ఢిల్లీ సుల్తానులు
1. భారతదేశంపై మొదటిసారిగా ముస్లిం పాలకుల దండయాత్ర ఎప్పుడు జరిగింది?
1) క్రీ.శ. 637
2) క్రీ.శ. 712
3) క్రీ.శ. 622
4) క్రీ.శ. 710
- View Answer
- సమాధానం: 1
2. కింది వాటిలో సరైంది ఏది?
1) భారత్‌పై తొలిసారిగా ముస్లిం పాలకుల దండయాత్ర విజయవంతమైన సంవత్సరం - క్రీ.శ. 712
2)మొదటి ముస్లిం దాడికి నాయకుడు - మహమ్మద్ ఖాసిం
3) ఖాసిం సింధు ప్రాంతాన్ని ఆక్రమించినప్పుడు ఆ ప్రాంత పాలకుడు-దాహిర్
4) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం:4
3. భారతీయులపై జిజియా పన్ను విధించిన మొదటి ముస్లిం పాలకులు ఎవరు?
1) తురుష్కులు
2) లోడీలు
3) అరబ్బులు
4) మొఘలులు
- View Answer
- సమాధానం: 3
4. మహమ్మద్ గజినీ దండయాత్రలకు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
1) క్రీ.శ. 1000 1027 మధ్య భారతదేశంపై గజినీ 17 సార్లు దండయాత్ర చేశాడు
2) మహమ్మద్ గజినీతోపాటు భారతదేశానికి వచ్చిన ప్రముఖ కవి-అల్బెరూని
3) అల్బెరూని రాసిన ‘కితాబ్-ఉల్-హింద్’ గ్రంథం 11వ శతాబ్దం నాటి భారతదేశ పరిస్థితిని వివరిస్తోంది
4) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 4
5.మహమ్మద్ ఘోరి తొలిసారి ఏ ప్రాంతంపై దండయాత్ర చేశాడు?
1) పంజాబ్
2) ముల్తాన్
3) సింధ్
4) కాశ్మీర్
- View Answer
- సమాధానం: 2
6. భారతదేశంలో ముస్లిం సామ్రాజ్య స్థాపనకు దోహదం చేసిన యుద్ధం ఏది?
1) రెండో తరైన్ యుద్ధం
2) మొదటి తరైన్ యుద్ధం
3) చాందావార్ యుద్ధం
4) మొదటి పానిపట్టు యుద్ధం
- View Answer
- సమాధానం: 1
7. కింది వాటిలో సరైన వాక్యం ఏది?
1) ఇస్లాం మత స్థాపకుడు మహమ్మద్ ప్రవక్త స్వస్థలం - మక్కా
2) ఇస్లాం క్యాలెండర్ ప్రారంభమైన సంవత్సరం - క్రీ.శ. 622
3) ప్రపంచంలో ముస్లింలందరికీ అధిపతి - ఖలీఫా
4) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 4
8. ‘అరబ్బుల దాడి ఫలితం ఇవ్వని ఘనవిజయం’గా అభివర్ణించింది ఎవరు?
1) హాల్స్ హేయింగ్
2) స్టాన్లీ లీన్పూల్
3) విలియం థాంట్
4) జేమ్స్ రోచీ
- View Answer
- సమాధానం: 2
9. కింది వాటిలో సరైన జత ఏది?
1) సింధు రాజధాని - అరోర్
2) బంగారు నగరం - ముల్తాన్
3) దాహీర్, ఖాసిం మధ్య జరిగిన యుద్ధం - రేవార్ యుద్ధం
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
10. గజినీ 15వ దండయాత్రలో (1025లో) శిథిలమైన ప్రముఖ ఆలయం ఏది?
1) జ్వాలాముఖి ఆలయం
2) శ్రీచక్రస్వామి ఆలయం
3) సోమనాథ ఆలయం
4) పైవేవీ కావు
- View Answer
- సమాధానం: 3
11. గజినీ ఆస్థానంలో కవులు, గ్రంథాలకు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
1) ఫిరదౌసి - షానామా
2) ఉద్బి - తారిఖ్ ఇ యామిని
3) 1, 2
4) పైవేవీ కావు
- View Answer
- సమాధానం: 3
12. గజినీ సోమనాథ ఆలయంపై దాడికి పాల్పడిన సమయంలో గుజరాత్‌ను పాలిస్తున్న సోలంకీ వంశస్థుడు ఎవరు?
1) మొదటి భీమ
2) రెండో భీమ
3) జయసింహ
4) కుమారపాల
- View Answer
- సమాధానం: 1
13.తరైన్ యుద్ధంలో మహమ్మద్ ఘోరీని ఎదిరించిన రాజపుత్ర పాలకుడు ఎవరు?
1) పృథ్విరాజ్ చౌహన్
2) జయచంద్ర
3) గోవింద్ రాజ్
4) రెండో భీమ
- View Answer
- సమాధానం: 1
14.కింది వాటిలో సరైన జత ఏది?
1) కాశీలో ఖగోళ శాస్త్రాన్ని అభ్యసించిన అరబ్బుడు - అల్బెరూని
2) అరబ్బుల ప్రభావంతో భారతదేశంలో అభివృద్ధి చెందిన శిల్పకళ - ఇండో సార్సనిక్ కళ
3) ఇండో సార్సనిక్ కళతో నిర్మించిన మొదటి కట్టడం - పద్మమహల్
4) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 4
15. ‘పారశీక భాషకు హోమర్ లాంటివాడు’ అని కీర్తి గడించిన కవి ఎవరు?
1) ఫిరదౌసి
2) ఉద్బి
3) అల్బెరూని
4) బరౌని
- View Answer
- సమాధానం: 1
16. భారతదేశాన్ని పాలించిన మొదటి ముస్లిం రాజవంశం ఏది?
1) తుగ్లక్
2) బానిస
3) ఖిల్జీ
4) లోడి
- View Answer
- సమాధానం: 2
17. ఢిల్లీ సుల్తాన్లు, వారి ప్రత్యేకతలకు సంబంధించి కింది వాటిని జతపరచండి.
గ్రూప్ - ఎ | గ్రూప్ - బి |
a. కుతుబుద్దీన్ ఐబక్ | i. మొదటి ముస్లిం పాలకుడు |
b. అల్లావుద్దీన్ ఖిల్జీ | ii. సుల్తాన్లందరిలో అగ్రగణ్యుడు |
c. బహలాల్ లోడి | iii. అత్యధిక కాలం పాలించాడు |
d. ఇబ్రహీం లోడి | iv. యుద్ధ రంగంలో మరణించిన ఏకైక సుల్తాన్ |
e. సికిందర్ లోడి | v. ఆగ్రా నగర నిర్మాత |
1) a-i, | b-ii, | c-iii, | d-iv, | e-v |
2) a-v, | b-iv, | c-iii, | d-ii, | e-i |
3) a-iii, | b-v, | c-ii, | d-i, | e-iv |
4) a-iv, | b-iii, | c-i, | d-ii, | e-v |
- View Answer
- సమాధానం: 1
18.హిందువుల పండగలైన దీపావళి, హోలీ వేడుకల్లో పాల్గొన్న ఢిల్లీ సుల్తాన్ ఎవరు?
1) మహమ్మద్ బిన్ తుగ్లక్
2) నాజరుద్దీన్ మహమ్మద్
3) బాల్బన్
4) ఇల్-టుట్-మిష్
- View Answer
- సమాధానం: 1
19. ఇండో- పర్షియన్ శైలిలో నిర్మించిన మొదటి కట్టడం ‘కువ్వత్- ఉల్-ఇస్లాం’ ఎక్కడ ఉంది?
1) అజ్మీర్
2) ఆగ్రా
3) ఢిల్లీ
4) దౌలతాబాద్
- View Answer
- సమాధానం: 3
20.భారతదేశాన్ని పాలించిన మొదటి ముస్లిం పాలకురాలు ‘రజియా సుల్తానా’ గురించి వివరించే గ్రంథం ఏది?
1) తబాకత్ - ఇ- నాసిరి
2) తారిఖ్ - ఇ - యామిని
3) తారిఖ్ - ఇ - ముబారక్ షాహి
4) తాజుల్ మాసిర్
- View Answer
- సమాధానం: 1
21. కుతుబ్ మినార్‌కు సంబంధించి కిందివాటిలో సరైంది ఏది?
1)భారతదేశంపై ముస్లింల విజయానికి గుర్తుగా కుతుబుద్దీన్ ఐబక్ దీని నిర్మాణాన్ని ప్రారంభించాడు
2) ‘కుతుబుద్దీన్ భక్తియార్ కాకి’ అనే సూఫీ సన్యాసి గౌరవార్థం దీన్ని కుతుబ్ మినార్ అని పిలిచారు
3) కుతుబ్ మినార్ ఎత్తు 242 అడుగులు
4) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 4
22. బానిస వంశ పాలకుడు ‘ఇల్‌టుట్ మిష్’ కు సంబంధించి కింది వాటిలో సరైంది?
1) ఇతడి పాలనా కాలం నుంచి భారతదేశంపై మంగోలుల దాడి ప్రారంభమైంది
2) చిహల్‌గనీ (చాలీసా) అనే 40 మంది బానిస తురుష్క సర్దారుల కూటమి ఏర్పాటు చేశాడు
3) రాజ్యాన్ని ‘ఇక్తా’ అనే సైనిక విభాగాలుగా విభజించాడు
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
23. ‘సమాధుల పితామహుడు’గా పిలిచే ఢిల్లీ సుల్తాన్ ఎవరు?
1) ఇల్‌టుట్ మిష్
2) రక్నుద్దీన్ ఫిరోజ్ షా
3) బహరాం షా
4) నాసిరుద్దీన్ మహమ్మద్
- View Answer
- సమాధానం: 1
24. బానిస వంశ పాలకుల్లో అగ్రగణ్యుడైన బాల్బన్‌కు సంబంధించి కింది వాటిలో సరైన వాక్యం ఏది?
1) బరీద్ అనే గూఢచారి వ్యవస్థను ఏర్పాటు చేశాడు
2) చిహల్గనీని అణచివేశాడు
3) సుల్తానత్‌లో పారశీక సంప్రదాయాలను ప్రవేశపెట్టాడు
4) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 4
25.కింది వాటిలో ‘ఉర్దూ ఆదికవి’గా పేరు పొందిన అమీర్ ఖుస్రూ ప్రముఖ రచన ఏది?
1) తుగ్లక్ నామా
2) మిఫ్తీ-ఉల్-పుతా
3) ఆషిఖీ
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
26. ‘రాజు దేవుడి నీడ’ (జిల్-ఇ-ఇలాహి), ‘రాచరికం దైవదత్తం’ (నియాంభత్-ఇ-కుదాయి) అని ప్రకటించిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు?
1) అల్తమస్
2) బాల్బన్
3) ఫిరోజ్‌షా తుగ్లక్
4) అల్లా ఉద్దీన్ ఖిల్జీ
- View Answer
- సమాధానం: 2
ఎ. కుతుబుద్దీన్ ఐబక్ | 1. బానిస వంశం |
బి. జలాలుద్దీన్ | 2. ఖిల్జీ వంశం |
సి. ఘియాజుద్దీన్ | 3. తుగ్లక్ వంశం |
డి. ఖజరీ ఖాన్ | 4. సయ్యద్ వంశం |
ఇ. బహలాల్ | 5. లోడి వంశం |
1) ఎ-1 | బి-2, | సి-3, | డి-4, | ఇ-5 |
2) ఎ-5, | బి-4, | సి-3, | డి-2, | ఇ-1 |
3) ఎ-3, | బి-5, | సి-1, | డి-2, | ఇ-4 |
4) ఎ-2, | బి-5, | సి-3, | డి-1, | ఇ-4 |
- View Answer
- సమాధానం: 1
28. మంగోలులు ముస్లింలుగా మారి ఎవరి పాలనా కాలం నుంచి భారతదేశంలో స్థిరపడ్డారు?
1) జలాలుద్దీన్ ఖిల్జీ
2) కయీమార్సే
3) కైకుబాద్
4) ముబారక్ ఖిల్జీ
- View Answer
- సమాధానం: 1
-
1) తుగ్లక్
2) ఖిల్జీ
3) సయ్యద్
4) లోడి
- View Answer
- సమాధానం: 2
30. అలెగ్జాండర్ మాదిరిగానే ప్రపంచ విజేత కావాలనుకున్న ఢిల్లీ సుల్తాన్ ఎవరు?
1) అల్లావుద్దీన్ ఖిల్జీ
2) సికిందర్ లోడి
3) మహమ్మద్ షా తుగ్లక్
4) బాల్బన్
- View Answer
- సమాధానం: 1
31.అల్లావుద్దీన్ మేవార్ దండయాత్రకు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
1) 1303లో మేవార్ రాజధాని చిత్తోర్ను ఆక్రమించాడు
2) రాజు రతన్‌సింగ్ మరణించినప్పుడు రాణి పద్మిని ‘జోహార్’ పాటించింది
3) ‘రాణి పద్మావతి’ గ్రంథకర్త మాలిక్ మహమ్మద్ జైషే ప్రకారం రాణి పద్మిని కోసమే అల్లావుద్దీన్ దాడి చేశాడు
4) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 4
32. అల్లావుద్దీన్ దండయాత్రలో ముఖ్యుడు, దక్షిణ భారత దండయాత్రలకు నాయకుడిగా నియమితుడైనవారెవరు?
1) ఉల్గూఖాన్
2) నస్రత్‌ఖాన్
3) మాలిక్ కపూర్
4) ఖిజరీ ఖాన్
- View Answer
- సమాధానం: 3
33. కింది వాటిలో అల్లావుద్దీన్ ఖిల్జీ విధించిన పన్ను ఏది?
1) ఘరీ
2) ఛరీ
3) 1, 2
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 3
34. అల్లావుద్దీన్ ఖిల్జీ సంస్కరణల్లో అత్యంత ముఖ్యమైనవి ఏవి?
1) సైనిక సంస్కరణలు
2) మార్కెట్ సంస్కరణలు
3) న్యాయ సంస్కరణలు
4) పాలనా సంస్కరణలు
- View Answer
- సమాధానం: 2
35. సైనిక వ్యవస్థను పటిష్టం చేయడానికి కింది వాటిలో అల్లావుద్దీన్ ప్రవేశపెట్టింది ఏది?
1) చెహ్రా - సైనిక వివరాల రిజిస్టర్
2) ధాగ్ - గుర్రాలపై రాజముద్ర
3) ‘ఇక్తా’ల రద్దు చేసి సైనికులకు జీతాలిచ్చే పద్ధతి
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
36. అల్లావుద్ధీన్ ఖిల్జీ ప్రవేశపెట్టిన విధానాలకు సంబంధించి కింది వాటిని జతపరచండి.
గ్రూప్ - ఎ | గ్రూప్ - బి |
ఎ. దివాన్ - ఎ- ముస్తఖ్రాజ్ | 1. పన్ను బకాయి వసూలు శాఖ |
బి. దివాన్-ఎ-రియాసత్ | 2. మార్కెట్ ధరల నియంత్రణ శాఖ |
సి. షహనాయ్-ఎ-మండి | 3. మార్కెట్ ఉద్యోగి |
డి. సరాయి అదిల్ | 4. ప్రభుత్వ మార్కెట్ |
1) ఎ-1, | బి-2, | సి-3, | డి-4 |
2) ఎ-4, | బి-3, | సి-2, | డి-1 |
3) ఎ-3, | బి-2, | సి-4, | డి-1 |
4) ఎ-2, | బి-1, | సి-4, | డి-3 |
- View Answer
- సమాధానం: 1
37. కొత్త భూములను సాగులోకి తెచ్చే ‘పాల పద్ధతి’ని ప్రవేశపెట్టిన సుల్తాన్ ఎవరు?
1) ఘియాజుద్దీన్ తుగ్లక్
2) మహమ్మద్ బిన్ తుగ్లక్
3) ఫిరోజ్ షా తుగ్లక్
4) మహమ్మద్ షా తుగ్లక్
- View Answer
- సమాధానం: 1
38. మహమ్మద్ బిన్ తుగ్లక్కు సంబంధించి కింది వాటిలో సరైన వ్యాఖ్య ఏది?
1) అనేక రంగాల్లో ప్రావీణ్యం ఉన్నా ఇతడు చేపట్టిన సంస్కరణలు విఫలమవడం వల్ల పిచ్చి తుగ్లక్‌గా పిలిచారు
2) అజ్మీర్‌లో మొయినుద్దీన్ చిస్తీ సమాధిని దర్శించిన మొదటి సుల్తాన్
3) వ్యవసాయాభివృద్ధికి ‘దివాన్ - ఇ - కోహి’ అనే నూతన శాఖ ఏర్పాటు చేశాడు
4) పైవన్నీ
- View Answer
- సమాధానం:4
39. మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో ఢిల్లీని సందర్శించిన మొరాకో యాత్రికుడు ‘ఇబన్ బటూటా’ రచించిన గ్రంథం ఏది?
1) తారిఖ్ - ఇ- రెహ్లాల్
2) సఫర్ నామా
3) 1, 2
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 3
40. మహమ్మద్ బిన్ తుగ్లక్ 1327లో రాజధానిని ఢిల్లీ నుంచి ఏ ప్రాంతానికి మార్చాడు?
1) దేవగిరి
2) ద్వారా సముద్రం
3) మధుర
4) సుల్తానాబాద్
- View Answer
- సమాధానం: 1
41. సుల్తానత్ కాలంలో కొన్ని నగరాల పేర్లను మార్చారు. వాటికి సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
1) దేవగిరి - దౌలతాబాద్
2) చిత్తోర్ - ఖజారిబాద్
3) ఓరుగల్లు - సుల్తానాపూర్
4) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 4
42. అన్ని రకాల పన్నులను రద్దు చేసి షరియత్ ఆమోదించిన నాలుగు రకాల పన్నులను మాత్రమే విధించిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు?
1) ఫిరోజ్ షా తుగ్లక్
2) బహలాల్ లోడి
3) ముబారిఖ్ షా
4) జలాలుద్దీన్ ఖిల్జీ
- View Answer
- సమాధానం: 1