బంగారు భవితకు కేరాఫ్ బ్యాంకింగ్..
Sakshi Education
సంప్రదాయ గ్రాడ్యుయేట్ల నుంచి ప్రొఫెషనల్ డిగ్రీ ఉత్తీర్ణుల వరకు..ఎంట్రీ లెవల్ నుంచి టాప్ లెవల్ వరకు.. సేల్స్ విభాగం నుంచి స్పెషలిస్ట్ కేటగిరీ వరకు... ఎప్పటికప్పుడు ఉద్యోగ ప్రకటనలతో బ్యాంకింగ్ రంగం యువతకు సాదర స్వాగతం పలుకుతోంది!
బ్యాంకులు కొత్త బ్రాంచ్‌లను ఏర్పాటు చేస్తూ విస్తరణ దిశగా అడుగులేస్తున్న నేపథ్యంలో మానవ వనరుల అవసరం పెరుగుతోంది. ఈ క్రమంలో భారీగా నియామకాలు చేపడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బ్యాంకింగ్ రంగంలో నియామకాల విధివిధానాలు, కెరీర్ అవకాశాలపై విశ్లేషణ...
ప్రస్తుతం బ్యాంకింగ్ రంగం దేశంలో లక్షల మంది నిరుద్యోగులకు భరోసా ఇస్తోంది. ఇటీవల కాలంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నాయి. ప్రభుత్వ బ్యాంకుల్లో ఎక్కువ మంది పదవీవిరమణ చేస్తుండటం, ప్రైవేటు బ్యాంకుల విస్తరణ కార్యకలాపాలు నేపథ్యంలో ఎక్కువ ఖాళీలు ఏర్పడుతున్నాయి. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో మానవ వనరుల కొరతపై స్వయంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా... 2010-20 దశాబ్దాన్ని ‘డికేడ్ ఆఫ్ రిటైర్‌మెంట్స్’గా పేర్కొంది. మరోవైపు జన్‌ధన్ యోజన వంటి పథకాలతో గ్రామీణ వర్గాలకు సైతం బ్యాంకింగ్ సేవలను చేరువ చేసేందుకు చర్యలు తీసుకుంటుండటం ప్రభుత్వరంగ బ్యాంకుల్లో భారీ నియామకాలకు ఊతమిస్తున్నాయి. అదేవిధంగా కొత్త బ్యాంకులకు అనుమతులివ్వడాన్ని ప్రైవేటు రంగంలో భారీ సంఖ్యలో నియామకాలకు ప్రధాన కారణంగా చెప్పొచ్చు.
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో:
ప్రైవేటు బ్యాంకులు-నియామక ప్రక్రియ:
ఉద్యోగుల భర్తీకి ప్రైవేటు బ్యాంకులు విభిన్న విధానాలను అనుసరిస్తున్నాయి. ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ బ్యాంకు వంటివి తమ అవసరాలకు తగిన నైపుణ్యాలున్న అభ్యర్థులను నియమించుకునేందుకు అకడమిక్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని.. పీజీ, పీజీ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ కోర్సులను నిర్వహిస్తున్నాయి. ఈ కోర్సులను విజయవంతంగా పూర్తిచేసిన వారికి ఉద్యోగాలిస్తున్నాయి. ఐఐఎం, ఐఐటీ, ఇతర ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్ సంస్థల్లో క్యాంపస్ రిక్రూట్‌మెంట్ల ద్వారా స్పెషలైజ్డ్ ప్రొఫెషనల్స్‌ను నియమించుకుంటున్నాయి. రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ ఎబిలిటీ, కమ్యూనికేషన్ స్కిల్స్‌పై పరీక్ష నిర్వహించి, వాటిలో చూపిన ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలను ఆఫర్ చేస్తున్నాయి.
స్పెషలైజ్డ్ ఇన్‌స్టిట్యూట్‌లు:
బ్యాంకుల్లో మిడిల్ లెవల్ మేనేజ్‌మెంట్, స్పెషలైజ్డ్ కేటగిరీల్లో ఉద్యోగాలు కోరుకునేవారికి వివిధ సంస్థలు పీజీ స్థాయిలో కోర్సులు అందిస్తున్నాయి. ఆయా స్పెషలైజేషన్లలో కోర్సులు పూర్తిచేయగానే కొలువులు ఖాయమవుతున్నాయి. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంక్ మేనేజ్‌మెంట్ - పుణె, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంక్ మేనేజ్‌మెంట్ తదితర సంస్థలు ‘ప్రత్యేక’ కోర్సులకు గుర్తింపు పొందాయి.
ఇతర సంస్థలు:
పరీక్షల్లో విజయానికి మార్గాలు
బ్యాంకింగ్ రంగం.. ఉద్యోగాల ముఖచిత్రం:
పరీక్ష విధానం
ప్రిలిమ్స్(గంట):
మెయిన్(రెండు గంటలు):
బ్యాంకింగ్ రంగం... బెస్ట్ ఎవెన్యూ
ఉద్యోగాల్లో స్థిరపడాలనుకునే యువతకు ఇప్పుడు బ్యాంకింగ్ రంగం బెస్ట్ ఎవెన్యూగా నిలుస్తోంది. ఖాళీల భర్తీ పరంగానే కాకుండా, భవిష్యత్తులో ఉన్నత హోదాలు అందించేందుకు మార్గంగా నిలుస్తోంది. కొన్ని ప్రైవేటు బ్యాంకులు పనితీరు ఆధారంగా ఉద్యోగులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. ఇలాంటి వాతావరణంలో ఉద్యోగార్థులు బ్యాంకు కొలువులను లక్ష్యంగా నిర్దేశించుకోవడం మంచిది. ఈ పరీక్షలకు సంబంధించిన సబ్జెక్టులపై పట్టు సాధిస్తే, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, లైఫ్ ఇన్సూరెన్స్, యునెటైడ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వంటి ఇతర సంస్థలు నిర్వహించే పరీక్షలకు కూడా ఉపయోగపడుతుంది.
- మనోజ్ సేథి, కోర్సు డెరైక్టర్, బ్యాంక్ ఎగ్జామ్స్, టైమ్ ఇన్‌స్టిట్యూట్.
సద్వినియోగం చేసుకోవాలి
ప్రభుత్వ రంగ బ్యాంకుల దృక్పథం మారుతోంది. ఇవి బ్యాంకింగ్ సేవల ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యేందుకు విస్తృతంగా విస్తరణ చర్యలు చేపడుతున్నాయి. దీనికి అనుగుణంగా ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సబ్జెక్టు పరిజ్ఞానంతో పాటు సేవా దృక్పథం కూడా ఉంటే కెరీర్ పరంగా త్వరగా ఉన్నత అవకాశాలను అందుకోవచ్చు.
- ఎ.ఎస్.రామశాస్త్రి, డెరైక్టర్, ఐడీఆర్‌బీటీ.

- ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఎస్‌బీఐ, ఎస్‌బీఐ అనుబంధ బ్యాంకులు మినహా మిగిలిన 19 బ్యాంకుల్లో నియామక ప్రక్రియను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్) చేపడుతోంది. క్లరికల్ కేడర్, ప్రొబేషనరీ ఆఫీసర్, స్పెషలిస్టు ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి వేర్వేరుగా పరీక్షలు నిర్వహిస్తోంది. ఐబీపీఎస్ తాజాగా క్లరికల్ నోటిఫికేషన్ విడుదల చేసింది. బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసి, వయసు 21-28 ఉన్నవారు దీనికి అర్హులు. ప్రిలిమినరీ, మెయిన్ రెండు దశల్లో రాత పరీక్ష ఉంటుంది. ఇంగ్లిష్, న్యూమరికల్/క్వాంటిటేటివ్ ఎబిలిటీ, జనరల్ అవేర్‌నెస్, రీజనింగ్, కంప్యూటర్ నైపుణ్యాలను పరీక్షించేలా ప్రశ్నపత్రం ఉంటుంది. ఆన్‌లైన్ పరీక్షలో అర్హత సాధించిన వారికి, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇందులో చూపిన ప్రతిభ ఆధారంగా తుది జాబితా రూపొందిస్తారు.
- ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో అతిపెద్ద గ్రూపుగా పేర్కొనే ఎస్‌బీఐ ప్రత్యేక నోటిఫికేషన్ల ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. ఇది అనుబంధ బ్యాంకుల్లో నియామకాలను కూడా చేపడుతోంది. పీవో నియామకాలకు ప్రిలిమినరీ, మెయిన్‌తో పాటు గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. ఆన్‌లైన్ పరీక్షలో ఇంగ్లిష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, రీజనింగ్, డేటా ఇంటర్‌ప్రిటేషన్, జనరల్ అవేర్‌నెస్, మార్కెటింగ్ అవేర్‌నెస్, కంప్యూటర్ నాలెడ్జ్ తదితర అంశాలుంటాయి.
ప్రైవేటు బ్యాంకులు-నియామక ప్రక్రియ:
ఉద్యోగుల భర్తీకి ప్రైవేటు బ్యాంకులు విభిన్న విధానాలను అనుసరిస్తున్నాయి. ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ బ్యాంకు వంటివి తమ అవసరాలకు తగిన నైపుణ్యాలున్న అభ్యర్థులను నియమించుకునేందుకు అకడమిక్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని.. పీజీ, పీజీ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ కోర్సులను నిర్వహిస్తున్నాయి. ఈ కోర్సులను విజయవంతంగా పూర్తిచేసిన వారికి ఉద్యోగాలిస్తున్నాయి. ఐఐఎం, ఐఐటీ, ఇతర ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్ సంస్థల్లో క్యాంపస్ రిక్రూట్‌మెంట్ల ద్వారా స్పెషలైజ్డ్ ప్రొఫెషనల్స్‌ను నియమించుకుంటున్నాయి. రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ ఎబిలిటీ, కమ్యూనికేషన్ స్కిల్స్‌పై పరీక్ష నిర్వహించి, వాటిలో చూపిన ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలను ఆఫర్ చేస్తున్నాయి.
స్పెషలైజ్డ్ ఇన్‌స్టిట్యూట్‌లు:
బ్యాంకుల్లో మిడిల్ లెవల్ మేనేజ్‌మెంట్, స్పెషలైజ్డ్ కేటగిరీల్లో ఉద్యోగాలు కోరుకునేవారికి వివిధ సంస్థలు పీజీ స్థాయిలో కోర్సులు అందిస్తున్నాయి. ఆయా స్పెషలైజేషన్లలో కోర్సులు పూర్తిచేయగానే కొలువులు ఖాయమవుతున్నాయి. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంక్ మేనేజ్‌మెంట్ - పుణె, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంక్ మేనేజ్‌మెంట్ తదితర సంస్థలు ‘ప్రత్యేక’ కోర్సులకు గుర్తింపు పొందాయి.
ఇతర సంస్థలు:
- నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంక్ మేనేజ్‌మెంట్-ముంబై; కోర్సు: పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ అండ్ ఫైనాన్షియల్ ఇంజనీరింగ్.
- నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ రీసెర్చ్- చెన్నై; కోర్సు: పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ ఇన్ ఫైనాన్షియల్ ఇంజనీరింగ్.
- బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ- గ్రేటర్ నోయిడా; కోర్సు: పీజీ డిప్లొమా ఇన్ ఇన్సూరెన్స్ బిజినెస్ మేనేజ్‌మెంట్.
- ఆసియా పసిఫిక్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్- న్యూఢిల్లీ; కోర్సు: పీజీ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్.
పరీక్షల్లో విజయానికి మార్గాలు
- ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల నియామక పరీక్షల్లో సాధారణంగా అడిగే అంశాలు.. ఇంగ్లిష్, రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ ఎబిలిటీ, జనరల్ అవేర్‌నెస్, కంప్యూటర్ నాలెడ్జ్.
- ఇంగ్లిష్ విభాగంలో మంచి స్కోర్ సాధించాలంటే బేసిక్ గ్రామర్‌పై పట్టు సాధించాలి. సెంటెన్స్ కరెక్షన్, సెంటెన్స్ ఫార్మేషన్ ప్రశ్నలకు కచ్చితమైన సమాధానాలు గుర్తించేలా ప్రాక్టీస్ చేయాలి. ఎస్సే రైటింగ్ నైపుణ్యాలు పెంపొందించుకోవాలి.
- జనరల్ అవేర్‌నెస్‌కు సంబంధించి ప్రధానంగా వ్యాపార, వాణిజ్య రంగాలకు సంబంధించిన తాజా పరిణామాలపై దృష్టిసారించాలి. బ్యాంకింగ్ రంగ విధి విధానాలు, కొత్త పథకాలు గురించి తెలుసుకోవాలి.
- కంప్యూటర్ నాలెడ్జ్/అవేర్‌నెస్ విభాగంలో ఎక్కువ మార్కులు సాధించాలంటే కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్స్, షార్ట్‌కట్ కమాండ్స్, ఎంఎస్ ఆఫీస్, ఎక్సెల్ సాఫ్ట్‌వేర్ అంశాలపై అవగాహన అవసరం.
- రీజనింగ్, మెంటల్ ఎబిలిటీలకు సంబంధించి బ్లడ్ రిలేషన్స్, కోడింగ్-డీకోడింగ్, దిశలు (డెరైక్షన్స్), సీటింగ్ అరేంజ్‌మెంట్ అంశాలపై పట్టుసాధించాలి.
- న్యూమరికల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ విషయంలో సంఖ్యా వ్యవస్థ, సగటులు-శాతాలు, కాలం-దూరం, కాలం-పని తదితర అంశాలకు సంబంధించిన ప్రశ్నలను బాగా ప్రాక్టీస్ చేయాలి.
- నిరంతరం ప్రాక్టీస్ చేయడం, వేగంగా కాలిక్యులేషన్స్ చేయడం వంటివి అలవర్చుకోవాలి.
- మాక్ టెస్ట్‌లు, ప్రాక్టీస్ టెస్ట్‌లు రాయటం, చేసిన తప్పులను సరిదిద్దుకోవడం విజయానికి కీలకం.
బ్యాంకింగ్ రంగం.. ఉద్యోగాల ముఖచిత్రం:
- 2022 నాటికి 3.16 మిలియన్ల అభ్యర్థులు అవసరం.
- 2017 నాటికి 0.48 మిలియన్ల నియామకాలు.
- వచ్చే అయిదేళ్లలో ఐబీపీఎస్ ద్వారా 16 వేల ఆఫీసర్ పోస్టులు, 30 వేల క్లర్క్ పోస్టులు, 3,700 స్పెషలిస్టు కేటగిరీ పోస్టులను భర్తీ చేయాలనేది లక్ష్యం.
- మొత్తం నియామకాల్లో సేల్స్ అండ్ బిజినెస్ డెవలప్‌మెంట్ విభాగంలో 35 శాతం, కస్టమర్ రిలేషన్స్ విభాగంలో 35 శాతం, స్పెషలిస్టు కేటగిరీ/బ్యాక్ ఆఫీస్ విభాగాల్లో 30 శాతం నియాకాలు ఉంటాయి.
పరీక్ష విధానం
ప్రిలిమ్స్(గంట):
విభాగం | ప్రశ్నలు | మార్కులు |
ఇంగ్లిష్ లాంగ్వేజ్ | 30 | 30 |
న్యూమరికల్ ఎబిలిటీ | 35 | 35 |
రీజనింగ్ ఎబిలిటీ | 35 | 35 |
మొత్తం | 100 | 100 |
మెయిన్(రెండు గంటలు):
విభాగం | ప్రశ్నలు | మార్కులు |
రీజనింగ్ | 40 | 40 |
ఇంగ్లిష్ లాంగ్వేజ్ | 40 | 40 |
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ | 40 | 40 |
జనరల్ అవేర్‌నెస్ (బ్యాంకింగ్ రంగానికి ప్రాధాన్యం) | 40 | 40 |
కంప్యూటర్ నాలెడ్జ్ | 40 | 40 |
మొత్తం | 200 | 200 |
బ్యాంకింగ్ రంగం... బెస్ట్ ఎవెన్యూ
ఉద్యోగాల్లో స్థిరపడాలనుకునే యువతకు ఇప్పుడు బ్యాంకింగ్ రంగం బెస్ట్ ఎవెన్యూగా నిలుస్తోంది. ఖాళీల భర్తీ పరంగానే కాకుండా, భవిష్యత్తులో ఉన్నత హోదాలు అందించేందుకు మార్గంగా నిలుస్తోంది. కొన్ని ప్రైవేటు బ్యాంకులు పనితీరు ఆధారంగా ఉద్యోగులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. ఇలాంటి వాతావరణంలో ఉద్యోగార్థులు బ్యాంకు కొలువులను లక్ష్యంగా నిర్దేశించుకోవడం మంచిది. ఈ పరీక్షలకు సంబంధించిన సబ్జెక్టులపై పట్టు సాధిస్తే, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, లైఫ్ ఇన్సూరెన్స్, యునెటైడ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వంటి ఇతర సంస్థలు నిర్వహించే పరీక్షలకు కూడా ఉపయోగపడుతుంది.
- మనోజ్ సేథి, కోర్సు డెరైక్టర్, బ్యాంక్ ఎగ్జామ్స్, టైమ్ ఇన్‌స్టిట్యూట్.
సద్వినియోగం చేసుకోవాలి
ప్రభుత్వ రంగ బ్యాంకుల దృక్పథం మారుతోంది. ఇవి బ్యాంకింగ్ సేవల ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యేందుకు విస్తృతంగా విస్తరణ చర్యలు చేపడుతున్నాయి. దీనికి అనుగుణంగా ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సబ్జెక్టు పరిజ్ఞానంతో పాటు సేవా దృక్పథం కూడా ఉంటే కెరీర్ పరంగా త్వరగా ఉన్నత అవకాశాలను అందుకోవచ్చు.
- ఎ.ఎస్.రామశాస్త్రి, డెరైక్టర్, ఐడీఆర్‌బీటీ.
Published date : 07 Aug 2015 11:51AM