గ్రూప్–2 లోకల్ జోన్ సవరణలకు అవకాశం
Sakshi Education
సాక్షి, అమరావతి: గ్రూప్2 – 2016 నోటిఫికేషన్‌కు సంబంధించి అనేక మంది అభ్యర్థుల లోకల్ జోన్ ఆప్షన్లలో సరైన స్పష్టత కానరానందున లోకల్ స్టేటస్, నాన్ క్రిమీలేయర్ స్టేటస్ అంశాలను మరోసారి నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి వైవీఎస్‌టీ సాయి నవంబర్ 17న ఒక ప్రకటనలో తెలిపారు.
నవంబర్ 21 వరకు ఈ అవకాశం వెబ్‌సైట్లో అందుబాటులో ఉంటుందన్నారు. అభ్యర్థులు తమ లాగిన్ ఐడీ ద్వారా మార్పులకు సంబంధించిన సమాచారాన్ని పొందుపరచాలని పేర్కొన్నారు.
Published date : 18 Nov 2017 02:42PM