గ్రూప్-1 పరీక్షలను వాయిదా వేయాలి..ఎందుకంటే ..?
Sakshi Education
సాక్షి, అమరావతి: గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలని సీఎం వైఎస్ జగన్‌ను కోరుతూ ఆ పరీక్షలకు కొత్తగా అర్హత సాధించిన అభ్యర్థులు డిసెంబర్ 5వ తేదీన సీఎం క్యాంపు కార్యాలయంలో వినతిపత్రం అందించారు.
డిసెంబర్ 14 నుంచి మెయిన్స్ పరీక్షల నిర్వహణకు ఏపీపీఎస్సీ ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసి, తదుపరి ఏర్పాట్లు పూర్తి చేసి హాల్‌టిక్కెట్లు పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. ప్రిలిమినరీ పరీక్షల్లో కొన్ని ప్రశ్నల కీలు తప్పుగా ఉండడంతో వాటిని పరిష్కరించి కొత్తగా అర్హులైన వారికి కూడా మెయిన్స్ కు అవకాశం ఇవ్వాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు ఇవ్వడంతో ఏపీపీఎస్సీ ఆ మేరకు 1,378 మందితో ఇంతకుముందు జాబితాను విడుదల చేశారు. తమకు మెయిన్స్ కు సన్నద్ధత కోసం తగినంత సమయం ఇవ్వకుండా పరీక్షలు పెట్టడం వల్ల నష్టపోతామని, కొంత గడువు ఇచ్చి పరీక్షలు నిర్వహించాలని అభ్యర్థులు విన్నవించారు.
Published date : 07 Dec 2020 04:41PM