‘ఐటీ ఇన్నోవేషన్ స్టార్ట్-అప్ ఫండ్’ ప్రారంభించిన మొదటి ప్రభుత్వ రంగ బ్యాంక్ ఏది?
1. ‘ఐటీ ఇన్నోవేషన్ స్టార్ట్-అప్ ఫండ్’ ప్రారంభించిన మొదటి ప్రభుత్వ రంగ బ్యాంక్ ఏది?
ఎ) ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్
బి) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
సి) ఆంధ్రా బ్యాంక్
డి) కెనరా బ్యాంక్
- View Answer
- సమాధానం: బి
2.కొరియా ప్లస్ ఏర్పాటులో ప్రధాన ఉద్దేశం ఏమిటి?
ఎ) ఉత్తర కొరియా, దక్షిణ కొరియా మధ్య సహకారాన్ని పెంచడం
బి) ఉత్తర కొరియా, వియత్నాం మధ్య సహకారాన్ని పెంచడం
సి) భారత్‌లో కొరియన్ పెట్టుబడులను ప్రోత్సహించడం
డి) పైవేవీ కావు
- View Answer
- సమాధానం: సి
3.ఇంటర్నేషనల్ చాంబర్ ఆఫ్ కామర్స్ కు ఇటీవల చైర్మన్‌గా ఎవరు ఎన్నికయ్యారు?
ఎ) సునీల్ భారతీ మిట్టల్
బి) లూసీ రీడ్
సి) లలిత్ భాసిన్
డి) నీల్ కప్లాన్s
- View Answer
- సమాధానం: ఎ
4. ఇటీవల ప్రకటించిన ‘పౌర విమానయాన విధానం-2016’ లక్ష్యాలకు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
ఎ) 2022 నాటికి భారత్‌ను 3వ అతిపెద్ద పౌర విమానయాన మార్కెట్‌గా తీర్చిదిద్దడం
బి) స్వదేశీ ప్రయాణికుల సంఖ్యను 2015 లో ఉన్న 8 కోట్ల నుంచి 2022 నాటికి 30 కోట్లకు పెంచడం
సి) 2027 నాటికి సరకు రవాణా పరిమాణాన్ని 10 మిలియన్ టన్నులకు పెంచడం
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
5. ప్రస్తుతం రిజర్వ బ్యాంక్ నిర్వహిస్తున్న ఎస్.ఎల్.ఆర్. ఎంత?
ఎ) 21.25 శాతం
బి) 22.50 శాతం
సి) 23.75 శాతం
డి) 24.85 శాతం
- View Answer
- సమాధానం: ఎ
6.గ్లోబల్ రిటైల్ డెవలప్మెంట్ సూచీని రూపొందించే కన్సల్టెన్సీ ఏది?
ఎ) Mc Kinsey
బి) మిట్కాన్ కన్సల్టెన్సీ
సి) A.T. Kearney
డి) ITCOT కన్సల్టెన్సీ
- View Answer
- సమాధానం:సి
7. ఐటీ ఆధారిత స్టార్ట-అప్‌లను ప్రోత్సహించడానికి ఇటీవల ఐటీ విధానాన్ని ప్రకటించిన రాష్ట్రం ఏది?
ఎ) తెలంగాణ
బి) ఆంధ్రప్రదేశ్
సి) మహారాష్ట్ర
డి) గుజరాత్
- View Answer
- సమాధానం: డి
8. ఇండియా-మొరాకో చాంబర్ ఆఫ్ కామర్స్ ను ఇటీవల ఎక్కడ ప్రారంభించారు?
ఎ) న్యూఢిల్లీ
బి) ఇస్లామాబాద్
సి) రబాత్
డి) జకార్తా
- View Answer
- సమాధానం: సి
9. దేశీయ విమాన సేవల సంస్థల్లో నేరుగా అనుమతించే విధానంలో భాగంగా ఎఫ్‌డీఐల పరిమితిని ఇటీవల 49 శాతం నుంచి ఎంత శాతం వరకు పెంచారు?
ఎ) 76
బి) 80
సి) 90
డి) 100
- View Answer
- సమాధానం: డి
10. ఇంటర్నేషనల్ చాంబర్ ఆఫ్ కామర్స్ కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉంది?
ఎ) మాస్కో
బి) ఢిల్లీ
సి) పారిస్
డి) దావోస్
- View Answer
- సమాధానం: సి
11. కేంద్ర ప్రభుత్వం 2016 జూన్ 20న కింద పేర్కొన్న ఏ రంగంలో నూరు శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల అనుమతికి సంబంధించి నిర్ణయం తీసుకుంది?
ఎ) రక్షణ రంగం
బి) ఔషధ రంగం, పౌర విమానయానం
సి) ఆహార ప్రాసెసింగ్
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
12. ప్రాథమిక పాఠశాలలను కళాశాలలతో అనుసంధానం చేసే చర్యల్లో భాగంగా ‘మైత్రీ ఏక్ జ్ఞాన్ యాత్ర’ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది?
ఎ) కేరళ
బి) అసోం
సి) మేఘాలయ
డి) త్రిపుర
- View Answer
- సమాధానం: బి
13. లక్నోలో మెట్రోలైన్ నిర్మాణానికి 450 మిలియన్ యూరోలను రుణంగా ఇవ్వడానికి అంగీకరించిన బ్యాంక్ ఏది?
ఎ) ది యురోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్
బి) బ్రిక్స్ బ్యాంక్
సి) బ్యాంక్ ఆఫ్ ఫ్రాన్స్
డి) ప్రపంచ బ్యాంక్
- View Answer
- సమాధానం: ఎ
14. వాంకోర్ ఆయిల్ ఫీల్డ్‌లో ఓఎన్జీసీ విదేశీ లిమిటెడ్ వాటా ఎంత శాతం?
ఎ) 15
బి) 22
సి) 26
డి) 30
- View Answer
- సమాధానం: సి
15.‘తీస్తా లో డ్యాం హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్టు’ను ఏర్పాటు చేసిన సంస్థ ఏది?
ఎ) పశ్చిమ బెంగాల్ విద్యుత్ కార్పొరేషన్
బి) నేషనల్ హైడ్రో ఎలక్ట్ట్రిక్ పవర్ కార్పొరేషన్
సి) తీస్తా హైడ్రో ఎలక్ట్ట్రిక్ పవర్ కార్పొరేషన్
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: బి
16. డయేరియా వల్ల సంభవించే శిశు మరణాలను అరికట్టడానికి ఇటీవల విడుదల చేసిన మొదటి ఇండీజీనస్ రోటో వైరస్ వ్యాక్సిన్ పేరేమిటి?
ఎ) రోటావాక్
బి) రేబిస్ వ్యాక్సిన్
సి) వారిసెల్లా వ్యాక్సిన్
డి) ఎం.ఎం.ఆర్.వి.
- View Answer
- సమాధానం: ఎ
17. గ్లోబల్ ట్రెండ్స్ ఇన్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్ నివేదికను ప్రచురించే సంస్థ?
ఎ) ప్రపంచ బ్యాంక్
బి) UNCTAD
సి) యునెటైడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్
డి) గ్లోబల్ కాంపిటీటివ్నెస్ ఇండెక్స్
- View Answer
- సమాధానం: సి
18. భారతదేశంలో తొలి నది అనుసంధానిత ప్రాజెక్ట్ ‘పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు’ను చేపట్టిన రాష్ట్రం ఏది?
ఎ) కర్ణాటక
బి) తెలంగాణ
సి) తమిళనాడు
డి) ఆంధ్రప్రదేశ్
- View Answer
- సమాధానం: డి
19. మిజోరాం ప్రభుత్వం ఏ అంశానికి సంబంధించి జపనీస్ ఇంటర్నేషనల్ కో-ఆపరేటివ్ ఏజెన్సీతో ఒప్పందం కుదుర్చుకుంది?
ఎ) గ్రామీణాభివృద్ధి
బి) సుస్థిర వ్యవసాయం, నీటిపారుదల అభివృద్ధిలో సామర్థ్యం పెంపు
సి) వాతావరణ కాలుష్యం తగ్గింపు
డి) పైవేవీ కావు
- View Answer
- సమాధానం: బి
20. ‘ప్రధానమంత్రి ఆవాస్ యోజన-గ్రామిన్’ కార్యక్రమం ఉద్దేశం ఏమిటి?
ఎ) గృహంలేని వారికి పక్కా గృహాల నిర్మాణానికి ఆర్థిక సహాయం
బి) నీటిపారుదల అభివృద్ధి
సి) గ్రామీణ విద్య, ఆరోగ్య రంగాల అభివృద్ధి
డి) గ్రామీణ రోడ్ల నిర్మాణం
- View Answer
- సమాధానం: ఎ
21. ‘ఆసియా-పసిఫిక్ ఎకనమిక్ కో-ఆపరేషన్’ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
ఎ) 1979
బి) 1985
సి) 1987
డి) 1989
- View Answer
- సమాధానం: డి
22. బీమా, పెన్షన్ రంగాల్లో ఎఫ్‌డీఐ పరిమితి 49 శాతానికి మించినప్పుడు ఎవరి అనుమతి అవసరం?
ఎ) విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
బి) విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు
సి) ఆర్థిక మంత్రిత్వ శాఖ
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: బి
23. కేంద్ర కేబినెట్.. జాతీయ పెట్టుబడి, అవస్థాపన నిధి నుంచి దీర్ఘకాల పెట్టుబడి సమీకరణకు ఏ దేశంతో ఒప్పందానికి అనుమతి ఇచ్చింది?
ఎ) యూఏఈ
బి) చైనా
సి) శ్రీలంక
డి) భూటాన్
- View Answer
- సమాధానం:ఎ
24.జైతాపూర్ న్యూక్లియర్ పార్క్ (మహారాష్ట్ర)లో ఆరు అణు రియాక్టర్ల ఏర్పాటుకు సంబంధించి భారత్ ఏ దేశంతో ఒప్పందం చేసుకుంది?
ఎ) అమెరికా
బి) దక్షిణ కొరియా
సి) ఫ్రాన్స్
డి) రష్యా
- View Answer
- సమాధానం: సి
25. ఇటీవల బంగ్లాదేశ్, ఇండియా ఏ అంశాలకు సంబంధించి ఒప్పందం చేసుకున్నాయి?
ఎ) విద్యుత్, ఇంటర్నెట్ బ్యాండ్ విడ్త ఎగుమతి
బి) వస్త్రాలు, చమురు ఎగుమతి
సి) అవస్థాపనా సౌకర్యాలపై పెట్టుబడి
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: ఎ
26. ‘షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్’లో సభ్యదేశాల సంఖ్య ఎంత?
ఎ) 5
బి) 7
సి) 8
డి) 10
- View Answer
- సమాధానం: సి
27. 2016 అక్టోబర్ 15, 16 తేదీల్లో బ్రిక్స్ దేశాల 8వ సదస్సును ఏ నగరంలో నిర్వహించనున్నారు?
ఎ) గోవా
బి) న్యూఢిల్లీ
సి) హైదరాబాద్
డి) లక్నో
- View Answer
- సమాధానం: ఎ
28. ‘ప్రపంచ వాటర్ డే’ను ఎప్పుడు పాటిస్తారు?
ఎ) మార్చి 15
బి) మార్చి 22
సి) మార్చి 30
డి) మార్చి 31
- View Answer
- సమాధానం: బి
29. ఏటా మార్చి 21న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే ‘ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫారెస్ట్స్’కు సంబంధించి 2016 థీమ్ ఏది?
ఎ) అడవులు, నీరు
బి) అడవులు, పర్యావరణం
సి) అడవులు, కాలుష్యం
డి) అడవులు, వాతావరణ మార్పులు
- View Answer
- సమాధానం: ఎ
30. కేంద్ర ప్రభుత్వం ప్లాస్టిక్ ప్రాసెసింగ్ యంత్రాల దిగుమతిపై యాంటీ డంపింగ్ డ్యూటీని ఎంత శాతం వరకు విధించింది?
ఎ) 41
బి) 42.7
సి) 44.7
డి) 48.8
- View Answer
- సమాధానం: సి
31.‘న్యూ కాంటాక్ట్‌లెస్ మొబైల్ పేమెంట్ సొల్యూషన్ టచ్ అండ్ పే’ను ప్రారంభించిన మొదటి ప్రైవేట్ బ్యాంక్ ఏది?
ఎ) హెచ్డీఎఫ్సీ బ్యాంక్
బి) ఐసీఐసీఐ బ్యాంక్
సి) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: బి
32.2016 మార్చి 8న మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘ఉమెన్ ట్రాన్స్ ఫార్మింగ్ ఇండియా’ కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారు?
ఎ) ప్రణాళికా సంఘం
బి) నీతి ఆయోగ్
సి) ఆర్థిక మంత్రిత్వ శాఖ
డి) మహిళా, శిశు సంక్షేమ శాఖ
- View Answer
- సమాధానం: బి
33. దక్షిణాసియా ప్రాంతీయ శిక్షణ, సాంకేతిక సహాయ కేంద్రాన్ని న్యూఢిల్లీలో ఏర్పాటు చేయడానికి భారత్ ఏ సంస్థతో ఒప్పందం చేసుకుంది?
ఎ) ఐ.ఎం.ఎఫ్.
బి) ప్రపంచ బ్యాంక్
సి) ఆసియా ఆభివృద్ధి బ్యాంక్
డి) పైవేవీ కావు
- View Answer
- సమాధానం: ఎ
34.బంగ్లాదేశ్ అభివృద్ధికి తోడ్పాటు అందించడానికి భారత్ ఏ బ్యాంక్ ద్వారా 2 బిలియన్ డాలర్ల సహాయాన్ని అందిస్తోంది?
ఎ) ఐడీబీఐ
బి) ఎస్బీఐ
సి) ఎగ్జిమ్ బ్యాంక్
డి) సిడ్బీ
- View Answer
- సమాధానం: సి
35. ఐసీఐసీఐ బ్యాంక్.. మహిళా ఉద్యోగులకు సంబంధించి iWork@Home కార్యక్రమాన్ని ఎవరి భాగస్వామ్యంతో రూపొందించింది?
ఎ) ఐఐటీ, ఢిల్లీ విద్యార్థులు
బి) ఐఐటీ, హైదరాబాద్ విద్యార్థులు
సి) ఐఐటీ, ఖరగ్‌పూర్ విద్యార్థులు
డి) ఐఐఎస్సీ, బెంగళూరు విద్యార్థులు
- View Answer
- సమాధానం: ఎ
36. భారత్‌లో కింద పేర్కొన్న ఏ నగరాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేసే కార్యక్రమంలో జర్మనీ భాగస్వామిగా ఉంటుంది?
ఎ) కరీంనగర్, నిజామాబాద్
బి) హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు
సి) కొచ్చిన్, భువనేశ్వర్, కోయంబత్తూర్
డి) చెన్నై, విజయవాడ, కోయంబత్తూర్
- View Answer
- సమాధానం: సి
37. గోదావరి, పెన్ గంగా నదులపై 5 బ్యారేజీల నిర్మాణంలో భాగంగా అంతర్రాష్ట్ర వాటర్ బోర్డ్ ఏర్పాటుకు సంబంధించి ఏ రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరింది?
ఎ) తెలంగాణ, మహారాష్ట్ర
బి) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్
సి) కర్ణాటక, ఆంధ్రప్రదేశ్
డి) ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర
- View Answer
- సమాధానం: ఎ
38.మహిళా ఉత్పత్తిదారులు కొనుగోలుదారులకు ఆన్లైన్ ద్వారా ఉత్పత్తులను విక్రయించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకం పేరేమిటి?
ఎ) డ్వాక్రా
బి) మహిళా ఇ-హాట్
సి) మహిళా సమృద్ధి యోజన
డి) పైవేవీ కావు
- View Answer
- సమాధానం: బి
39. కేంద్ర బ్యాంక్ నుంచి స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంక్ లెసైన్స్ ను పొందిన తొలి బ్యాంక్?
ఎ) క్యాపిటల్ లోకల్ ఏరియా బ్యాంక్ లిమిటెడ్, జలంధర్
బి) బ్యాంక్ ఆఫ్ పంజాబ్
సి) బంధన్ బ్యాంక్
డి) కొటక్ మహీంద్రా బ్యాంక్
- View Answer
- సమాధానం: ఎ
40. కింది వాటిలో ఏ బ్యాంక్ మయన్మార్‌లో కార్యకలాపాలను కొనసాగించడానికి ఆ దేశ అనుమతి పొందింది?
ఎ) ఆంధ్రా బ్యాంక్
బి) కెనరా బ్యాంక్
సి) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
డి) హెచ్డీఎఫ్సీ బ్యాంక్
- View Answer
- సమాధానం: సి
41. రైల్వే క్రాసింగ్‌ల నుంచి జాతీయ రహదారులను వేరు చేయడానికి ప్రధానమంత్రి ఇటీవల ప్రారంభించిన పథకం పేరేమిటి?
ఎ) సేతుభారతం ప్రాజెక్టు
బి) ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన
సి) ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన
డి) పైవేవీ కావు
- View Answer
- సమాధానం: ఎ
42. కేంద్ర ప్రభుత్వం ఇటీవల కింది వాటిలో దేన్ని మూసేయాలని నిర్ణయించింది?
ఎ) జాతీయ సైన్స్ మ్యూజియం కౌన్సిల్
బి) జాతీయ తయారీ కాంపిటీటివ్నెస్ కౌన్సిల్
సి) ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్
డి) బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా
- View Answer
- సమాధానం: బి
43. ‘గ్లోబల్ ఎనర్జీ ఆర్కిటెక్చర్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్’లో భారత్ స్థానం ఎంత?
ఎ) 72
బి) 81
సి) 90
డి) 95
- View Answer
- సమాధానం: సి
44. Uridashi masala Bonds (జపనీస్ బాండ్స్)ను విడుదల చేసిన సంస్థ ఏది?
ఎ) ఐ.ఎం.ఎఫ్.
బి) ది ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్
సి) ఐడీబీఐ
డి) బ్రిక్స్ బ్యాంక్
- View Answer
- సమాధానం: బి
45. కింది వాటిలో ప్రైవేట్ రంగ బ్యాంక్ ఏది?
ఎ) కేథలిక్ సిరియన్ బ్యాంక్
బి) ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్
సి) దేనా బ్యాంక్
డి) విజయా బ్యాంక్
- View Answer
- సమాధానం: ఎ
46. 2016 ఏప్రిల్‌లో ఎనిమిది కీలక పరిశ్రమల పారిశ్రామిక ఉత్పత్తి సూచీ ఎంతగా నమోదైంది?
ఎ) 156.4
బి) 167.8
సి) 176.4
డి) 182.5
- View Answer
- సమాధానం: సి