1999 గ్రూప్-2కి 54 మంది కొత్త అభ్యర్థులు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 1999 గ్రూప్-2లోని తప్పులను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సరిదిద్ది తాజా మెరిట్ జాబితాను సోమవారం ఖరారు చేసింది.
317 మంది అభ్యర్థులను ఇంటర్వ్యూలకు ఎంపిక చేయగా, ఇంతకు ముందు జాబితాలో గతంలో ఇంటర్వ్యూలకు హాజరై అనర్హులైన వారి నంబర్లు కూడా ఉండటంతో పలువురి నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఏపీపీఎస్సీ ఆ జాబితాలో తప్పులను సరిదిద్దడంతో అభ్యర్థుల సంఖ్య 54కి తగ్గింది. కొత్త అభ్యర్థుల ఇంటర్వ్యూలు అక్టోబర్ 19, 20 తేదీల్లో నిర్వహించాలని ఏపీపీఎస్సీ నిర్ణయించింది. 1999 గ్రూప్-2 నోటిఫికేషన్లోనే 2011లో 111 పోస్టులకు ఎంపికై రెండేసి ఆప్షన్లు ఇచ్చిన అభ్యర్థులు తాజా ఎంపికలో తమ ఆప్షన్లు మార్చుకోవడం, కొత్తగా మొత్తం అన్నిటికీ ఆప్షన్లు ఇచ్చే వెసులుబాటు కల్పించనున్నారు. ఈ మేరకు ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్లో మెరిట్ జాబితా, కొత్త నోటిఫికేషన్ వివరాలను పొందుపర్చామని ఏపీపీఎస్సీ కార్యదర్శి వైవీఎస్‌టీ సాయి పేర్కొన్నారు.
Published date : 27 Sep 2016 02:39PM