సివిల్ అసిస్టెంట్ సర్జన్ల నియామక నోటిఫికేషన్ జారీ
Sakshi Education
సాక్షి, అమరావతి: ఏపీ వైద్యవిధాన పరిషత్ పరిధిలోని 129 సివిల్ అసిస్టెంట్ సర్జన్ల (స్పెషలిస్టు) పోస్టుల భర్తీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తులను అక్టోబర్ 4 నుంచి నవంబర్ 3వ తేదీ వరకు స్వీకరించనుంది. ఆన్‌లైన్ దరఖాస్తు ఫీజు చెల్లింపునకు నవంబర్ 3వ తేదీ రాత్రి 11.59 నిమిషాల వరకు గడువు ఇచ్చింది. www.psc.ap.gov.in వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ దరఖాస్తును అందుబాటులో ఉంచుతున్నట్లు కమిషన్ కార్యదర్శి వైవీఎస్‌టీ సాయి అక్టోబర్ 3న పేర్కొన్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసేముందు ఆయా అభ్యర్థులు ముందుగా కమిషన్ వెబ్‌సైట్లో ‘వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్’(ఓటీపీఆర్) ద్వారా తమ బయోడేటా వివరాల్ని రిజిస్టర్ చేసుకోవాలి. దరఖాస్తులు 25 వేలకు మించి అందితే కమిషన్ ముందుగా స్క్రీనింగ్ టెస్టును నిర్వహిస్తుంది. స్క్రీనింగ్ టెస్టు తేదీని తర్వాత ప్రకటిస్తారు. మెయిన్‌స పరీక్షను ఆన్‌లైన్ విధానంలో ఈ ఏడాది డిసెంబర్ 4, 5 తేదీల్లో నిర్వహిస్తారు.
Published date : 04 Oct 2017 02:01PM