హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
Sakshi Education
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 39 హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డిసెంబర్ 13న నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ పోస్టులకు డిసెంబర్ 14 నుంచి జనవరి 3వ తేదీవరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. జనవరి రెండో తేదీ రాత్రి 11.59 గంటల వరకు ఆన్‌లైన్లో నిర్ణీత రుసుము చెల్లించాలి. ఏప్రిల్ 3, 4 తేదీల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహిస్తారు.
Published date : 14 Dec 2018 01:51PM