ఆంధ్రప్రదేశ్‌లో ఎడ్‌సెట్ దరఖాస్తుల స్వీకరణ
Sakshi Education
ఏయూ క్యాంపస్ (విశాఖతూర్పు): బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎడ్‌సెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించినట్లు ఏయూ వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు తెలిపారు.
ఈనెల 22న ఏయూ సెనేట్ మందిరంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మార్చి 22 వరకు దరఖాస్తులను ఆన్‌లైన్‌లో స్వీకరిస్తామన్నారు. రూ.500 అపరాధ రుసుంతో ఏప్రిల్ 15 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. దరఖాస్తు రుసుం ఎస్సీ, ఎస్టీలు రూ.400, ఇతరులు రూ.600 చెల్లించాలని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల పరిధిలో 16 కేంద్రాలలో ఏప్రిల్ 19న ఉదయం 10.30 నుంచి 12.30 గంటల వరకు ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రంలో 508 బీఈడీ కళాశాలల్లో 45,068 సీట్లు ఉన్నాయన్నారు. ఎడ్‌సెట్ కన్వీనర్ ఆచార్య ఆర్.రంగనాథం మాట్లాడుతూ గ్రామీణ విద్యార్థుల కోసం మాక్‌టెస్ట్‌లు నిర్వహిస్తామన్నారు.
Published date : 23 Feb 2017 12:42PM