Skip to main content

ఏపీలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి విద్యాశాఖ కసరత్తు

ఒంగోలు టౌన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు కొత్త డీఎస్సీకి కసరత్తు చేస్తున్నామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వి.చినవీరభద్రుడు వెల్లడించారు.
ప్రకాశం జిల్లా ఒంగోలులోని బండ్లమిట్టలోని  ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన వర్చువల్ క్లాస్ రూమ్‌ను ఇంగ్లిష్ మీడియం విభాగం స్టేట్ స్పెషల్ ఆఫీసర్ వెట్రి సెల్వితో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. 2018 డీఎస్సీకి సంబంధించి ఉపాధ్యాయుల నియామక ప్రక్రియకు ఇప్పటికే చర్యలు చేపట్టామని చెప్పారు. పదో తరగతిలో మాస్ కాపీయింగ్‌ను నిర్మూలించేందుకు ఇంటర్నల్ మార్కుల విధానాన్ని ఎత్తేశామని తెలిపారు.
 
 డీఈవోకు ప్రశంసలు
 జగనన్న అమ్మ ఒడి పథకానికి సంబంధించి విద్యార్థుల వివరాలను అప్‌లోడ్ చేయడంలో రాష్టంలోనే ప్రకాశం జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని చినవీరభద్రుడు వెల్లడించారు. జిల్లా విద్యాశాఖాధికారి వాట్సాప్ గ్రూపులో మానిటరింగ్ చేయడం వల్లనే ఇది సాధ్యమైందని ఆయన తెలిపారు.
Published date : 09 Dec 2019 05:16PM

Photo Stories