Skip to main content

ఏప్రిల్ 7 నుంచి ఏపీపీఎస్సీ గ్రూప్1 మెయిన్స్ పరీక్షలు

సాక్షి, అమరావతి: గ్రూప్1 మెయిన్స్ పరీక్షలు ఏప్రిల్ 7వ తేదీ నుంచి 19 వరకు జరగనున్నాయి.
ఈమేరకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు జనవరి 23 (గురువారం)నరివైజ్డ్ షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఫిబ్రవరి 4 నుంచి 16 వరకు ఈ పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా పలువురు అభ్యర్థుల నుంచి పరీక్షలు వాయిదా వేయాలని విన్నపాలు అందడంతో కమిషన్ ఇటీవల పరీక్షల్ని వాయిదా వేస్తూ ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే.

తేదీల వారీగా, పేపర్ల వారీగా ఆయా పరీక్షల రివైజ్డ్ షెడ్యూల్ ఇలా...
ఏప్రిల్ 7:
తెలుగుపేపర్ (క్వాలిఫయింగ్ నేచర్)
ఏప్రిల్ 8: ఇంగ్లిష్ పేపర్ (క్వాలిఫయింగ్ నేచర్)
ఏప్రిల్ 11: పేపర్1
ఏప్రిల్ 13: పేపర్2
ఏప్రిల్ 15: పేపర్3
ఏప్రిల్ 17: పేపర్4
ఏప్రిల్ 19: పేపర్5
వీటితో పాటు గెజిటెడ్ పోస్టులకు సంబంధించిన షెడ్యూల్‌ను కూడా ఏపీపీఎస్సీ ప్రకటించింది.

ఆ షెడ్యూల్ ఇలా..

మే 10, 11

అసిస్టెంట్ బీసీ, సోషల్,

ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్

మే 11

మైనింగ్ రాయల్టీ ఇన్‌స్పెక్టర్

మే 12




సివిల్ అసిస్టెంట్ సర్జన్స్,

టెక్నికల్ అసిస్టెంట్ ఆటోమొబైల్

ఇంజనీరింగ్ పీటీవో, టౌన్ అండ్

కంట్రీ ప్లానింగ్ అసిస్టెంట్ డెరైక్టర్,

అసిస్టెంట్ కెమిస్ట్ ఏపీ గ్రౌండ్ వాటర్,

టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్

Published date : 24 Jan 2020 01:34PM

Photo Stories