ముగిసిన ఏపీపీఎస్సీ గ్రూప్1 మెయిన్స్..
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నిర్వహిస్తున్న గ్రూప్1 మెయిన్స్ పరీక్షల్లో ఆదివారం చివరి పేపర్ పరీక్షకు మొత్తం 81.11 శాతం మంది హాజరయ్యారని కమిషన్ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
డిసెంబర్ 14వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ పరీక్షలు ఆదివారంతో ముగిశాయి. మొత్తం 9679 మంది మెయిన్స్‌కు అర్హులుగా ఎంపిక కాగా వారిలో 8,392 మంది అభ్యర్థులు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నారు. వారిలో ఆదివారం నాటి పేపర్ 5 పరీక్షకు 6807 మంది హాజరయ్యారని ఆయన వివరించారు.
Published date : 21 Dec 2020 03:31PM