నవంబర్20న డీఈఐఈ పోస్టులకు ధ్రువపత్రాల పరిశీలన..
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార ప్రజా సంబంధాల శాఖలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్(డీఈఐఈ) పోస్టులకు అర్హత సాధించిన..
అభ్యర్థుల సర్టిఫికెట్లను నవంబర్20న పరిశీలిస్తామని ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఎదురుగా ఉన్న ఏపీపీఎస్సీ కార్యాలయానికి తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు.
Published date : 06 Nov 2019 04:48PM