డిపార్టుమెంటల్ టెస్టుల్లో మైనస్ మార్కులు రద్దు
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు నిర్వహించే డిపార్టుమెంటల్ టెస్టుల్లో మైనస్ మార్కుల విధానం రద్దు కానుంది.
ప్రభుత్వ సూచనల మేరకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. రానున్న డిపార్టుమెంటల్ టెస్టులన్నీ మైనస్ మార్కులు లేకుండా నిర్వహించనున్నారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ అంశం తన దృష్టికి రాగానే మైనస్ మార్కులు తీసివేయాలని ఏపీపీఎస్సీకి సూచించారు. దీంతో ఏపీపీఎస్సీ మైనస్ మార్కుల రద్దుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేసింది. దీనిపై త్వరలోనే ఉత్తర్వులు వెలువడనున్నాయి.
Published date : 19 Dec 2019 02:58PM