పాలిటెక్నిక్ లెక్చరర్ మెయిన్స్ కు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోండి: ఏపీపీఎస్సీ
Sakshi Education
సాక్షి, అమరావతి: పాలిటెక్నిక్ కళాశాలల్లో లెక్చరర్ పోస్టుల భర్తీకి మార్చి 12వ తేదీ నుంచి నిర్వహించే మెయిన్స్ పరీక్షల హాల్ టికెట్లను ఏపీపీఎస్సీ సిద్ధం చేసింది.
ఫిబ్రవరి 25 (మంగళవారం)నుంచి అభ్యర్థులు హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చునని కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పరీక్షలు కంప్యూటర్ ఆధారితంగా మార్చి 15 వరకు జరగనున్నాయి.
Published date : 26 Feb 2020 03:22PM