స్థానిక ప్రభుత్వాలు
1. భారతదేశంలో పంచాయతీరాజ్ సంస్థల కార్యకలాపాలను సమీక్షించే అత్యున్నత వ్యవస్థ ఏది?
ఎ) కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ
బి) ఆర్థిక మంత్రిత్వ శాఖ
సి) గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
డి) ప్రణాళికా మండలి
- View Answer
- సమాధానం: సి
2. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం ప్రభుత్వం గ్రామ పంచాయతీలను నిర్వహించాలని నిర్దేశిస్తుంది?
ఎ) అధికరణం 24
బి) అధికరణం 19
సి) అధికరణం 23
డి) అధికరణం 40
- View Answer
- సమాధానం: డి
3. 73వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని ఏ ప్రధానమంత్రి హయాంలో రూపొందించారు?
ఎ) రాజీవ్‌గాంధీ
బి) చంద్రశేఖర్
సి) వి.పి.సింగ్
డి) పి.వి.నరసింహరావు
- View Answer
- సమాధానం: డి
4. 73వ రాజ్యాంగ సవరణ చట్టం భారత రాజ్యాంగంలోని ఏ విభాగానికి సంబంధించింది?
ఎ) Part-VII
బి) Part-VIII
సి) Part-IX
డి) Part-X
- View Answer
- సమాధానం: సి
5. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ జిల్లా ప్రణాళికా మండలి గురించి వివరిస్తుంది?
ఎ) 243-ZE
బి) 243-ZD
సి) 243-ZB
డి) 243-ZC
- View Answer
- సమాధానం: బి
6. స్థానిక ప్రభుత్వ సంస్థలకు సంబంధించి మొదటి తీర్మానంగా దేన్ని అభివర్ణిస్తారు?
ఎ) లార్డ్ రిప్పన్ తీర్మానం
బి) లార్డ్ మెయో తీర్మానం
సి) బ్రిటిష్ రాణి తీర్మానం
డి) వికేంద్రీకరణ
- View Answer
- సమాధానం: ఎ
7. స్థానిక స్వపరిపాలనపై ఏ జాతీయ నాయకుడికి ఎక్కువ గౌరవం, విశ్వాసం ఉండేవి?
ఎ) జవహర్ లాల్ నెహ్రూ
బి) మహాత్మాగాంధీ
సి) లాల్ బహదూర్ శాస్త్రి
డి) సుభాష్ చంద్రబోస్
- View Answer
- సమాధానం: బి
8. ముంబై, కోల్‌కతా నగరాల్లో మున్సిపల్ కార్పొరేషన్లను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
ఎ) 1726
బి) 1687
సి) 1787
డి) 1870
- View Answer
- సమాధానం: ఎ
9. లార్డ్ మెయో స్థానిక ప్రభుత్వాలకు సంబంధించి ఆర్థిక వికేంద్రీకరణ తీర్మానాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు?
ఎ) 1770
బి) 1860
సి) 1857
డి) 1870
- View Answer
- సమాధానం: డి
10. స్థానిక స్వపరిపాలన పితామహుడు?
ఎ) లార్డ్ కర్జన్
బి) లార్డ్ మింటో
సి) లార్డ్ రిప్పన్
డి) లార్డ్ మాంటెంగ్
- View Answer
- సమాధానం: సి
11. జి.వి.కె. రావు కమిటీని నియమించిన సంవత్సరం?
ఎ) 1984
బి) 1985
సి) 1986
డి) 1972
- View Answer
- సమాధానం: బి
12. జిల్లా ప్రణాళికా వికేంద్రీకరణలో జిల్లా కలెక్టర్ ముఖ్యపాత్ర పోషించాలని సిఫారసు చేసిన కమిటీ?
ఎ) సి.హెచ్.హనుమంతరావు కమిటీ - 1984
బి) దంత్వాలా కమిటీ - 1978
సి) ఎల్.ఎం.సింఘ్వీ కమిటీ - 1986
డి) పి.కె.తుంగన్ కమిటీ - 1987
- View Answer
- సమాధానం: బి
13. 73వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని ఎన్ని రాష్ట్రాలు ఆమోదించాయి?
ఎ) 16
బి) 17
సి) 18
డి) 19
- View Answer
- సమాధానం: బి
14. నూతన పంచాయతీరాజ్ చట్టం - 1993 ఎప్పుడు అమల్లోకి వచ్చింది?
ఎ) 1993 ఏప్రిల్ 24
బి) 1992 ఏప్రిల్ 25
సి) 1993 ఏప్రిల్ 28
డి) 1993 ఏప్రిల్ 26
- View Answer
- సమాధానం: ఎ
15. పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ హోదా కల్పించాలని ఏ కమిటీ సిఫారసు చేసింది?
ఎ) జి.వి.కె.రావు కమిటీ
బి) ఎల్.ఎం.సింఘ్వీ కమిటీ
సి) పి.కె.తుంగన్ కమిటీ
డి) దంత్వాలా కమిటీ
- View Answer
- సమాధానం: బి
16. బల్వంత్రాయ్ మెహతా కమిటీ ఎన్ని అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సిఫారసు చేసింది?
ఎ) రెండంచెలు
బి) మూడంచెలు
సి) నాలుగంచెలు
డి) ఒక అంచె
- View Answer
- సమాధానం: బి
17. ఏ రాష్ర్టంలో నాలుగంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ అమల్లో ఉంది?
ఎ) పశ్చిమ బెంగాల్
బి) బిహార్
సి) ఉత్తరప్రదేశ్
డి) హర్యానా
- View Answer
- సమాధానం: ఎ
18. ఏయే రాష్ట్రాల్లో పంచాయతీరాజ్ వ్యవస్థకు తగిన ప్రాధాన్యం లేదు?
ఎ) ఒడిశా, హర్యానా
బి) బిహార్, ఉత్తరప్రదేశ్
సి) మహారాష్ర్ట, కర్ణాటక
డి) గుజరాత్, పశ్చిమ బెంగాల్
- View Answer
- సమాధానం: బి
19. 73వ రాజ్యాంగ సవరణ చట్టం ఏయే రాష్ట్రాలకు వర్తించదు?
ఎ) జమ్మూ-కశ్మీర్
బి) నాగాలాండ్
సి) మేఘాలయ, మిజోరాం
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
20. దంత్వాలా కమిటీ నివేదిక దేనికి సంబంధించింది?
ఎ) పట్టణ ప్రణాళిక
బి) రాష్ర్ట ప్రణాళిక
సి) జిల్లా ప్రణాళిక
డి) బ్లాక్ లెవల్ ప్రణాళిక
- View Answer
- సమాధానం: డి
గతంలో అడిగిన ప్రశ్నలు
1. స్థానిక స్వపరిపాలనా సంస్థలకు, వాటికి సంబంధించి 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాలు అన్వయించని రాష్ట్రాలు?
ఎ) గోవా, జమ్మూకశ్మీర్, పుదుచ్చేరి
బి) ఢిల్లీ, గోవా, మిజోరాం, మేఘాలయ
సి) మేఘాలయ, నాగాలాండ్, మిజోరాం
డి) మణిపూర్, నాగాలాండ్
- View Answer
- సమాధానం: డి
2. ప్రస్తుత పంచాయతీరాజ్ వ్యవస్థకు మూలం?
ఎ) అశోక్ మెహతా కమిటీ
బి) బల్వంత్రాయ్ మెహతా కమిటీ
సి) జీవీకే రావు కమిటీ
డి) రాజమన్నార్ కమిటీ
- View Answer
- సమాధానం: బి
3. పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టిన మొదటి రాష్ర్టం?
ఎ) గుజరాత్
బి) రాజస్థాన్
సి) బిహార్
డి) ఆంధ్రప్రదేశ్
- View Answer
- సమాధానం: బి
4. మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను రాజ్యాంగంలోని ఏ భాగంలో పేర్కొన్నారు?
ఎ) 3వ భాగం
బి) 21వ భాగం
సి) 9వ భాగం
డి) 8వ భాగం
- View Answer
- సమాధానం: సి
5. స్థానిక సంస్థలు సమర్థంగా పనిచేయడానికి, జిల్లా పరిషతుల్లో సామాజిక న్యాయ కమిటీల ఏర్పాటుకు సిఫార్సు చేసిన కమిటీ?
ఎ) పరిపాలనా సంస్కరణల కమిటీ
బి) అశోక్ మెహతా కమిటీ
సి) వెంగళరావు కమిటీ
డి) సంతానం కమిటీ
- View Answer
- సమాధానం: సి
6. స్థానిక సంస్థల్లో ఓటింగ్ వయసు?
ఎ) పదహారేళ్లు
బి) పద్దెనిమిదేళ్లు
సి) 21 ఏళ్లు
డి) 25 ఏళ్లు
- View Answer
- సమాధానం: సి
7. ఏ రాష్ర్టంలో పంచాయతీరాజ్ వ్యవస్థ అమల్లో లేదు?
ఎ) నాగాలాండ్
బి) కేరళ
సి) త్రిపుర
డి) అసోం
- View Answer
- సమాధానం: బి