త్వరలో గూప్-1, 2 కొత్త సిలబస్
Sakshi Education
గుడ్లవల్లేరు (గుడివాడ): గ్రూప్-1, గ్రూప్-2ల కొత్త సిలబస్‌ను నాలుగైదు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామని ఏపీపీఎస్సీ చైర్మన్ పి.ఉదయభాస్కర్ వెల్లడించారు.
కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల్లో అక్టోబర్ 8న ఇస్రో, షార్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ అంతరిక్ష వారోత్సవాల ముగింపు సదస్సుకు ఆయన విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఏపీలో 18 వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. ఏపీపీఎస్సీ ద్వారా 5 నుంచి 6 వేల ఉద్యోగాలను అక్టోబర్ నుంచి డిసెంబర్ చివరి లోపు భర్తీ చేస్తామన్నారు. వయో పరిమితిపై ప్రభుత్వ నిర్ణయం మేరకు సడలింపు ఉంటుందని తెలిపారు.
Published date : 09 Oct 2018 02:26PM