గ్రూప్-2 ఎంపిక జాబితా విడుదల
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రపదేశ్‌లో 2016 గ్రూప్-2 నోటిఫికేషన్‌కు సంబంధించి నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఎంపికై న అభ్యర్థుల జాబితాను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మార్చి 21న విడుదల చేసింది.
540 పోస్టులకుగాను 17 పోస్టులకు మినహాయించి తక్కినవారి జాబితాను ప్రకటించింది. ప్రత్యేక కేటగిరీలకు చెందిన ఆయా పోస్టులకు అర్హులైన అభ్యర్థులు లేకపోవడంతో వాటిని ఖాళీగా పేర్కొంది. ఈ మేరకు ఏపీపీఎస్సీ కార్యదర్శి వైవీఎస్‌టీ సాయి ప్రకటన విడుదల చేశారు. ఫలితాల వివరాలను www.psc.ap.gov.in లో పొందుపరిచారు. కంప్యూటర్ నైపుణ్యానికి సంబంధించిన కేటగిరీ పోస్టులకు ఎంపికై నవారికి ఏప్రిల్ 2 నుంచి సంబంధిత పరీక్షలను విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో నిర్వహించనున్నారు. ఈ నైపుణ్య పరీక్షలో వారు ఉత్తీర్ణులు అయితేనే ఆయా పోస్టులకు ఎంపికైనట్లు ప్రకటిస్తారు. లేకపోతే మెరిట్ జాబితాలోని తదుపరి అభ్యర్థికి అవకాశం కల్పించనున్నారు. కాగా, ఆయా పోస్టులకు ఎంపికై నవారి ధ్రువపత్రాల పరిశీలన, ఇతర సమాచారం పూర్తిగా నిర్ధారణ అయ్యాకే పోస్టుల్లో నియమిస్తారు. అలాగే గ్రూప్-2పై న్యాయస్థానాల్లో ఉన్న వివిధ కేసుల తుది తీర్పులకు లోబడి మార్పులు చేర్పులు ఉంటాయని కమిషన్ వర్గాలు వివరించాయి. అయితే వివిధ కోర్టుల్లో కేసులు పెండింగ్‌లో ఉన్నా ఫలితాలు విడుదల చేయడాన్ని వేలాది మంది అభ్యర్థులు విమర్శిస్తున్నారు. గ్రూప్-2 నిర్వహణలో అనేక సమస్యలు ఎదురయ్యాయని వాటిపై కమిషన్‌కు వేలాది మంది ఫిర్యాదు చేసినా వాటిని పరిష్కరించకుండా ఫలితాలను ప్రకటించడం అన్యాయమని అంటున్నారు. కాగా, గ్రూప్-2 ప్రిలిమ్స్ నిర్వహణలో సమస్యలు తలెత్తగా ఆ తర్వాత మెయిన్స్ లోనూ తీవ్ర గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. విశాఖ, చీరాల తదితర ప్రాంతాల్లో కంప్యూటర్లు మొరాయించడంతో ఆన్‌లైన్ పరీక్ష అస్తవ్యస్తంగా మారింది. దీనిపై ట్రిబ్యునల్‌లో కేసులు దాఖలయ్యాయి. ఈ పరీక్షల్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారంటూ పలువురు అభ్యర్థులపైనా కమిషన్ చర్యలు తీసుకుంది. అయితే ఆయా అభ్యంతరాలు, కేసులపై తుది నిర్ణయం రాకముందే ఫలితాలను ప్రకటించడంపై అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
జోన్లు, హెచ్‌వోడీల వారీగా ఎంపిక జాబితా :
జోన్లు వారీగా, హెచ్‌వోడీల వారీగా, జిల్లాల వారీగా ఎంపిక జాబితాను కమిషన్ వెబ్‌సైట్లో పొందుపరిచింది. పోస్టు కోడ్ 9, 10, 11, 12, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32లకు ఏప్రిల్ 2 నుంచి నైపుణ్య పరీక్ష నిర్వహించనున్నారు. కాగా, పోస్టు కోడ్ నెంబర్లు 14, 15, 16లకు ఆప్షన్ ఇచ్చిన పలువురు అభ్యర్థులను పోస్టులకు అర్హతలేనివారిగా గుర్తించి కమిషన్ తిరస్కరించింది. పరీక్షల్లో ఉత్తీర్ణులైనప్పటికీ 81 మంది ఇలా అర్హతను కోల్పోయారు.

Published date : 22 Mar 2018 02:40PM