త్వరలో గూప్-3 పోస్టులకు నోటిఫికేషన్
Sakshi Education
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని గ్రూప్-3 కేటగిరీలో మరో 670 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫిబ్రవరి 22 లేదా 23 తేదీల్లో నోటిఫికేషన్ జారీ చేయనుంది.
ఇందుకు సంబంధించి ఫిబ్రవరి 21న నిర్వహించిన కమిషన్ బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఆబ్జెక్టివ్ ప్రశ్నలతో నిర్వహించే వివిధ కేటగిరీల పోస్టులకు సంబంధించి ఆయా అభ్యర్థుల మాధ్యమాలను అనుసరించి తెలుగు, ఆంగ్లం రెండింటిలోనూ ప్రశ్నలను ఇవ్వాలని నిర్ణయించారు. వ్యాసరూప సమాధానాలతో ముడిపడి ఉన్న గ్రూప్1లోని మెయిన్స్ పరీక్షలకు ఇది వర్తించదు. ఇంజినీరింగ్, వైద్య విభాగాలకు సంబంధించిన క్వాలిఫికేషన్ల కోర్సులు ఆంగ్ల మాధ్యమంలోనే ఉంటాయి కనుక వాటికి ఆంగ్లంలోనే ప్రశ్నలు ఉండనున్నాయి. తెలుగు, ఆంగ్ల మాధ్యమాలు రెండింటిలోనూ ఉండే కోర్సులు క్వాలిఫికేషన్‌గా నిర్ణయించే పోస్టుల పరీక్షలకు మాత్రం 2 భాషల్లోనూ ప్రశ్నలు ఇవ్వనున్నారు.
Published date : 22 Feb 2019 04:00PM