Skip to main content

ఏపీపీఎస్సీ గ్రూప్-1 పోస్టుల భర్తీ ప్రక్రియకు బ్రేక్‌వేస్తూ స్టే జారీ చేసిన హైకోర్టు

సాక్షి, అమరావతి: గ్రూప్-1 పోస్టుల భర్తీ ప్రక్రియకు హైకోర్టు బ్రేక్ వేసింది. గ్రూప్-1 పరీక్ష ఫలితాల వెల్లడికి అనుమతిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు ధర్మాసనం స్టే ఇచ్చింది.
120 ప్రశ్నల్లో 51 ప్రశ్నలు తప్పు ఉంటే దానిని పరీక్ష అంటారా అని ఏపీపీఎస్సీని నిలదీసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ఆదేశించింది. తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యతో కూడిన ధర్మాసనం జనవరి 27 (సోమవారం)నఉత్తర్వులు జారీ చేసింది. 169 గ్రూప్-1 పోస్టుల భర్తీకి పరీక్ష నిర్వహించగా.. తెలుగు అనువాదం లో 51 తప్పులు దొర్లాయంటూ పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై జరిపిన సింగిల్ జడ్జి ప్రాథమిక పరీక్ష ఫలితాలపై స్టే విధించారు. ఆ తరువాత దానిని ఎత్తివేశారు. దీనిపై పలువురు ధర్మాసనం ఎదుట అప్పీల్స్ దాఖలు చేయగా.. వాదనలు విన్న ధర్మాసనం కౌంటర్ దాఖలు చేయాలని ఏపీపీఎస్సీని ఆదేశించింది.
Published date : 28 Jan 2020 02:40PM

Photo Stories