Skip to main content

మే 5న గ్రూప్-2 స్క్రీనింగ్ టెస్ట్..అదే రోజు ఎల్‌ఐసీ ఏఏఓ పరీక్ష

సాక్షి, గుంటూరు: ఒకే రోజున రెండు పోటీ పరీక్షలు నిర్వహిస్తుండటంతో నిరుద్యోగులు సంకట స్థితిలో చిక్కుకున్నారు.
ప్రస్తుతం గ్రూప్-2 అభ్యర్థులు ఇదే విషయంపై తీవ్ర ఆందోళనతో ఉన్నారు. 446 గ్రూప్-2 పోస్టులకు మే 5న ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించనుంది. ఈ పోస్టులకు మొత్తం మూడు లక్షల మందికిపైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే, అదే రోజున ఎల్‌ఐసీ ఏఏఓ (గ్రాడ్యుయేట్ లెవల్) పరీక్షలు జరగనున్నాయి. గ్రూప్-2 స్క్రీనింగ్ టెస్ట్ రాయబోతున్నవారిలో చాలామంది ఎల్‌ఐసీ ఏఏఓ పరీక్షకు కూడా దరఖాస్తు చేశారు. దీంతో రెండింటిలో ఏ పరీక్షకు హాజరుకావాలో అర్థం కాక అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. అంతేకాకుండా వీఆర్‌ఏలు, వీవోఏలు, కానిస్టేబుల్, ఇతర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారు సైతం గ్రూప్-2 పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. వీరందరూ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సెలవులు లభించక గ్రూప్-2 పరీక్షలకు సన్నద్ధం కాలేకపోయారు. దీంతో వాళ్లంతా పరీక్షలు వాయిదా వేయాలని లేకుంటే అవకాశం కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Published date : 23 Apr 2019 01:42PM

Photo Stories