రాష్ర్టపతి, ఉప రాష్ర్టపతి, ప్రధాన మంత్రి, మంత్రి మండలి
1. భారత రాజ్యాంగాన్ని అనుసరించి కేంద్ర మంత్రి మండలిలో... ?
ఎ) మంత్రులందరూ సమానులే
బి) కేబినెట్ మంత్రులు ఇతర మంత్రుల కంటే ఉన్నతులు
సి) డిప్యూటీ మంత్రులు స్టేట్ మంత్రుల కంటే ఉన్నతులు, కానీ కేబినెట్ మంత్రుల కంటే హోదాలో చిన్నవారు
డి) ఏ పోర్ట్ ఫోలియో లేని మంత్రి.. హోదాలో అందరి కంటే నిమ్న స్థానంలో ఉంటారు
- View Answer
- సమాధానం: ఎ
2. అనుకోకుండా ఎదురయ్యే, అదనపు, అధిక ఖర్చుల కోసం ప్రభుత్వం.. తర్వాత అనుమతి పొందే షరతుపై ఏ ఆదాయాధారం నుంచి ఖర్చు చేయవచ్చు?
ఎ) భారత సంచిత నిధి
బి) భారత ప్రభుత్వ ఖాతా
సి) భారతీయ రిజర్వ్ బ్యాంక్
డి) భారత ఆగంతుక నిధి
- View Answer
- సమాధానం: డి
3. పదవీ కాలంలో ఎన్నడూ పార్లమెంటును ఎదుర్కోని ఏకైక భారత ప్రధాని ఎవరు?
ఎ) చరణ్ సింగ్
బి) అటల్ బిహారీ వాజ్‌పేయి
సి) చంద్రశేఖర్
డి) విశ్వనాథ ప్రతాప్ సింగ్
- View Answer
- సమాధానం: ఎ
4. లోక్‌సభను ఎవరు రద్దు చేస్తారు?
ఎ) ప్రధాన మంత్రి
బి) స్పీకర్
సి) హోం మంత్రి
డి) ప్రధాని సిఫారసు మేరకు రాష్ట్రపతి
- View Answer
- సమాధానం: డి
5. మంత్రి మండలిలో అంతర్భాగం కానివారు?
ఎ) సహాయ మంత్రులు
బి) కేబినెట్ కార్యదర్శి
సి) ఉప ప్రధాన మంత్రి
డి) పార్లమెంటరీ కార్యదర్శులు
- View Answer
- సమాధానం: బి
6. రాజ్యసభకు పదవీ రీత్యా అధ్యక్షుడెవరు?
ఎ) భారత రాష్ట్రపతి
బి) భారత ఉప రాష్ట్రపతి
సి) స్పీకర్ (సభాపతి)
డి) రాజ్యసభ ఎన్నుకున్న అధ్యక్షుడు
- View Answer
- సమాధానం: బి
7. కింది వారిలో ముఖ్యమంత్రిగా పనిచేయని ప్రధానమంత్రి ఎవరు?
ఎ) చరణ్ సింగ్
బి) దేవెగౌడ
సి) మొరార్జీ దేశాయ్
డి) ఐ.కె.గుజ్రాల్
- View Answer
- సమాధానం: డి
8. ప్రధాని హోదాలో ఎర్రకోటలో జాతీయ జెండా ఎగరేయని వారెవరు?
ఎ) దేవెగౌడ
బి) చంద్రశేఖర్
సి) ఐ.కె.గుజ్రాల్
డి) పి.వి. నరసింహారావు
- View Answer
- సమాధానం:బి
9. కింద పేర్కొన్న వారిలో రాజ్యసభ సభ్యత్వం ద్వారా ప్రధాన మంత్రి పదవి చేపట్టినవారు ఎవరు?
ఎ) దేవెగౌడ
బి) మన్మోహన్ సింగ్
సి) ఎ, బి
డి) ఎవరూ కాదు
- View Answer
- సమాధానం: సి
10.కింద పేర్కొన్న ప్రధాన మంత్రుల్లో అత్యధిక మెజారిటీతో గెలిచినవారు?
ఎ) పి.వి. నరసింహారావు
బి) నరేంద్ర మోదీ
సి) శ్రీమతి ఇందిరాగాంధీ
డి) రాజీవ్ గాంధీ
- View Answer
- సమాధానం: ఎ
11. రాజ్యాంగపరంగా కింది వారిలో ఎవరికి స్పష్టమైన విచక్షణాధికారాలు లేవు?
ఎ) రాష్ట్రపతి
బి) ప్రధాన మంత్రి
సి) గవర్నర్
డి) కేంద్ర మంత్రి మండలి
- View Answer
- సమాధానం: ఎ
12. కింది వాటిలో పార్లమెంటరీ ప్రభుత్వ లక్షణం కాని అంశం ఏది?
ఎ) నామమాత్ర, వాస్తవ అధిపతులు
బి) సంయుక్త బాధ్యత
సి) అధికార సంలీనం
డి) అధికార విభజన
- View Answer
- సమాధానం: డి
13. రాజ్యాంగంలో కింది వాటిలో ఏ రకమైన ప్రభుత్వం గురించి ప్రస్తావించారు?
ఎ) ఆపద్ధర్మ ప్రభుత్వం
బి) జాతీయ ప్రభుత్వం
సి) సంకీర్ణ ప్రభుత్వం
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
14. ఎవరైనా ఒక మంత్రి రాష్ట్రపతి విశ్వాసం కోల్పోతే, ఆ మంత్రిని..?
ఎ) ప్రధాన మంత్రి తొలగిస్తారు
బి) ప్రధాన మంత్రి సలహా మేరకు రాష్ట్రపతి తొలగిస్తారు
సి) రాష్ట్రపతి సలహా మేరకు ప్రధాని తొలగిస్తారు
డి) పైవేవీ సరైనవి కావు
- View Answer
- సమాధానం: బి
15. పదవిలో ఉండగా మరణించిన ప్రధానమంత్రుల సంఖ్య?
ఎ) ఇద్దరు
బి) ముగ్గురు
సి) నలుగురు
డి) అయిదుగురు
- View Answer
- సమాధానం: బి
16. అత్యధిక పార్టీల కూటమితో ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి నాయకత్వం వహించినవారు?
ఎ) మన్మోహన్ సింగ్
బి) వాజ్‌పేయి
సి) వి.పి.సింగ్
డి) దేవెగౌడ
- View Answer
- సమాధానం: బి
17. కేంద్ర మంత్రి మండలికి సంబంధించి కింది వాటిలో సరైన వాక్యం ఏది?
ఎ) గరిష్ట మంత్రులకు సంబంధించి రాజ్యాంగంలో పరిమితి ఉంది
బి) రాజ్యాంగపరంగా మంత్రుల హోదాలు సమానం
సి) రాష్ట్రపతి విశ్వాసం మేరకు మంత్రులు అధికారంలో ఉంటారు
డి) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: డి
18. ప్రధాన మంత్రి మరణిస్తే ...?
ఎ) మంత్రి మండలి రద్దవుతుంది
బి) లోక్‌సభ రద్దవుతుంది
సి) కొత్త నాయకత్వంలో మంత్రి మండలి మళ్లీ ప్రమాణం చేయాలి
డి) పైవేవీ కావు
- View Answer
- సమాధానం: సి
19. కేంద్రంలో ఎలాంటి మంత్రి పదవి చేపట్టకుండా ప్రధాన మంత్రి అయినవారు?
ఎ) శ్రీమతి ఇందిరాగాంధీ
బి) వి.పి.సింగ్
సి) ఐ.కె.గుజ్రాల్
డి) రాజీవ్ గాంధీ
- View Answer
- సమాధానం: డి
20.కింది వారిలో ముఖ్యమంత్రిగా పనిచేసి ఆ తర్వాత ప్రధాన మంత్రి అయినవారు?
ఎ) మొరార్జీదేశాయ్
బి) చరణ్ సింగ్
సి) వి.పి.సింగ్
డి) పైవారందరూ
- View Answer
- సమాధానం: డి
21. కింది వాటిలో రాజ్యాంగంలో ప్రత్యక్షంగా పేర్కొనని అంశం ఏది?
ఎ) ప్రధాన మంత్రి తప్పనిసరిగా లోక్‌సభకు చెంది ఉండాలి
బి) ప్రధాన మంత్రి మెజారిటీ కోల్పోతే రాజీనామా చేయాలి
సి) రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి పదవులకు ఏకకాలంలో ఖాళీ ఏర్పడితే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాష్ట్రపతిగా వ్యవహరించడం
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
22. ప్రధాన మంత్రి అర్హతకు సంబంధించి కింది వాటిలో ఏది సరైంది?
ఎ) లోక్‌సభలో సభ్యత్వం ఉండాలి
బి) పార్లమెంట్లో తప్పనిసరిగా సభ్యత్వం ఉండాలి
సి) పదవి చేపట్టే నాటికి ఏ సభలోనూ సభ్యత్వం తప్పనిసరి కాదు
డి) పైవేవీ కాదు
- View Answer
- సమాధానం: సి
23. హోదా రీత్యా ప్రధాన మంత్రి కింది వాటిలో దేనికి అధ్యక్షులుగా కొనసాగుతారు?
ఎ) నీతి ఆయోగ్
బి) జాతీయ సమైక్యతా మండలి
సి) జాతీయ భద్రతా మండలి
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
24. కింద పేర్కొన్న అంశాల్లో దేనికి రాజ్యాంగ ప్రతిపత్తి లేదు?
ఎ) ఉప ప్రధాన మంత్రి
బి) ఉప ముఖ్యమంత్రి
సి) ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
25.పార్లమెంట్‌ను దీర్ఘకాలికంగా ఎవరు వాయిదా వేస్తారు?
ఎ) రాష్ట్రపతి
బి) స్పీకర్
సి) రాజ్యసభ అధ్యక్షులు
డి) పైన పేర్కొన్న ఎవరూ కాదు
- View Answer
- సమాధానం: ఎ
26. మంత్రి మండలి ఎవరి మెజార్టీ మద్దతు ఉన్నంత కాలం పదవిలో కొనసాగుతుంది?
ఎ) రాజ్యసభ
బి) లోక్‌సభ
సి) ఎ, బి
డి) ఎ లేదా బి
- View Answer
- సమాధానం: బి
27. కేబినెట్ సమావేశానికి ..?
ఎ) కేబినెట్ మంత్రులందరూ హాజరవుతారు
బి) కేబినెట్ మంత్రులందరూ హాజరుకావాలనే నియమం లేదు
సి) స్టేట్ మంత్రులు హాజరవుతారు
డి) ఏదీకాదు
- View Answer
- సమాధానం: బి
28.మంత్రి మండలి, రాష్ట్రపతికి మధ్య ప్రధాన సంధానకర్త ఎవరు?
ఎ) ప్రధాన న్యాయమూర్తి
బి) పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి
సి) రాష్ట్రపతి కార్యదర్శి
డి) ప్రధాన మంత్రి
- View Answer
- సమాధానం: డి
29. కింద పేర్కొన్న భారత ప్రధాన మంత్రుల అధికార క్రమానుగత శ్రేణి గుర్తించండి.
1. ఇందిరాగాంధీ
2. రాజీవ్‌గాంధీ
3. చరణ్‌సింగ్
4. మొరార్జీ దేశాయ్
5. చంద్రశేఖర్
6. గుల్జారీలాల్ నందా
ఎ) 6, 1, 4, 3, 2, 5
బి) 5, 2, 3, 1, 4, 6
సి) 4, 2, 5, 3, 1, 6
డి) 5, 2, 3, 1, 5, 4
- View Answer
- సమాధానం: ఎ
30. కింది వాటిలో ప్రధాన మంత్రి నియామకానికి సంబంధించి సరికాని వాక్యం ఏది?
ఎ) పార్లమెంట్లో సభ్యత్వం తప్పనిసరి కాదు
బి) మెజార్టీ పార్టీ అధ్యక్షుడిగా ఉండాలి
సి) మెజార్టీని మూడు నెలల్లో నిరూపించుకోవాలి
డి) బి, సి
- View Answer
- సమాధానం: డి
31. ప్రధాన మంత్రి తనతో ఏ మంత్రి అయినా విభేదిస్తే ఆయనపై తీసుకునే చర్య?
ఎ) మంత్రి మండలి నుంచి సంబంధిత మంత్రిని తొలగించాల్సిందిగా ప్రధాన మంత్రి రాష్ట్రపతికి సిఫారసు చేయవచ్చు
బి) మంత్రివర్గ సమావేశాలకు హాజరు కాకుండా చేయవచ్చు
సి) ఎ, బి
డి) ఏదీకాదు
- View Answer
- సమాధానం: ఎ
32. భారతదేశంలో పరిపాలన మొత్తం ఎవరి పేరుపై జరుగుతుంది?
ఎ) ప్రధాన మంత్రి
బి) రాష్ట్రపతి
సి) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
డి) కేబినెట్ కార్యదర్శి
- View Answer
- సమాధానం: బి
33. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఉన్నప్పుడు రాష్ట్ర బడ్జెట్‌ను ఎవరు ఆమోదిస్తారు?
ఎ) రాష్ట్రపతి
బి) గవర్నర్
సి) పార్లమెంట్
డి) అసెంబ్లీ
- View Answer
- సమాధానం: సి
34. ప్రధాన మంత్రి ఎగువ సభకు చెందిన వారైతే ..?
ఎ) అవిశ్వాస తీర్మానంపై తనకు అనుకూలంగా తాను ఓటు వేసుకునే వీలుండదు
బి) దిగువ సభలో బడ్జెట్‌పై మాట్లాడే అవకాశం ఉండదు
సి) దిగువ సభకు ఎన్నిక కావాల్సి ఉంటుంది
డి) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: ఎ
35. కేంద్ర మంత్రి మండలి సమావేశాలకు ఎజెండాను రూపొందించేవారెవరు?
ఎ) రాష్ట్రపతి
బి) ప్రధాన మంత్రి
సి) పార్లమెంట్ వ్యవహారాల శాఖ
డి) ప్రభుత్వ కేబినెట్ కార్యదర్శి
- View Answer
- సమాధానం: డి
36. ఏ సభల సభ్యులతో కూడిన ఎలక్ట్రోరల్ కాలేజీ ఉప రాష్ట్రపతిని ఎన్నుకుంటుంది?
ఎ) లోక్‌సభ, రాజ్యసభ
బి) లోక్‌సభ, శాసనసభ సభ్యులు
సి) రాజ్యసభ, శాసనసభ సభలు
డి) రాజ్యసభ
- View Answer
- సమాధానం: ఎ
37. భారత పార్లమెంట్ ఎవరితో కూడి ఉంటుంది?
ఎ) రాష్ట్రపతి + ఉప రాష్ట్రపతి + లోక్‌సభ
బి) రాష్ట్రపతి + లోక్‌సభ
సి) రాష్ట్రపతి + రాజ్యసభ
డి) రాష్ట్రపతి + లోక్‌సభ + రాజ్యసభ
- View Answer
- సమాధానం: డి
38. ఒకవేళ ‘రాష్ట్రపతి’ పదవిలో ఉండగా మరణిస్తే.. ఉప రాష్ట్రపతి రాష్ట్రపతిగా ఎంతకాలం కొనసాగవచ్చు?
ఎ) సంవత్సరం
బి) ఆరు నెలలు
సి) మూడు నెలలు
డి) మిగిలిన కాలమంతా
- View Answer
- సమాధానం: బి