Skip to main content

ఏపీలో 309 ఏఈఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని వివిధ శాఖల్లో ఉన్న 309 అసిస్టెంటు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నవంబర్ 29న నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ పోస్టుల్లో 144 క్యారీఫార్వర్డ్ పోస్టులు కాగా తక్కినవన్నీ ఫ్రెష్ పోస్టులు. జోన్, రాష్ట్రస్థాయి కేడర్లలోని ఆయా పోస్టులను శాఖల వారీగా కమిషన్ నోటిఫికేషన్లో పొందుపరచింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు ఆన్‌లైన్ ప్రొఫార్మా డిసెంబర్ 3వ తేదీ నుంచి 24వతేదీ వరకు కమిషన్ వెబ్‌సైట్ https://psc.ap.gov.in/ వెబ్‌సైట్లో అందుబాటులో ఉంటుంది. ఆన్‌లైన్ ఫీజు చెల్లించేందుకు చివరి తేదీ డిసెంబర్ 23. ఈ పోస్టులకు 25వేల మందికి పైగా దరఖాస్తు చేస్తే 2019 ఫిబ్రవరి 10వ తేదీన స్క్రీనింగ్ టెస్టు నిర్వహిస్తారు. ఆ తరువాత ఏప్రిల్ 1, 2 తేదీల్లో మెయిన్ పరీక్ష ఉంటుందని కమిషన్ వివరించింది. కాగా రాష్ట్రంలో 18,450 పోస్టుల భర్తీ అంటూ సెప్టెంబర్ 19న ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వగా.. మూడు నెలల తరువాత అందులో కేవలం 309 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఆయా శాఖలనుంచి ఖాళీలు, రోస్టర్, రిజర్వేషన్ తదితర అంశాలకు సంబంధించిన సమాచారం లేకపోవడంతో ఇతర పోస్టుల నోటిపికేషన్లు జారీ చేయడం లేదు. ప్రస్తుతానికి ఏఈఈ పోస్టుల సమాచారం అందడంతో వీటికి నోటిఫికేషన్ జారీ చేసింది.

ఏఈఈ పోస్టుల నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి
Published date : 30 Nov 2018 01:39PM

Photo Stories