ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన ఎగువసభ ఏ దేశానికి ఉంది?
1. రాజ్యాంగంలో కొన్ని వర్గాలకు ప్రత్యేక మినహాయింపులు, హక్కులు ఉన్నాయి. కింది వారిలో ఆ వర్గంలోకి రానివారు?
1) బాలబాలికలు
2) మైనారిటీలు
3) వికలాంగులు
4) మహిళలు
- View Answer
- సమాధానం: 3
2. ఏ ప్రకరణ ప్రకారం అత్యవసర పరిస్థితి విధించినప్పుడు ప్రాథమిక హక్కులు ప్రభావితమవుతాయి?
1) ప్రకరణ-356
2) ప్రకరణ-360
3) ప్రకరణ-352
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 3
3. సామాజిక, ఆర్థిక న్యాయానికి దోహదపడే అంశాలు రాజ్యాంగంలోని ఏ భాగంలో ఉన్నాయి?
1) మూడు
2) నాలుగు
3) అయిదు
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 2
4. ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన ఎగువసభ ఏ దేశానికి ఉంది?
1) కెనడా (సెనెట్)
2) అమెరికా (సెనెట్)
3) భారత్ (రాజ్యసభ)
4) ఇంగ్లండ్ (ప్రభువుల సభ)
- View Answer
- సమాధానం: 2
5.కింది వాటిలో గవర్నర్‌కు రాజ్యాంగపరంగా ఉన్న విచక్షణాధికారం ఏది?
1) రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేయడం
2) బిల్లులను రాష్ట్రపతికి నివేదించడం
3) ముఖ్యమంత్రి నుంచి సమాచారాన్ని కోరడం
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 2
6. గవర్నర్ పదవిని ‘బంగారు పంజరంలోని పక్షి’గా వర్ణించింది ఎవరు?
1) సరోజినీ నాయుడు
2) విజయలక్ష్మీ పండిట్
3) పట్టాభి సీతారామయ్య
4) కె.ఎం. మున్షీ
- View Answer
- సమాధానం: 1
7. భారతదేశంలో ఓటర్ల ప్రాతిపదికన అతిపెద్ద లోక్‌సభ నియోజకవర్గం ఏది?
1) మల్కాజ్గిరి
2) లడఖ్
3) సెంట్రల్ ఢిల్లీ
4) సెంట్రల్ బాంబే
- View Answer
- సమాధానం: 1
8.1973లో పి.వి.నరసింహారావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి కారణం ఏది?
1) జై ఆంధ్ర ఉద్యమం
2) జై తెలంగాణ ఉద్యమం
3) ప్రభుత్వ ఉద్యోగుల సమ్మె
4) పైవేవీ కాదు
- View Answer
- సమాధానం: 1
9. కింది వాటిలో సరికాని జత ఏది?
1) ప్రజాపార్టీ - ప్రకాశం పంతులు
2) కృషిక్ లోక్ పార్టీ - ఎన్.జి. రంగా
3) భారతీయ జనసంఘ్ - శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ
4) తెలంగాణ ప్రజా సమితి- కొండా లక్ష్మణ్ బాపూజీ
- View Answer
- సమాధానం: 4
10.కింది వాటిలో సరైన జత ఏది?
1) శ్రీబాగ్ ఒడంబడిక - 1937
2) పెద్దమనుషుల ఒప్పందం - 1956
3) ఆరు సూత్రాల పథకం - 1973
4) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 4
11.ఎన్నో లోక్‌సభలో స్వతంత్ర అభ్యర్థులు అధికంగా ఉన్నారు?
1) 2
2) 3
3) 4
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 1
12.ఎన్నో లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక ఓటింగ్ శాతం నమోదైంది?
1) 10
2) 12
3) 14
4) 15
- View Answer
- సమాధానం: 4
13. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్‌ను ‘ఆధునిక మనువు’, ‘రాజ్యాంగపిత’గా వర్ణించింది ఎవరు?
1) ఎం.వి. పైలీ
2) సుభాష్ కశ్యప్
3) డి.టి. బసు
4) కె.ఎం. మున్షీ
- View Answer
- సమాధానం: 1
14.కింది వాటిలో ఏ దేశ రాజ్యాంగ రచనకు అధిక సమయం తీసుకున్నారు?
1) భారత్
2) ఆస్ట్రేలియా
3) దక్షిణాఫ్రికా
4) కెనడా
- View Answer
- సమాధానం: 2
15. రాజ్యాంగ రచన కోసం రాజ్యాంగ పరిషత్‌లో ఉపయోగించిన పద్ధతి ఏది?
1) సహకార పద్ధతి
2) సర్దుబాటు పద్ధతి
3) సర్వసమ్మతి పద్ధతి
4) 1, 2
- View Answer
- సమాధానం: 2
16. ప్రవేశిక దేని గురించి తెలుపుతుంది?
1) ప్రభుత్వ స్వరూపం
2) రాజకీయ వ్యవస్థ లక్ష్యాలు
3) అధికారిక మూలం
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
17. వెనుకబడిన తరగతుల నిర్వచనానికి సంబంధించి కేవలం కులం ఆధారంగా కాకుండా.. సమాజం, విద్యా విషయక పరిస్థితులను కూడా గమనించాలని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పు చెప్పింది?
1) ఎం.ఆర్. బాలాజీ గట మైసూర్
2) ఇందిరా సహాని గట కేంద్ర ప్రభుత్వం
3) రామేశ్వర్ ఠాకూర్ గట కేంద్ర ప్రభుత్వం
4) మోహినీ జైన్ గట కర్ణాటక ప్రభుత్వం
- View Answer
- సమాధానం: 2
18. కింది వాటిలో ప్రాథమిక విధులకు వ్యతిరేకమైన వాదన ఏది?
1) ఆత్మ విరోధానికి, చట్ట నిర్దేశానికి మధ్య వైరుధ్యం
2) నియంతృత్వ రాజ్యాల్లో విధులు
3) అధిక విధులు ఆచరణ యోగ్యం కావు
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
19.కింద పేర్కొన్న ఏ సంవత్సరాల మధ్య అవిశ్వాస తీర్మానాలను అధికంగా ప్రవేశపెట్టారు?
1) 1966-77
2) 1977-80
3) 1991-96
4) 2000-04
- View Answer
- సమాధానం: 3
20. కేంద్ర మంత్రిమండలి సంయుక్తంగా ఎవరికి బాధ్యత వహిస్తుంది?
1) ప్రధాన మంత్రి
2) రాష్ట్రపతి
3) లోక్‌సభ
4) పార్లమెంట్
- View Answer
- సమాధానం:3
21. కింద పేర్కొన్న ఏ సందర్భంలో ప్రధాన మంత్రి రాజీనామా చేయాల్సి ఉంటుంది?
1) బడ్జెట్‌ను లోక్‌సభ తిరస్కరించినప్పుడు
2) బడ్జెట్‌పై కోత తీర్మానం నెగ్గినప్పుడు
3) రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం వీగిపోయినప్పుడు
4) పై అన్ని సందర్భాల్లో
- View Answer
- సమాధానం: 4
22. కింది వాటిలో న్యాయ సమీక్షకు వ్యతిరేకమైన వాదన కానిది ఏది?
1) న్యాయశాఖ మూడో సభగా వ్యవహరించడం
2) పార్లమెంట్ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించడం
3) అభివృద్ధికి అవరోధం
4) సమాఖ్య వ్యవస్థకు వ్యతిరేకం
- View Answer
- సమాధానం: 4
23. కింది వాటిలో ఆదేశిక సూత్రాలకు ప్రాముఖ్యం కల్పిస్తూ చేసిన రాజ్యాంగ సవరణ ఏది?
1) 17వ సవరణ
2) 25వ సవరణ
3) 42వ సవరణ
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
24. కాంగ్రెస్(ఐ) పార్టీలో అత్యంత ముఖ్యమైన కార్యనిర్వాహక అంగం ఏది?
1) అఖిల భారత కాంగ్రెస్ సంఘం (ఏఐసీసీ)
2) కార్యాచరణ సంఘం (సీడబ్ల్యూసీ)
3) పార్లమెంటరీ సంఘం
4) ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ
- View Answer
- సమాధానం: 2
25.అత్యంత ప్రాచీన ప్రాంతీయ పార్టీ ఏది?
1) డీఎంకే
2) తెలుగుదేశం
3) శిరోమణి అకాలీదళ్
4) అసోం గణసంగ్రామ పరిషత్
- View Answer
- సమాధానం: 3
26. ఏ లోక్‌సభ ఎన్నికల్లో ద్విసభ్య నియోజక వర్గాన్ని రద్దు చేశారు?
1) రెండో లోక్‌సభ - 1957
2) మూడో లోక్‌సభ - 1957
3) మూడో లోక్‌సభ - 1962
4) నాలుగో లోక్‌సభ - 1967
- View Answer
- సమాధానం:3
27. ప్రకరణలు, అవి వివరించే అంశాలకు సంబంధించి కింది వాటిలో సరికాని జత ఏది?
1) ప్రకరణ 370: జమ్ము-కశ్మీర్
2) ప్రకరణ 351: హిందీ భాష
3) ప్రకరణ 361: రాష్ట్రపతి, గవర్నర్‌కు మినహాయింపులు
4) ప్రకరణ 262: పన్నుల విభజన
- View Answer
- సమాధానం: 4
28. కశ్మీర్‌కు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
1) విలీన ఒప్పందం - 26 అక్టోబర్ 1948
2) జమ్ము-కశ్మీర్ రాజ్యాంగ పరిషత్ తొలి సమావేశం - 31 అక్టోబర్ 1951
3) రాజ్యాంగ ఆమోదం - 26 జనవరి 1957
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
29. కింది వాటిలో అతి తీవ్రంగా పరిగణించిన ప్రాంతీయ వాదం ఏది?
1) ద్రవిడనాడు
2) ఖలిస్థాన్
3) మిజో-నాగా ఉద్యమం
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
30. కేంద్రంలో ఇప్పటివరకు ఎన్ని సంకీర్ణ ప్రభుత్వాలు పూర్తికాలం అధికారంలో ఉన్నాయి?
1) రెండు (ఎన్డీఏ, యూపీఏ)
2) ఒకటి (ఎన్డీఏ)
3) మూడు (నేషనల్ ఫ్రంట్, యునెటైడ్ ఫ్రంట్, యూపీఏ)
4) పైవేవీ కావు
- View Answer
- సమాధానం: 1
31. కింది వాటిలో మహిళా ఉద్యమానికి సంబంధించని సంస్థ ఏది?
1) AIDWA
2) AIWC
3) NFI
4) OPDR
- View Answer
- సమాధానం: 4
32. ‘దళిత్’ అనే పదం ఏ భాషకు సంబంధించింది? దాని అర్థమేమిటి?
1) సంస్కృతం, విచ్ఛిన్నత
2) తెలుగు, నిమ్న వర్గాలు
3) హిందీ, వేరుపడవు
4) తమిళం, రెండు
- View Answer
- సమాధానం: 1
33. మైనారిటీ హోదాను ఏ ప్రాతిపదికన నిర్ణయిస్తారు?
1) రాష్ట్రం
2) దేశం
3) జిల్లా
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 1
34. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు సంబంధించి కింది వాటిలో సరైన వాక్యం ఏది?
1) తొలిసారిగా వీటిని 1998లో రాజస్థాన్, మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాల్లో ఉపయోగించారు
2) 1999లో గోవా శాసనసభ ఎన్నికల్లో వీటిని పూర్తిగా వినియోగించారు
3) 2004 లోక్‌సభ ఎన్నికల్లో వీటిని దేశవ్యాప్తంగా ఉపయోగించారు
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
35. కింది వాటిలో ఎన్నికల సంస్కరణలకు సంబంధించిన కమిటీ ఏది?
1) తార్కుండే కమిటీ
2) దినేష్ గోస్వామి కమిటీ
3) 1, 2
4) పైవేవీ కాదు
- View Answer
- సమాధానం: 3
36. పార్టీలు - గుర్తులకు సంబంధించి కింది వాటిలో సరికాని జత ఏది?
1) నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ - గడియారం
2) కమ్యూనిస్ట్ పార్టీ - కంకి, కొడవలి
3) కమ్యూనిస్ట్ పార్టీ (మార్కిస్ట్) - సుత్తి, కొడవలి
4) బహుజన సమాజ్‌వాది పార్టీ - నాగలి
- View Answer
- సమాధానం: 4
37. న్యాయశాఖ క్రియాశీలత పరాకాష్ట (అత్యున్నత స్థితి)కు చేరుకున్న సందర్భంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు?
1) జస్టిస్ జె.ఎస్.వర్మ
2) జస్టిస్ కోకా సుబ్బారావ్
3) జస్టిస్ అహమ్మది
4) జస్టిస్ భగవతి
- View Answer
- సమాధానం: 4
38. పరిపాలనలో న్యాయశాఖ జోక్యానికి ప్రాతిపదిక ఏది?
1) అధికార పృథక్కరణ
2) చట్టపాలన
3) న్యాయ సమీక్ష
4) అధికార దత్తత
- View Answer
- సమాధానం:2
39. రాష్ట్ర సచివాలయంలో అత్యంత ముఖ్యమైన విభాగం/ శాఖ ఏది?
1) హోం శాఖ
2) ఆర్థిక శాఖ
3) సాధారణ పరిపాలన శాఖ
4) రెవెన్యూ శాఖ
- View Answer
- సమాధానం: 3
40. రాజ్యాంగంలో పేర్కొన్న ప్రకరణలు 310 నుంచి 323 ఏ అంశానికి సంబంధించినవి?
1) కేంద్ర, రాష్ట్ర సర్వీసులు
2) ఎన్నికలు
3) స్థానిక సంస్థలు
4) ట్రైబ్యునళ్లు
- View Answer
- సమాధానం: 1
41. భారతదేశంలో బ్రిటిష్ పరిపాలనకు నాంది ప్రస్తావన చేసిన చట్టం ఏది?
1) రెగ్యులేటింగ్ చట్టం - 1773
2) పిట్ ఇండియా చట్టం - 1784
3) ఇండియన్ కౌన్సిల్ చట్టం - 1861
4) ఇండియన్ కౌన్సిల్ చట్టం - 1892
- View Answer
- సమాధానం: 1
42. కింద పేర్కొన్న రాజ్యాంగ సంస్థల్లో సలహా పూర్వక విధులను కలిగి ఉన్నది ఏది?
1) పబ్లిక్ సర్వీస్ కమిషన్
2) ఆర్థిక సంఘం
3) అంతర్రాష్ట్ర మండలి
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
43. కింది వాటిలో సరికాని జత ఏది?
1) అధికార విభజన - సమాఖ్య వ్యవస్థ
2) అధికార బదలాయింపు- స్థానిక సంస్థలు
3) అధికార పృథక్కరణ - అధ్యక్ష తరహా వ్యవస్థ
4) అధికార మిళితం - ఏకకేంద్ర వ్యవస్థ
- View Answer
- సమాధానం:4
44.అఖిల భారత సర్వీసులకు చెందిన ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం కింది వాటిలో ఏ రకమైన చర్య తీసుకోవచ్చు?
1) సస్పెండ్ చేయడం
2) డిస్మిస్ చేయడం
3) రిమూవ్ చేయడం
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 1
45. కింది వాటిలో భారత రాజ్యాంగానికి సరికొత్త సవాల్‌గా ఏ అంశాన్ని పేర్కొనవచ్చు?
1) కేంద్రీకృత సమాఖ్య
2) క్షీణిస్తున్న చట్టసభల ప్రమాణాలు
3) న్యాయశాఖ అతి క్రియాశీలత
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
46. రాజకీయాల్లో ఆధ్యాత్మీకరించిన సిద్ధాంతం ఏది?
1) కమ్యూనిజం
2) సోషలిజం
3) సర్వోదయ
4) ఫెబియనిజం
- View Answer
- సమాధానం: 3
47. స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి కనీస అర్హతలను నిర్ణయించిన రాష్ట్రం ఏది?
1) రాజస్థాన్
2) గుజరాత్
3) మహారాష్ట్ర
4) తెలంగాణ
- View Answer
- సమాధానం: 1
48. ఇటీవల వార్తల్లోకెక్కిన ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్-377 దేనికి సంబంధించింది?
1) అసహజ లైంగిక చర్య
2) దేశద్రోహ చర్య
3) పరస్పర విడాకులు
4) పైవేవీ కాదు
- View Answer
- సమాధానం: 1
49. పంచాయతీ వ్యవస్థలో ఏ రకమైన ప్రణాళికలను అమలు చేస్తారు?
1) సూచనాత్మక ప్రణాళిక
2) బహుళ అంతస్థు ప్రణాళిక
3) నిర్దేశిక ప్రణాళిక
4) నిర్వర్తన ప్రణాళిక
- View Answer
- సమాధానం:2