ఏపీపీఎస్సీ మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ విడుదల
Sakshi Education
సాక్షి, అమరావతి: పలు కేటగిరీల్లో పోస్టుల భర్తీకి సంబంధించి మెయిన్స్ పరీక్షల నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) డిసెంబర్ 20న షెడ్యూల్‌ను ప్రకటించింది.
గతంలో ప్రకటించిన తేదీలకు బదులు తాజా తేదీల్లో పరీక్షలు జరుగుతాయని పేర్కొంది. ఈ పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి వివిధ తేదీల్లో జరగనున్నాయి. కాగా, గ్రూప్-1, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులతోపాటు కొన్ని కేటగిరీల నాన్ గెజిటెడ్ పోస్టుల మెయిన్స్ పరీక్షలు గతంలో ప్రకటించిన షెడ్యూళ్ల ప్రకారమే జరుగుతాయని కమిషన్ తెలిపింది. పోస్టుల వారీగా పరీక్షల తేదీల షెడ్యూల్‌ను కమిషన్ వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు వెల్లడించింది.
పోస్టు | పరీక్షల తాజా షెడ్యూల్ |
జూనియర్ లెక్చరర్లు | ఫిబ్రవరి 17 నుంచి 20 వరకు |
పాలిటెక్నిక్ లెక్చరర్లు | మార్చి 12 నుంచి 15 వరకు |
డిగ్రీ కాలేజీ లెక్చరర్లు | మార్చి 21, 22 |
అసిస్టెంట్ బీసీ, సోషల్, ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ | ఏప్రిల్ 15, 16 |
మైనింగ్ రాయల్టీ ఇన్‌స్పెక్టర్ | ఏప్రిల్ 16 |
సివిల్ అసిస్టెంట్ సర్జన్ | ఏప్రిల్ 17 |
టెక్నికల్ అసిస్టెంట్ (పీటీవో) | ఏప్రిల్ 17 |
అసిస్టెంట్ డెరైక్టర్ (టౌన్‌ప్లానింగ్) | ఏప్రిల్ 17, 18 |
అసిస్టెంట్ కెమిస్ట్ (గ్రౌండ్‌వాటర్ సర్వీస్) | ఏప్రిల్ 17, 18 |
టౌన్‌ప్లానింగ్ అసిస్టెంట్ (టౌన్‌ప్లానింగ్) | ఏప్రిల్ 17, 18 |
Published date : 21 Dec 2019 01:19PM