డిప్యూటీ సర్వేయర్ పోస్టులకు ఎంపికైన వారి జాబితా విడుదల
Sakshi Education
సాక్షి, అమరావతి: సర్వే ల్యాండ్ రికార్డుల విభాగంలో డిప్యూటీ సర్వేయర్ పోస్టులకు ఎంపికైన వారి జాబితాను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆగస్టు 27న విడుదల చేసింది.
సంబంధిత వివరాలను కమిషన్ వెబ్‌సైట్‌లో, కార్యాలయంలోని నోటీసు బోర్డులో పొందుపరిచినట్లు కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు తెలిపారు. వీటితో పాటు టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ విభాగంలో టౌన్´ఋ్లానింగ్ అండ్ బిల్డింగ్ ఓవర్సీర్ పోస్టులకు ఎంపికైన వారి జాబితాను కూడా వెబ్‌సైట్‌లో కమిషన్ పొందు పరిచింది. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్, పబ్లిక్ హెల్త్ లేబొరేటరీస్ ఫుడ్ అడ్మినిస్ట్రేషన్‌లో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టుల పరీక్షలకు సంబంధించిన ప్రొవిజినల్ సెలెక్షన్ జాబితాను కూడా విడుదల చేసినట్లు వెల్లడించారు.
Published date : 28 Aug 2020 08:21PM