాదు. ఇతర రంగాల్లోని ఇంటర్వ్యూ ప్రక్రియనే ఇక్కడ అనుసరిస్తారు. క్లరికల్ కేడర్ పోస్టుల్లో నేర్చుకునే లక్షణాలు ఉన్న అభ్యర్థికి పెద్ద పీట వేస్తారు. పీఓ/స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు మాత్రం నిర్వహణ సామర్థ్యాన్ని ప్రధానంగా పరిశీలిస్తారు. ఇంటర్వ్యూలో గ్రామర్‌కు పెద్ద ప్రాధాన్యం ఉండదు. సూటిగా, సరళంగా, స్పష్టంగా ఏ విధంగా సమాధానాన్ని ప్రెజెంట్ చేస్తున్నారనే అంశాన్ని పరిశీలిస్తారు. వ్యక్తిగత నేపథ్యం, కెరీర్ ప్లానింగ్, బ్యాంకింగ్ పదజాలం-ఆపరేషన్స్‌తోపాటు కరెంట్ అఫైర్స్, జీకే అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. కరెంట్ అఫైర్స్, జీకేపై ఎక్కువ దృష్టి సారించాలి.
-మనోజ్ సేథీ, టైమ్ ఇన్‌స్టిట్యూట్, హైదరాబాద్.

Published date : 22 Oct 2012 05:56PM