Skip to main content

ఫిబ్రవరి 17 నుంచి జేఎల్ పోస్టులకు మెయిన్ పరీక్షలు

సాక్షి, అమరావతి: ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో లెక్చరర్ పోస్టుల భర్తీకి ఫిబ్రవరి17వ తేదీ నుంచి మెయిన్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ ఫిబ్రవరి11 (సోమవారం)న ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 20 వరకు ఇవి జరగనున్నాయి.
‘ఫిషరీస్’ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన
ఫిషరీస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ పోస్టులకు ప్రాథమికంగా ఎంపికై న అభ్యర్థుల జాబితాను ఏపీపీఎస్సీ సోమవారం ప్రకటించింది. వీరి ధ్రువపత్రాలను మార్చి 4, 5 తేదీల్లో పరిశీలించనున్నట్లు పేర్కొంది. అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫిషరీస్ పోస్టులకు ఎంపికై న అభ్యర్థుల ధ్రువపత్రాలు మార్చి 5న పరిశీలన చేస్తారు.
Published date : 11 Feb 2020 01:14PM

Photo Stories