అంతస్స్రావక వ్యవస్థ
1. కింది వాటిలో ఏ హార్మోన్ లోపంతో డయాబెటీస్ మెల్లిటస్ వస్తుంది?
1) థైరాక్సిన్
2) గ్లూకగాన్
3) పిట్యూటరీ గ్రంథి
4) ఇన్సులిన్
- View Answer
- సమాధానం: 4
2.మానవ శరీరంలో ‘ఆడమ్స్ ఆపిల్’ అని ఏ గ్రంథిని పిలుస్తారు?
1) అడ్రినల్ గ్రంథి
2) థైరాయిడ్ / బాలగ్రంథి
3) లివర్ / కాలేయం
4) థైమస్ - బాలగ్రంథి
- View Answer
- సమాధానం: 2
3.చిరు కప్ప రూపాంతరం చెంది ప్రౌడ కప్పగా మారడానికి కావాల్సిన హార్మోన్?
1) ఎఫ్ఎస్హెచ్
2) ఎల్హెచ్
3) థైరాక్సిన్
4) అడ్రినల్ గ్రంథి
- View Answer
- సమాధానం: 3
4.క్లోమం ఒక?
1) బహిస్స్రావ గ్రంథి
2) అంతస్స్రావ గ్రంథి
3) అంతస్స్రావ - బహిస్స్రావ గ్రంథి
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 3
5. పీయూష గ్రంథి ఎక్కడ ఉంటుంది?
1) కంఠం
2) కాలేయం
3) మూత్ర పిండంపైన
4) కపాలం మధ్యన
- View Answer
- సమాధానం: 4
6. పాల పొదుగు నుంచి చూషణ ద్వారా పాలను స్రవించడానికి తోడ్పడే హార్మోన్?
1) ప్రొలాక్టిన్
2) ఆక్సిటోసిన్
3) అడ్రినలిన్
4) థైమోసిన్
- View Answer
- సమాధానం: 2
7. కింది వాటిలో వేటి నుంచి అయోడిన్ అధికంగా లభిస్తుంది?
1) సముద్ర చేపలు
2) సముద్ర ఉప్పు
3) సీ వీడ్స
4) కూరగాయలు
- View Answer
- సమాధానం: 3
8. అయోడిన్ లోపంతో వచ్చే వ్యాధి?
1) మహాకాయం
2) జడవామనుడు
3) విస్తరించిన అవటు గ్రంథి
4) చిన్న అవటు గ్రంథి
- View Answer
- సమాధానం: 3
9. ఎండోక్రైన్ గ్రంథులపై ప్రభావం చూపే గ్రంథి?
1) ఎడ్రినల్ గ్రంథి
2) పారాథైరాయిడ్ గ్రంథి
3) పీయూష గ్రంథి
4) థైరాయిడ్ గ్రంథి
- View Answer
- సమాధానం: 3
10. ఇన్సులిన్ ఒక?
1) కొవ్వు పదార్థం
2) హార్మోన్
3) రంగు పదార్థం
4) ఎక్సో ఎంజైమ్
- View Answer
- సమాధానం: 2
11. పీయూష గ్రంథి ఆధీనంలో లేని గ్రంథి?
1) పారాథైరాయిడ్ గ్రంథి
2) థైరాయిడ్
3) క్లోమం
4) అడ్రినల్ గ్రంథి
- View Answer
- సమాధానం: 1