ఏపీ ఐసెట్ సీట్ల కేటాయింపు
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన ఐసెట్ తుదివిడత సీట్ల కేటాయింపు ఆగస్టు 9న పూర్తి చేశారు.
ఈ మేరకు అడ్మిషన్ల కమిటీ కన్వీనర్ కేటాయింపు జాబితా విడుదల చేశారు. ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు సంబంధించి 494 కళాశాలల్లో కన్వీనర్ కోటా కింద 36,637 సీట్లుండగా, తుది విడత కౌన్సెలింగ్ ముగిసే నాటికి 28,848 మందికి సీట్లు కేటాయించారు. ఇంకా 7,789 సీట్లు మిగిలి ఉన్నాయి.
Published date : 10 Aug 2017 03:55PM