ఇండియన్ హిస్టరీ- మాదిరి ప్రశ్నలు
1.‘ఎపీగ్రఫీ’ అంటే ఏమిటి?
ఎ) నాణేల గురించి అధ్యయనం చేయడం
బి) శాసనాల్లో ఉపయోగించిన ప్రాచీన లేఖనాన్ని అధ్యయనం చేయడం
సి) శాసనాలను అధ్యయనం చేయడం
డి) చరిత్రకు సంబంధించిన పదార్థాల గురించి అధ్యయనం చేయడం
- View Answer
- సమాధానం: సి
2. ‘రుగ్వేద సంహిత’లోని ఏ మండలంలో తొలిసారిగా శూద్రుల గురించి పేర్కొన్నారు?
ఎ) మొదటి
బి) అయిదో
సి) పదో
డి) ఎనిమిదో
- View Answer
- సమాధానం: సి
3. తొలిసారిగా ‘గోత్రం’ అనే పదాన్ని ఎందులో పేర్కొన్నారు?
ఎ) రుగ్వేదం
బి) యజుర్వేదం
సి) సామవేదం
డి) అధర్వణ వేదం
- View Answer
- సమాధానం:డి
4. హర్యాంక రాజవంశ స్థాపకుడు ఎవరు?
ఎ) అజాతశత్రువు
బి) బిందుసారుడు
సి) బింబిసారుడు
డి) కాలాశోకుడు
- View Answer
- సమాధానం: సి
5. ప్రసిద్ధ వైశాలి నర్తకి ‘ఆమ్రపాలి’ని ప్రేమించిన మగధ పాలకుడు ఎవరు?
ఎ) బిందుసారుడు
బి) మహా పద్మనందుడు
సి) అజాతశత్రువు
డి) శిశునాగుడు
- View Answer
- సమాధానం: సి
6. మొట్టమొదటి బౌద్ధ సన్యాసిని ఎవరు?
ఎ) యశోధర
బి) గౌతమి
సి) సుజాత
డి) మహామాయ
- View Answer
- సమాధానం: బి
7. అశోకుడి శాసనాలకు తొలిసారిగా ఎవరు అర్థం చెప్పారు?
ఎ) జాన్ టవర్ (1787)
బి) హారిస్మిత్ (1810)
సి) చార్లెస్ మెట్కాఫ్ (1825)
డి) జేమ్స్ ప్రిన్సెస్ (1837)
- View Answer
- సమాధానం: డి
8. మౌర్యుల కాలం నాటి ఏ అధికారి.. ప్రస్తుత జిల్లా కలెక్టర్‌తో సమానమైన విధులు నిర్వహించాడు?
ఎ) సంహర్త
బి) స్థానిక
సి) రజ్జుక
డి) గోప
- View Answer
- సమాధానం: సి
9. సెయింట్ థామస్ ఎవరి పాలనా కాలంలో క్రైస్తవ మతాన్ని ప్రచారం చేయడానికి వాయవ్య దిశ ద్వారా భారతదేశంలోకి వచ్చాడు?
ఎ) మినాండర్
బి) అశోకుడు
సి) గోండోఫెర్నెస్
డి) వాసుదేవుడు
- View Answer
- సమాధానం: సి
10. గుప్తుల శకాన్ని ఎవరు, ఎప్పుడు ప్రారంభించారు?
ఎ) ఘటోత్కచుడు, క్రీ.శ. 300
బి) శ్రీగుప్తుడు, క్రీ.శ. 310
సి) సముద్రగుప్తుడు, క్రీ.శ. 324
డి) మొదటి చంద్రగుప్తుడు, క్రీ.శ. 320
- View Answer
- సమాధానం: డి
11. గుప్తుల కాలానికి చెందిన ‘నవనీతకం’ అనే గ్రంథం దేనికి సంబంధించింది?
ఎ) ఖగోళ శాస్త్రం
బి) గణిత శాస్త్రం
సి) వైద్య శాస్త్రం
డి) లోహ శాస్త్రం
- View Answer
- సమాధానం: సి
12. పర్షియా నుంచి వచ్చిన రాయబారిని తన ఆస్థానానికి ఆహ్వానించిన చాళుక్య రాజు ఎవరు?
ఎ) మొదటి కీర్తివర్మ
బి) వినయాదిత్యుడు
సి) రెండో పులకేశి
డి) విజయాదిత్యుడు
- View Answer
- సమాధానం: సి
13. బాదామి చాళుక్యులు అభివృద్ధి చేసిన వాస్తు కళాశైలి పేరేమిటి?
ఎ) నాగర శైలి
బి) ద్రావిడ శైలి
సి) వేసర శైలి
డి) సార్సనిక్ శైలి
- View Answer
- సమాధానం:సి
14.‘ఘటికలు’ అంటే ఏమిటి?
ఎ) జైన విద్యా సంస్థలు
బి) బౌద్ధ సాంస్కృతిక కేంద్రాలు
సి) ఉన్నత విద్యకు సంబంధించిన వైదిక సంస్థలు
డి) పల్లవుల కాలం నాటి గ్రామ స్థాయి పరిషత్తులు
- View Answer
- సమాధానం: సి
15. భారతదేశంలో తొలిసారిగా బంగారు నాణేలను ఎవరు జారీ చేశారు?
ఎ) ఇండో-గ్రీకులు
బి) శకులు
సి) పార్థియనులు
డి) కుషానులు
- View Answer
- సమాధానం: ఎ
16. ‘శకారి’ అనేది గుప్త వంశానికి చెందిన ఏ రాజు బిరుదు?
ఎ) మొదటి చంద్రగుప్తుడు
బి) సముద్ర గుప్తుడు
సి) రెండో చంద్రగుప్తుడు
డి) స్కంద గుప్తుడు
- View Answer
- సమాధానం: సి
17. ‘హాతిగుంఫా’ శాసనం ఏ పాలకుడి గురించి పేర్కొంటుంది?
ఎ) మొదటి రుద్రదమనుడు
బి) గౌతమీపుత్ర శాతకర్ణి
సి) సముద్రగుప్తుడు
డి) ఖారవేలుడు
- View Answer
- సమాధానం: డి
18.శాతవాహనుల అధికార భాష ఏది?
ఎ) సంస్కృతం
బి) పాళి
సి) ప్రాకృతం
డి) తెలుగు
- View Answer
- సమాధానం: సి
19. ‘వర్ణ సంకరం’ అంటే ఏమిటి?
ఎ) అక్రమ సంతానం
బి) కులభ్రష్టత
సి) మిశ్రమ కులం
డి) విదేశీయుడు
- View Answer
- సమాధానం: సి
20. ఎల్లోరాలో సుప్రసిద్ధ కైలాస శివాలయాన్ని నిర్మించిన రాష్ట్రకూట రాజు ఎవరు?
ఎ) దంతిదుర్గుడు
బి) అమోఘవర్షుడు
సి) మొదటి కృష్ణుడు
డి) ధ్రువుడు
- View Answer
- సమాధానం: సి
21.భారతీయ ముస్లిం లీగ్ ప్రచురించిన వార్తా పత్రిక పేరేమిటి?
ఎ) మూన్
బి) ఇంక్విలాబ్
సి) స్టార్ ఆఫ్ ఇండియా
డి) ఇమ్రోజ్
- View Answer
- సమాధానం: సి
22. మధ్యయుగ భారతదేశ ఆలయాల్లో అతి ఎత్తైది ఏది?
ఎ) ఎల్లోరాలోని కైలాసనాథ ఆలయం
బి) కోణార్కలోని సూర్యదేవాలయం
సి) ఉదయ్‌పూర్‌లోని నీలకంఠేశ్వరాలయం
డి) తంజావూర్‌లోని బృహదీశ్వరాలయం
- View Answer
- సమాధానం: డి
23. ‘చౌగాన్’ (పోలో) ఆడుతూ మరణించిన సుల్తాన్ ఎవరు?
ఎ) ఇల్-టుట్-మిష్
బి) అల్లా ఉద్దీన్ ఖిల్జీ
సి) మహమ్మద్ బీన్ తుగ్లక్
డి) కుతుబుద్దీన్ ఐబక్
- View Answer
- సమాధానం: డి
24. ‘ఆగ్రా’ నగర నిర్మాత ఎవరు?
ఎ) అల్లా ఉద్దీన్ ఖిల్జీ
బి) మహమ్మద్ బీన్ తుగ్లక్
సి) ఫిరోజ్‌షా తుగ్లక్
డి) సికిందర్ లోడీ
- View Answer
- సమాధానం: డి
25. చిత్తోడ్‌లో సుప్రసిద్ధ ‘కీర్తి స్తంభం’ను ఎవరు నిర్మించారు?
ఎ) రాణా రతన్ సింగ్
బి) రాణా హమ్మీర్
సి) రాణా కుంభ
డి) రాణా సంగ్రామ్ సింగ్
- View Answer
- సమాధానం: సి
26. యువరాజు ‘దారాషికో’ ఏ సూఫీ శాఖను అనుసరించాడు?
ఎ) నక్షబందీ
బి) ఖాద్రి
సి) చిస్తీ
డి) సుహ్రావర్ది
- View Answer
- సమాధానం:బి
27. ఉత్తర మేరూర్ శాసనం దేని గురించి తెలుపుతోంది?
ఎ) చోళుల వంశ మూలాలు
బి) మొదటి రాజరాజు సైనిక విజయాలు
సి) చోళులు, శైలేంద్రుల మధ్య ఉన్న దౌత్య సంబంధాలు
డి) చోళుల కాలంలో స్వయం ప్రతిపత్తితో కూడిన గ్రామ పాలన
- View Answer
- సమాధానం: డి
28.యువరాజు సలీమ్ ప్రేరణతో 1602లో అక్బర్ అధికారిక చరిత్రకారుడైన ‘అబుల్ ఫజల్’ను హత్య చేసింది ఎవరు?
ఎ) మీర్జా ఘియాస్ బేగ్
బి) బీర్ సింగ్ బుందేలా
సి) రాజా తోడర్ మల్
డి) రాజా భగవాన్ దాస్
- View Answer
- సమాధానం: బి
29. మొగలు వంశానికి చెందిన ఏ పాలకుడి కాలంలో భారత్‌లోకి పొగాకు ప్రవేశించింది?
ఎ) ఔరంగజేబు
బి) జహంగీర్
సి) అక్బర్
డి) షాజహాన్
- View Answer
- సమాధానం: సి
30.మొగలు పాలకుల సమాధుల్లో ‘తాజ్‌మహల్‌కు మూలరూపం’గా దేన్ని పేర్కొంటారు?
ఎ) ఢిల్లీలోని హుమయూన్ సమాధి
బి) లాహోర్‌లోని ఇతమాద్ ఉద్దౌలా సమాధి
సి) ఆగ్రాలోని ఇతిమాద్ ఉద్దౌలా సమాధి
డి) ఫతేపూర్ సిక్రీలోని సలీమ్ చిస్తీ సమాధి
- View Answer
- సమాధానం:ఎ
31. పోర్చుగీసువారు భారతదేశంలో దేన్ని రాజధానిగా చేసుకున్నారు?
ఎ) గోవా
బి) కొచ్చిన్
సి) కాలికట్
డి) కన్ననూర్
- View Answer
- సమాధానం: ఎ
32. శివాజీ మత గురువు ఎవరు?
ఎ) తుకారాం
బి) రామదాసు
సి) ఏక్నాథ్
డి) జ్ఞాన దేవుడు
- View Answer
- సమాధానం: బి
33. శివాజీ ‘పురంధర్ సంధి’ని ఏ సంవత్సరంలో, ఎవరితో చేసుకున్నాడు?
ఎ) 1645, షాయిస్తఖాన్
బి) 1650, అఫ్జల్ ఖాన్
సి) 1660, రాజా జశ్వంత్ సింగ్
డి) 1665, రాజా జై సింగ్
- View Answer
- సమాధానం: డి
34. కింద పేర్కొన్న వారిలో ‘నానా సాహెబ్’గా ప్రసిద్ధి చెందింది ఎవరు?
ఎ) మొదటి బాజీరావు
బి) బాలాజీ బాజీరావు
సి) దొండూ పండిట్ (పంత్)
డి) సవాయ్ మాధవరావు
- View Answer
- సమాధానం:సి
35. ‘ఆళ్వారులు’గా ఎవరిని పేర్కొంటారు?
ఎ) శైవ సన్యాసులు
బి) వైష్ణవ సన్యాసులు
సి) శైవ, వైష్ణవ సన్యాసులు
డి) బ్రహ్మారాధకులు
- View Answer
- సమాధానం: బి
36. ‘స్థల మహాత్యాలు’ అంటే ఏమిటి?
ఎ) స్థానిక దేవతల మూలాలను వివరించే పురాణ గాథలు
బి) ఆలయ నిర్వహణకు సంబంధించిన అధికారులు
సి) మత భావాలున్న వ్యక్తులు సాగించే తీర్థయాత్రలు
డి) దేవాలయం విధించే ప్రత్యేక సుంకాలు
- View Answer
- సమాధానం: ఎ
37. ‘మ్లేచ్చ-భోజ’ పదానికి అర్థం ఏమిటి?
ఎ) మాంసం
బి) బియ్యం
సి) గోధుమ
డి) సుగంధ ద్రవ్యాలు
- View Answer
- సమాధానం: సి
38. సుప్రసిద్ధ అంగ్‌కోర్‌వాట్-విష్ణు ఆలయాన్ని నిర్మించిన కాంబోడియా రాజు ఎవరు?
ఎ) అనంత వర్మ
బి) చంద్రవర్మ
సి) రెండో సూర్య వర్మ
డి) మొదటి సూర్యవర్మ
- View Answer
- సమాధానం: సి
39. తమిళనాడులోని సుప్రసిద్ధ చిదంబరం ఆలయంలోని దేవుడి పేరేమిటి?
ఎ) సుబ్రహ్మణ్యం
బి) నటరాజు
సి) పార్వతి
డి) విష్ణువు
- View Answer
- సమాధానం: బి
40. ఢిల్లీ నగరాన్ని నిర్మించిన ఘనత దక్కించుకున్న తోమార రాజు ఎవరు?
ఎ) అనంగపాలుడు
బి) వజ్రకుడు
సి) రుద్రాణుడు
డి) దేవరాజు
- View Answer
- సమాధానం: ఎ
41. ‘బ్లాక్ హోల్ ఉదంతం’ ఎక్కడ జరిగింది?
ఎ) ముర్షిదాబాద్
బి) ఢాకా
సి) లక్నో
డి) కలకత్తా
- View Answer
- సమాధానం: డి
42. ఆంగ్లేయులు భారతదేశంలో ఇంగ్లిష్‌ను బోధనా మాధ్యమంగా ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు?
ఎ) 1813
బి) 1833
సి) 1835
డి) 1844
- View Answer
- సమాధానం: సి
43. ‘స్వరాజ్యం నా జన్మహక్కు, దాన్ని సాధిస్తాను’ అని తిలక్ ఏ సంవత్సరంలో ప్రకటించారు?
ఎ) 1905
బి) 1907
సి) 1914
డి) 1916
- View Answer
- సమాధానం: డి
44. బెంగాల్, బిహార్‌లో శాశ్వత బందోబస్తును ఎవరు ప్రవేశపెట్టారు?
ఎ) కార్న్ వాలీస్
బి) వారన్ హేస్టింగ్స్
సి) వెల్లస్లీ
డి) డల్హౌసీ
- View Answer
- సమాధానం: ఎ
45. రాయలసీమ ప్రాంతంలో రైత్వారీ విధానాన్ని ఎవరు ప్రవేశపెట్టారు?
ఎ) ఎల్ఫిన్ స్టోన్
బి) థామస్ మన్రో
సి) రిప్పన్
డి) జాన్ లారెన్స్
- View Answer
- సమాధానం: బి
46. లార్డ్ డల్హౌసీ 1853లో మొదటి టెలిగ్రాఫ్ లైన్‌ను ఏయే నగరాల మధ్య ఏర్పాటు చేశాడు?
ఎ) బొంబాయి - థాణే
బి) కలకత్తా - మద్రాస్
సి) బొంబాయి - ఆగ్రా
డి) కలకత్తా - ఆగ్రా
- View Answer
- సమాధానం: డి
47. బ్రిటిష్ సైనికులు ఢిల్లీలో పురుషులను మూకుమ్మడిగా హత్య చేయడాన్ని గమనించిన ఉర్దూ కవి ఎవరు?
ఎ) ఫిరాఖ్ గోరఖ్ పురి
బి) జోష్ మలిహబాది
సి) మీర్జా గాలీబ్
డి) మీర్ బాబర్ అలీ అనస్
- View Answer
- సమాధానం: సి
48. ‘ది ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్’ (1857) గ్రంథ రచయిత ఎవరు?
ఎ) సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్
బి) వి.డి. సావర్కర్
సి) ఎస్.ఆర్. శర్మ
డి) ఆర్.సి. మజుందార్
- View Answer
- సమాధానం: బి
49.సిక్కు గురువుల్లో వాస్తవమైన, ఏకైక సిక్కు గురువుగా కుకాలు ఎవరిని గుర్తించారు?
ఎ) గురు అంగద్
బి) గురు అమర్దాస్
సి) గురు హరగోవింద్
డి) గురు గోవింద్ సింగ్
- View Answer
- సమాధానం: సి
50. మయూర సింహాసనంపై కూర్చున్న చివరి మొగల్ చక్రవర్తి ఎవరు?
ఎ) అహ్మద్ షా
బి) జహందర్ షా
సి) మహమ్మద్ షా
డి) ఫరూఖ్ సియాద్
- View Answer
- సమాధానం: సి
51. మహారాష్ట్రకు చెందిన ఏ సామాజిక, మత సంస్కర్త ‘లోక హితవాది’గా ప్రసిద్ధి చెందారు?
ఎ) జ్యోతిరావ్ పూలే
బి) ఎమ్.జి. రనడే
సి) గోపాల్హరి దేశ్‌ముఖ్
డి) జి.జి. అగార్కర్
- View Answer
- సమాధానం: సి
52. ‘మిలియన్ల కొద్దీ ప్రజలు ఆకలితోనూ, అమాయకత్వంతోనూ జీవిస్తున్నంత కాలం ప్రతి ఒక్కడూ ద్రోహే అని నేను భావిస్తాను’ అని పేర్కొన్నవారెవరు?
ఎ) స్వామి వివేకానంద
బి) ఎం.కె. గాంధీ
సి) బి.జి. తిలక్
డి) జి.కె. గోఖలే
- View Answer
- సమాధానం: ఎ
53. ‘గులామ్ గిరీ’ గ్రంథాన్ని ఎవరు రాశారు?
ఎ) బి.ఆర్. అంబేడ్కర్ (1925)
బి) జ్యోతిరావ్ పూలే (1872)
సి) గోపాల్ హరి దేశ్‌ముఖ్ (1900)
డి) ఎం.జి. రనడే (1895)
- View Answer
- సమాధానం: బి
54. కింది వాటిలో కేరళలో జరిగిన ఉద్యమం ఏది?
ఎ) మోప్లా తిరుగుబాటు
బి) బార్డోలి ఉద్యమం
సి) చంపారన్ ఉద్యమం
డి) రంపా తిరుగుబాటు
- View Answer
- సమాధానం: ఎ