Skip to main content

పంచాయతీ సెక్రెటరీ కటాఫ్ 45 - 55?

సాక్షి, హైదరాబాద్: పంచాయతీ సెక్రెటరీ ఉద్యోగాలకు రావ్యాప్తంగా ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-3 ప్రిలిమినరీ పరీక్ష ఏప్రిల్ 23న ముగిసింది. మొత్తం 1055 పోస్టులకు 5.66 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా 3.67 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు.
రెండ్రోజుల్లో ఆధికారిక కీ ని విడుదల చేయడంతో పాటు దానిపై అభ్యంతరాలను స్వీకరించి త్వరలోనే ఫలితాలు విడుదల చేస్తామని కమీషన్ కార్యదర్శి వైవీఎస్‌టీ సాయి తెలిపారు. ఇందులో అర్హత సాధించిన వారికి జులై 16న మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తామన్నారు.

మెయిన్స్‌కు 1 : 50 చొప్పున మొత్తం 52750 మందిని మాత్రమే ఎంపిక చేస్తామని ఏపీపీఎస్సీ ముందే ప్రకటించింది. మెయిన్స్ పరీక్షకు ఇంకా 80 రోజుల సమయం మాత్రమే ఉంది. కాబట్టి అందుబాటులో ఉన్న కీ ఆధారంగా మీ మార్కులు నమోదు చేసి కటాఫ్ ఎంత ఉంటుందో ఒక అంచనాకు వస్తే ఆందోళన తగ్గుతుంది. అటు మొయిన్స్‌కు సిద్ధమవచ్చు.

కటాఫ్ 45 - 55?
ఏపీపీఎస్సీ చరిత్రలోనే మొదటిసారిగా పంచాయతీ సెక్రెటరీ పరీక్షలో రుణాత్మక మార్కుల (Negative Marking) విధానం ప్రవేశపెట్టింది. అంటే ఒక తప్పు సమాధానానికి 0.33 శాతం మార్కులు కోత విధిస్తారు. దీంతో పాటు ప్రశ్నాపత్రం కూడా కఠినంగానే ఉందని సబ్జెక్టు నిపుణులు, అభ్యర్థులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కటాఫ్ కూడా 45 నుంచి 55 మధ్యలోనే ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Published date : 24 Apr 2017 12:30PM

Photo Stories