Skip to main content

Group I: గ్రూప్‌–1 పరీక్షపై హైకోర్టు కీలక తీర్పు

గ్రూప్‌–1 ప్రధాన పరీక్ష జవాబు పత్రాలను సంప్రదాయ పద్ధతిలో మాన్యువల్‌గానే మూల్యాంకనం చేయించాలని ఏపీ పబ్లిక్‌ సరీ్వస్‌ కమిషన్ (ఏపీపీఎస్‌సీ)ను హైకోర్టు ఆదేశించింది.
Group I
గ్రూప్‌–1 పరీక్షపై హైకోర్టు కీలక తీర్పు

ఈ వ్యవహారం ఎంతోమంది ఔత్సాహికుల జీవితాలతో ముడిపడి ఉన్న నేపథ్యంలో సమాధాన పత్రాల మూల్యాంకన ప్రక్రియను మూడు నెలల్లో పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ ముగిసిన తరువాత అర్హులైన అభ్యర్థులను మౌఖిక ఇంటర్వూ్యలకు ఆహా్వనించాలంది. ఆ తరువాత మిగిలిన ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని తేల్చి చెప్పింది. ప్రస్తుత నోటిఫికేషన్ లో మూల్యాంకన విధానాన్ని మార్చడం సరికాదని, మూల్యాంకన విధానాన్ని మార్చిన సంగతి నోటిఫికేషన్ నిబంధనల ప్రకారం అభ్యర్థులందరికీ తెలియజేయాల్సి ఉన్నా, ఆ పని చేయలేదని ఆక్షేపించింది. భవిష్యత్లో డిజిటల్ మూల్యాంకనం లేదా ఇతర ఆధునిక విధానాల్లో మూల్యాంకనం చేపట్టేందుకు ఈ తీర్పు ఎంత మాత్రం అడ్డంకి కాదని, ఏ మూల్యాంకనం అయినా చట్ట నిబంధనలకు లోబడే ఉండాలని స్పష్టం చేసింది. ఇదే సమయంలో జవాబు పత్రాలను థర్డ్పార్టీ చేత డిజిటల్ విధానంలో మూల్యాంకనం చేయించడంపై స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించాలన్న పిటిషనర్ల అభ్యర్థనను, ప్రధాన పరీక్ష మొత్తం ప్రక్రియపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలన్న అభ్యర్థనను తోసిపుచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు తీర్పు వెలువరించారు. పలువురు అభ్యర్థుల సమాధాన పత్రాలను ఏపీపీఎస్సీ కోర్టు ముందుంచిన నేపథ్యంలో వాటిని వెనక్కి ఇచ్చేయాలని రిజిస్ట్రీని న్యాయమూర్తి ఆదేశించారు. డిజిటల్ మూల్యాంకనం విషయంలో సమరి్పంచిన సీల్డ్ కవర్లను మాత్రం జాగ్రత్త చేయాలని రిజిస్ట్రీని ఆదేశించారు.

చైర్మన్ బాధ్యతల్ని లాక్కోవడానికి వీల్లేదు

నిబంధనలను సవరించడం ద్వారా ఏపీపీఎస్సీ చైర్మన్ హక్కులను, బాధ్యతలను లాక్కోవడానికి వీల్లేదని, కారణం ఏదైనా కూడా ఒకవేళ కమిషన్ కు చైర్మన్ సహకరించకుంటే రాజ్యాంగంలోని అధికరణ 316(1–ఏ) కింద తాత్కాలిక చైర్మన్ ను నియమించాలని గవర్నర్ను కోరవచ్చని న్యాయమూర్తి జస్టిస్ సోమయాజులు తన తీర్పులో పేర్కొన్నారు. కీలక విషయాలు కోర్టుకు వెల్లడించలేదు ఈ మొత్తం వ్యవహారంలో ఏపీపీఎస్ïసీ పలు కీలక విషయాలను కోర్టుకు వెల్లడించలేదని న్యాయమూర్తి ఆక్షేపించారు. కోర్టుకు సీల్డ్ కవర్లలో సమరి్పంచిన వివరాలు కూడా పూర్తిగా లేవన్నారు. మూల్యాంకనం చేసే వ్యక్తుల నైపుణ్యం తదితర విషయాలను కూడా కోర్టుకు పూర్తిస్థాయిలో చెప్పలేదన్నారు. రూల్స్ ఆఫ్ ప్రొసీజర్కు సవరణలు చేసినప్పుడు వాటిని జీవో ద్వారా నోటిఫై చేయాల్సి ఉంటుందన్నారు. రూల్స్ ఆఫ్ ప్రొసీజర్కు చేసిన సవరణలు అసలు రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా లేవన్నారు. గ్రూప్–1 ప్రధాన పరీక్షకు సంబంధించిన సమాధాన పత్రాలను డిజిటల్ పద్ధతిలో మూల్యాంకనం చేసే బాధ్యతలను థర్డ్ పారీ్టకి అప్పగించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన విషయం విదితమే. వ్యాజ్యాలన్నింటిపై న్యాయమూర్తి ఇటీవల తుది విచారణ జరిపి తీర్పు వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం తీర్పును వెలువరించారు.

చదవండి: 

ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు విడుదల

ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్‌..13 ప్రాంతీయ భాషల్లో పరీక్షలు!

Published date : 02 Oct 2021 03:15PM

Photo Stories