గ్రూప్-2,3 పరీక్షలు వాయిదా వేయాలి
Sakshi Education
ఏపీపీఎస్సీకి ఎమ్మెల్సీ లక్ష్మణరావు వినతి
సాక్షి అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏప్రిల్ 21న జరగనున్న గ్రూప్-3, పంచాయతీ కార్యదర్శుల ప్రిలిమినరీ పరీక్షను, మే 5న జరగనున్న గ్రూప్-2 ప్రిలిమినరీ పరీక్షను నెల రోజులు వాయిదా వేయాలని ఎమ్మెల్సీ కె.యస్.లక్ష్మణరావు ఏపీపీఎస్సీ చైర్మన్ పి.ఉదయభాస్కర్‌ను కోరారు. ఈమేరకు ఆయన శుక్రవారం చైర్మన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం, 21వ తేదీ ఈస్టర్ పండుగ ఉన్నదని ఆయన చైర్మన్‌కు తెలిపారు. 21న తెలంగాణలోనూ ఎస్సై మెయిన్ పరీక్షతోపాటు మరికొన్ని పరీక్షలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈనేపథ్యంలో అభ్యర్థులకు వెసులుబాటు ఉండేలా పరీక్షలను నెలరోజులు వాయిదా వేయాలని కోరారు. దీనిపై చైర్మన్ పి.ఉదయభాస్కర్ స్పందిస్తూ ఈ అంశాన్ని మంగళవారం జరిగే ఏపీపీఎస్సీ సమావేశంలో పరిశీలిస్తామని తెలిపారు. కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ ఉపాధ్యక్షులు బి.లక్ష్మణరావు, కె.యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.
Published date : 13 Apr 2019 03:42PM