ప్రాథమిక విద్యను బోధించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ధ్రువీకరించిన కమిషన్?
Sakshi Education
- సామాజిక రంగంలో భారతదేశం అభిలషణీయ ప్రగతిని సాధించలేదని, సాధించాల్సింది ఇంకా చాలా ఉందని పేర్కొన్నవారు?
–జిన్ డ్రీజ్, అమర్త్యసేన్ - అమెరికా.. విద్యపై పెట్టిన పెట్టుబడుల వల్ల ఆ దేశ సగటు జాతీయాదాయం 4.2 శాతం మేర పెరిగిందని అంచనా వేసింది?
–సూల్జ్, గ్యారీబీకర్ - రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలను అనుసరించి ఏ వయసు పిల్లలకు తప్పనిసరిగా ప్రాథమిక విద్యను అందించాల్సిన బాధ్యత భారత ప్రభుత్వంపై ఉంది?
–6–14 సంవత్సరాలు - ప్రాథమిక విద్యను బోధించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ధ్రువీకరించిన కమిషన్?
–కొఠారి కమిషన్ - ప్రాథమిక పాఠశాలలు, ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల స్థూల నమోదు నిష్పత్తిలో ప్రగతి నమోదు చేసినవి?
–గోవా, తమిళనాడు, పుదుచ్చేరి. - 2002లో రూపొందించిన జాతీయ ఆరోగ్య విధానం లక్ష్యాలు?
–ఆరోగ్య రంగంలో ప్రభుత్వ రంగ పెట్టుబడులను పెంచడం, వికేంద్రీకృత ప్రజా ఆరోగ్య పద్ధతులకు అవకాశం కల్పించడం. - జాతీయ నీటి సరఫరా, పారిశుధ్యం పథకాన్ని ప్రారంభించిన సంవత్సరం?
–1954 - వేగవంతమైన గ్రామీణ నీటి సరఫరా పథకాన్ని ప్రారంభించిన సంవత్సరం?
–1972–73 - రాజ్యాంగంలోని ఏ అధికరణ.. మహిళలు, పురుషులకు సామాజిక, ఆర్థిక రంగాల్లో సమాన అవకాశాలను కల్పిస్తోంది?
–14వ అధికరణ - 2013లో శిశు మరణాల రేటు (ప్రతి వేయి జననాలకు) అధికంగా నమోదైన రాష్ట్రాలు?
–మధ్యప్రదేశ్, అసోం - 2013లో తమిళనాడులో శిశు మరణాల రేటు ప్రతి వేయి జననాలకు?
–21 - 2011 లెక్కల ప్రకారం బిహార్ జనాభాలో పట్టణ జనాభా శాతం?
–11.3 - ఇటీవల కాలంలో గ్రామీణ ప్రాంతాల్లోని మొత్తం వ్యయంలో భాగంగా ఆహారంపై అధిక వ్యయం చేసిన రాష్ట్రం?
–అసోం - 2011–12లో బిహార్ గ్రామీణ ప్రాంతాల్లో తలసరి వినియోగ వ్యయం నెలకు (రూపాయల్లో)?
–రూ.1127 - 2011–12లో పట్టణ ప్రాంతాల మొత్తం వ్యయంలో భాగంగా ఆహారంపై తక్కువ వ్యయం చేసిన రాష్ట్రం?
–కేరళ - 2011 జనాభా లెక్కల ప్రకారం పట్టణ ప్రాంతాల్లో పెరిగిన జనాభా?
–91 మిలియన్లు - 2011 జనాభా లెక్కల ప్రకారం పట్టణ జనాభా వృద్ధి?
–31.8 శాతం - అధిక పట్టణ జనాభా కలిగిన రాష్ట్రం (శాతం పరంగా)?
–గోవా - ఢిల్లీ తర్వాత అధిక పట్టణీకరణ కలిగిన కేంద్ర పాలిత ప్రాంతం?
–చంఢీగఢ్ - ప్రాంతీయ అసమానతలను సూచించే అంశాలను పేర్కొన్నవారు?
–రాజ్‌కృష్ణ - కేంద్ర ప్రణాళికా విధానం కంటే జిల్లా, బ్లాక్, రాష్ట్ర స్థాయిలో గ్రామీణ పథకాలను రూపొందించాలని సూచించినవారు?
–కె.ఎన్. రాజ్ - జిల్లాలు, రాష్ట్రాల స్థాయిలో ప్రణాళికా నిర్ణయాలు జరిగితే సంతులిత ప్రాంతీయాభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపినవారు?
–ఎన్.చక్రవర్తి - జిల్లాను యూనిట్‌గా, తిరిగి జిల్లాను కూడా చిన్న ఖండాలుగా విభజించి ప్రణాళికలు రూపొందించాలని సూచించినవారు?
–డి.ఆర్.గాడ్గిల్ - కేరళ తర్వాత 2001–2011 మధ్య కాలంలో అధిక పట్టణ జనాభా వృద్ధిని నమోదు చేసిన రాష్ట్రం?
–సిక్కిం - జిల్లా స్థాయిలో బ్లాక్ ప్రణాళికలు రూపొందించాలని పేర్కొన్నవారు?
– వీకేఆర్‌వీ రావ్, అలఘ్ - గ్రామస్థాయి నుంచి ప్రాంతీయ ప్రణాళికలు రూపొందించినప్పుడు ప్రాంతీయ అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పిన వ్యక్తి?
–ఎల్.ఎస్.భట్ - 11వ ప్రణాళికలో ఆర్థికంగా ముందంజలో ఉన్న రాష్ట్రాల్లో గరిష్ట వృద్ధిరేటు నమోదు చేసిన రాష్ట్రం?
–గుజరాత్ - పదకొండో ప్రణాళికలో బిహార్ సాధించిన సగటు వృద్ధిరేటు?
–12 శాతం - 1990–91లో తలసరి ఆదాయంలో మొదటి స్థానం పొందిన రాష్ట్రం? –పంజాబ్‌సంస్కరణల తర్వాత కాలం నుంచి దేశంలోని మొత్తం పెట్టుబడుల్లో 69.2 శాతం అభివృద్ధి చెందిన రాష్ట్రాలకు తరలిపోయిందని పేర్కొన్నవారు?
–ఎం.జె.కురియన్ - సంస్కరణల కాలంలో భారతదేశంలోని విత్త సంస్థల నుంచి అధికంగా ఆర్థిక సహాయం పొందిన రాష్ట్రాలు?
– మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ - మొత్తం పంట భూమిలో సాగునీటి వసతి అధికంగా ఉన్న రాష్ట్రం?
–పంజాబ్ - అవస్థాపనా అభివృద్ధి సూచీ దేన్ని తెలుపుతుంది?
– అవస్థాపనా సౌకర్యాల లభ్యత - అవస్థాపనా అభివృద్ధి సూచీలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం?
– పంజాబ్ - 1980 నుంచి భారత్‌లో ప్రైవేటు పెట్టుబడులు పెరిగాయని పేర్కొన్నవారు?
–ఎంజే కురియన్ - నేషనల్ శాంపుల్ సర్వే 68వ రౌండ్ ప్రకారం బిహార్‌లో నమోదైన పేదరికం?
–33.7 శాతం - 2013లో భారత్‌లో శిశు మరణాలు (ప్రతి వేయి జననాలకు)?
– 40 - ఏ పంటకు సంబంధించిన వంగడాల కార్యక్రమం (అధిక దిగుబడినిచ్చే) కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమైందని విమర్శ ఉంది?
–గోధుమ - 2013–14లో మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో పంజాబ్, హరియాణాల వాటా?
– 7.5 శాతం - 2013–14లో మొత్తం ఆహార ధాన్యాల ఉత్పాదకత ఏ రాష్ట్రంలో ఎక్కువ?
– పంజాబ్ - 2013–14లో ఎరువుల వినియోగ సగటుతో పోల్చినప్పుడు ఏ రాష్ట్రాల్లో ఎరువుల వినియోగం ఎక్కువ?
– పంజాబ్, హరియాణా - 2013లో శిశు మరణాల రేటుకు సంబంధించి తక్కువ శిశు మరణాలు నమోదైన రాష్ట్రం?
– కేరళ - భారతదేశంలో ఏ రాష్ట్రాల్లో ఆయుః ప్రమాణం తక్కువగా నమోదవుతోంది?
–మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా - 2011–12లో గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి తలసరి సగటు వినియోగ వ్యయం ఏ రాష్ట్రంలో ఎక్కువ?
– కేరళ - 2011–12లో పట్టణ ప్రాంతాలకు సంబంధించి తలసరి సగటు వినియోగ వ్యయం (నెలకు) ఏ రాష్ట్రంలో ఎక్కువ?
–హరియాణా - వలసలు, జనాభా సహజ పెరుగుదల భారతదేశంలో దేనికి కారణం అవుతున్నాయి?
–పట్టణీకరణ2001–11 మధ్యకాలంలో అధిక జనాభా వృద్ధి నమోదు చేసిన నగరం? – ఢిల్లీ - 2011 లెక్కల ప్రకారం భారతదేశంలో పట్టణ జనాభా?
– 37.7 కోట్లు - మురికివాడలు అత్యధికంగా ఉన్న రాష్ట్రం?
– తమిళనాడు - మురికివాడల జనాభా అత్యధికంగా ఉన్న రాష్ట్రం?
–మహారాష్ట్ర - 2001తో పోల్చినప్పుడు 2011లో హిందూ జనాభా శాతం?
– తగ్గింది - ముస్లిం జనాభా (శాతం పరంగా) ఏ కేంద్రపాలిత ప్రాంతంలో ఎక్కువగా ఉంది?
–లక్ష దీవులు - దేశంలోని ఎంత శాతం ప్రజలు ఏ మతానికీ చెందని వారుగా ఉన్నారు?
–0.2 శాతం - Slum Free Indiaఅనేది ఏ పథక నినాదం?
–రాజీవ్ ఆవాస్ యోజన - పంజాబ్ తర్వాత తలసరి విద్యుత్ వినియోగం ఏ రాష్ట్రంలో ఎక్కువ?
– తమిళనాడు - తలసరి బ్యాంకు డిపాజిట్లు ఏ రాష్ట్రంలో ఎక్కువగా నమోదవుతున్నాయి?
–ఢిల్లీ - అవస్థాపనా సౌకర్యాల అభివృద్ధి ద్వారా ప్రాంతీయ అసమానతలు తగ్గించొచ్చని పేర్కొన్న ప్రణాళిక?
–12వ ప్రణాళిక - రఘురామ్ రాజన్ మల్టీ డైమన్షనల్ ఇండెక్స్ ప్రకారం అభివృద్ధిలో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు?
–గోవా, కేరళ - ఎక్కువ మంది జనాభా, వస్తు ఉత్పత్తి రంగం కేంద్రీకృతమైన ప్రదేశాలను అభివృద్ధి చెందిన ప్రాంతాలుగా వర్ణించింది?
– కోలిన్ క్లార్క్ - ప్రతి వేయి చదరపు కిలోమీటర్లకు రోడ్ల విస్తరణ అధికంగా ఉన్న రాష్ట్రం?
–కేరళ - ప్రతి వేయి చదరపు కిలోమీటర ్లకు రోడ్ల విస్తరణ తక్కువగా ఉన్న రాష్ట్రం?
–బిహార్
Published date : 21 Jan 2017 05:20PM