ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ లో కాపీ కొడుతూ దొరికిపోయిన అభ్యర్థి
Sakshi Education
కర్నూలు (సెంట్రల్): ఎంతో కృషి, పట్టుదల ఉంటే తప్ప గ్రూప్-1 పరీక్షల్లో విజయం సాధించడం కష్టం.
అలాంటిది కర్నూలులో ఓ అభ్యర్థి అడ్డదారిలో గ్రూప్-1 ఆఫీసర్ అవుదామనుకుని అడ్డంగా బుక్కయ్యాడు. స్థానిక కేవీ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహించిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలో కర్నూలుకు చెందిన బోయినపల్లి విజయకుమార్‌రెడ్డి కాపీ కొడుతూ ఇన్విజిలేటర్‌కు పట్టుబడ్డాడు. బుధవారం జరిగిన పరీక్షకు తన రెండు మోకాళ్ల వరకు కాపీలు రాసుకుని రాగా.. ఇన్విజిలేటర్‌కు పట్టుకున్నారు. పరీక్ష నుంచి అతడిని సస్పెండ్ చేసి ఏపీపీఎస్‌సీకి సమాచారమిచ్చినట్టు జిల్లా రెవెన్యూ అధికారి బి.పుల్లయ్య తెలిపారు.
Published date : 17 Dec 2020 04:32PM