Skip to main content

ఎస్‌జీటీ సిలబస్ రెట్టింపు

సాక్షి, అమరావతి: డీఎస్సీ-2018కి సంబంధించి ఎస్జీటీ పోస్టుల సిలబస్‌ను రెట్టింపు చేస్తూ ఆంధ్రప్రదేశ్రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొత్త సిలబస్‌ను నవంబర్ 14 రాత్రి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది. పెరిగిన సిలబస్‌ను చూసి అభ్యర్థులు తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 23 వేల పోస్టులు ఖాళీగా ఉన్నా కేవలం ఏడువేల పోస్టులను మాత్రమే ప్రభుత్వం ప్రకటించింది. వీటిలో ఎస్జీటీ పోస్టులు 3,000 వరకు ఉన్నాయి. ఎస్జీటీ అభ్యర్థులకు కేవలం టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (టీఆర్‌టీ) మాత్రమే నిర్వహించాల్సి ఉన్నప్పటికీ ప్రభుత్వం టీఆర్‌టీతో పాటు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్)ను కూడా కలిపి పెడుతోంది. మరోవైపు.. 20రోజుల్లో పరీక్షలు ముంచుకొస్తున్నాయని సతమతమవుతున్న అభ్యర్థులపై ప్రభుత్వం అకస్మాత్తుగా మరింత భారాన్ని మోపింది. ఇప్పటివరకు 8వ తరగతి వరకే పరిమితమై ఉన్న ఎస్‌జీటీ సిలబస్‌ను ఇప్పుడు 10వ తరగతి పాఠ్యాంశాల వరకు పెంచింది. మెథడాలజీలో గత డీఎస్సీలో ఉన్న సిలబస్‌తో పాటు అంతకుముందు రెండు మూడు డీఎస్సీల సిలబస్‌ను కూడా కొత్తగా చేర్చింది. అలాగే, సైకాలజీ అంశాలను కూడా రెట్టింపు చేశారు.

ఎస్జీటీ కొత్త సిలబర్ కోసం క్లిక్ చేయండి
Published date : 15 Nov 2018 03:37PM

Photo Stories