మే 5న ఎంసెట్ ఫలితాలు
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా తదితర కోర్సుల ప్రవేశాలకు సంబంధించిన ఏపీ ఎంసెట్-2017 ఫలితాలు ఈనెల 5న విడుదల కానున్నాయి.
విజయవాడలోని స్టేట్ గెస్టు హౌస్‌లో మధ్యాహ్నం 3 గంటలకు మంత్రులు గంటా శ్రీనివాసరావు, కామినేని శ్రీనివాస్, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఆదినారాయణరెడ్డిల సమక్షంలో ఈ ఫలితాలు వెల్లడించనున్నట్లు ఎంసెట్ ఛైర్మన్ ప్రొఫెసర్ వీఎస్‌ఎస్ కుమార్ తెలిపారు. కార్యక్రమానికి ఉన్నత విద్యామండలి ఛైర్మన్ విజయరాజు, వైస్ ఛైర్మన్లు నరసింహరావు, వల్లీకుమారి, కార్యదర్శి వరదరాజన్, సెట్ల ప్రత్యేకాధికారి కె.రఘునాథ్ హాజరుకానున్నారు. ఫలితాలను గతంలో కంటే మూడు రోజులు ముందుగా ప్రకటిస్తున్నామని కన్వీనర్ సారుుబాబు తెలిపారు. ఫలితాలు విడుదలైన అరగంట తరువాత ర్యాంకుల సంక్షిప్త సందేశాలను విద్యార్ధుల మొబైల్ నంబర్లకు పంపిస్తామన్నారు.
Published date : 04 May 2017 07:31PM