ఏపీపీఎస్సీ స్క్రీనింగ్ టెస్ట్ రద్దు !
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని వర్సిటీ అధ్యాపక పోస్టుల భర్తీపై ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోంది.
అధికారులు, ఉన్నత విద్యామండలి ముఖ్యులు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంతో అధ్యాపక పోస్టుల భర్తీకి అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. తాజాగా అధ్యాపక పోస్టుల భర్తీకి కొత్త నిబంధనలను రూపొందించిన యూజీసీ.. ఈ పోస్టుల భర్తీపై సుప్రీంకోర్టులో వ్యాజ్యాలు నడుస్తున్నందున భర్తీ ప్రక్రియను నిలిపివేయాలని అన్ని వర్సిటీలకు ఆదేశాలు జారీ చేసింది.
యూజీసీ కొత్త నిబంధనలివే...
అధ్యాపక పోస్టుల భర్తీకి కొత్త విధివిధానాలు ప్రకటిస్తూ యూజీసీ నోటిఫికేషన్ జారీ చేసింది. విద్యార్హతలు (80), పరిశోధన పత్రాలు (10), బోధనానుభవం (10) వంటి వాటికి 100 మార్కులను కేటాయిస్తూ అందులో మెరిట్‌లో ఉన్నవారిని మాత్రమే అధ్యాపక పోస్టులకు ఎంపిక చేయాలని ఆదేశించింది. ఏ నిష్పత్తిలో అభ్యర్థులను పిలవాలో వర్సిటీలే నిర్ణయించుకోవచ్చని తెలిపింది. ప్రొఫెసర్ పోస్టులకు పీహెచ్‌డీ డిగ్రీ ఉండడంతోపాటు అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లుగా పదేళ్ల అనుభవం ఉండాలని పేర్కొంది. సహాయ ప్రొఫెసర్ పోస్టుకు పీహెచ్‌డీ డిగ్రీ ఉండాలని స్పష్టం చేసింది. దీని ప్రకారం.. పీజీ ఉత్తీర్ణత ఆధారంగా వర్సిటీ పోస్టులకు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించడం నిబంధనలకు విరుద్ధం. ఫలితంగా ఏపీపీఎస్సీ నిర్వహించిన స్క్రీనింగ్ టెస్ట్ ప్రశ్నార్థకంగా మారుతోంది. పరీక్ష ఫీజులు, పరీక్ష సన్నద్ధత కోసం నిరుద్యోగులు ఇప్పటికే లక్షల్లో ఖర్చుచేశారు. ప్రభుత్వ తీరుతో తమకు తీరని నష్టం వాటిల్లుతోందని అభ్యర్థులు వాపోతున్నారు.
స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించిన ఏపీపీఎస్సీ :
ఆంధ్రప్రదేశ్‌లోని 14 యూనివర్సిటీల్లో 1,385 ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం 2016, జూలై 27న 137 జీవోను విడుదల చేసింది. ఇందులో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు పోను మిగతా 1,110 సహాయాచార్యుల పోస్టులకు ఏపీపీఎస్సీ ద్వారా స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించారు. ప్రభుత్వం చట్టాన్ని సవరించి ఒక్కో సబ్జెక్టుకు రూ.1000 ఫీజు వసూలు చేసి మరీ ఈ పరీక్షను ఏపీపీఎస్సీ ద్వారా నిర్వహించింది. దీనికి ముందు వర్సిటీల్లోని ఖాళీ పోస్టులను రేషనలైజేషన్ పేరిట ప్రభుత్వం తన ఇష్టానుసారం తన వర్గం వారికి కట్టబెట్టేందుకు వీలుగా మార్పులు చేయడం వివాదాస్పదమైంది.
మహిళలకు అన్యాయం :
మహిళా రిజర్వేషన్‌కు సంబంధించి రూల్స్‌ను పాటించకుండా యూనివర్సిటీలు నోటిఫికేషన్లు జారీ చేయడం కూడా వివాదానికి కారణమైంది. ప్రభుత్వం జారీ చేసిన జీవో 63 ప్రకారం.. మహిళలకు హారిజెంటల్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ 2016, జూలై 25 నుంచి అమలులోకి వస్తుండడంతో మహిళలకు వర్టికల్ రిజర్వేషన్లను పాటిస్తూ వర్సిటీలు జారీ చేసిన నోటిఫికేషన్ల చెల్లుబాటు ప్రశ్నార్థకమవుతోంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ఇచ్చేవి.. వర్టికల్ రిజర్వేషన్లు. మహిళలకు ఇచ్చే రిజర్వేషన్లు.. హారిజెంటల్ రిజర్వేషన్లు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వర్తించే రిజర్వేషన్లు హారిజెంటల్ కేటగిరీలోని మహిళలకు వర్తించవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మహిళలు ఏ విభాగాల్లో మెరిట్ కనబరుస్తారో ఆ విభాగాల్లో ప్రతి కేటగిరీలో ఓసీ, బీసీ-ఎ, బీసీ- బి, బీసీ-సి, బిసీ-డి, బిసీ-ఈ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు తదితర కోటాల్లో 33 1/3 శాతం మించకుండా ఎంపిక చేయాల్సి ఉంటుంది. మహిళలకు ఏ విభాగాల్లో పోస్టులు కేటాయిస్తారో ముందుగా నోటిఫికేషన్లు జారీ చేయకూడదు. వర్టికల్ రిజర్వేషన్ ప్రకారం ముందుగా ఏయే వర్సిటీల విభాగాల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తారో ప్రకటించడం వల్ల ఆయా విభాగాల్లో అర్హులైన మహిళలు లేక ఆ పోస్టులు ఖాళీగా ఉండిపోతున్నాయి. అదే హారిజెంటల్ రిజర్వేషన్‌లో ఏ విభాగంలో అర్హత కలిగిన మహిళలు ఉంటే ఆ విభాగంలో వారిని ఎంపిక చేస్తారు. అయితే జీవో 63 ఉత్తర్వులకు విరుద్ధంగా రాష్ట్ర విశ్వవిద్యాలయాలు నోటిఫికేషన్లు జారీ చేశాయి. ఆ నోటిఫికేషన్లలో హారిజెంటల్ విధానం లేకపోవడంపై ఆదికవి నన్నయ్య యూనివర్సిటీకి చెందిన కొంతమంది న్యాయస్థానాలను ఆశ్రయించారు.
యూనివర్సిటీల వారీగా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల వివరాలు...

వర్సిటీ | 1వ విడత | 2వ విడత |
ఏయూ | 233 | 104 |
శ్రీ వేంకటేశ్వర | 127 | 48 |
నాగార్జున | 72 | 8 |
శ్రీకృష్ణదేవరాయ | 89 | 23 |
పద్మావతి | 16 | 11 |
ద్రవిడ | 11 | 2 |
వేమన | 39 | 8 |
జేఎన్‌టీయూఏ | 95 | 36 |
జేఎన్‌టీయూకే | 11 | 23 |
నన్నయ్య | 24 | 0 |
అంబేడ్కర్ | 33 | 0 |
కృష్ణా | 24 | 0 |
రాయలసీమ | 39 | 1 |
విక్రమసింహపురి | 33 | 0 |
మొత్తం | 846 | 264 |
Published date : 30 Jul 2018 01:02PM