భారత ఆర్థిక వ్యవస్థ - సమస్యలు, సవాళ్లు
Sakshi Education
- సామాజిక రంగంలో భారతదేశం అభిలషణీయమైన ప్రగతిని సాధించలేదని, సాధించాల్సింది ఇంకా చాలా ఉందని పేర్కొన్నవారు?
జిన్ డ్రీజ్, అమర్త్యసేన్ - అమెరికా.. విద్యపై పెట్టిన పెట్టుబడుల వల్ల ఆ దేశ సగటు జాతీయాదాయం 4.2 శాతం మేర పెరిగిందని అంచనా వేసింది?
సూల్జ్, గ్యారీబీకర్ - రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలను అనుసరించి ఏ వయసు పిల్లలకు తప్పనిసరిగా ప్రాథమిక విద్యను అందించాల్సిన బాధ్యత భారత ప్రభుత్వంపై ఉంది?
6-14 సంవత్సరాలు. - ప్రాథమిక విద్యను బోధించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ధ్రువీకరించిన కమిషన్?
కొఠారి కమిషన్ - ప్రాథమిక పాఠశాలలు, ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల స్థూల నమోదు నిష్పత్తిలో ప్రగతి నమోదు చేసినవి?
గోవా, తమిళనాడు, పుదుచ్చేరి. - 2002లో రూపొందించిన జాతీయ ఆరోగ్య విధానం లక్ష్యాలు?
ఆరోగ్య రంగంలో ప్రభుత్వ రంగ పెట్టుబడులను పెంచటం, వికేంద్రీకృత ప్రజా ఆరోగ్య పద్ధతులకు అవకాశం కల్పించటం. - జాతీయ నీటి సరఫరా, పారిశుద్ధ్యం పథకాన్ని ప్రారంభించిన సంవత్సరం?
1954 - వేగవంతమైన గ్రామీణ నీటి సరఫరా పథకాన్ని ప్రారంభించిన సంవత్సరం?
1972-73 - రాజ్యాంగంలోని ఏ అధికరణ.. మహిళలు, పురుషులకు సామాజిక, ఆర్థిక రంగాల్లో సమాన అవకాశాలను కల్పిస్తోంది?
14వ అధికరణ - 2013లో శిశు మరణాల రేటు (ప్రతి వెయ్యి జననాలకు) అధికంగా నమోదైన రాష్ట్రాలు?
మధ్యప్రదేశ్, అసోం - 2013లో తమిళనాడులో శిశు మరణాల రేటు ప్రతి వెయ్యి జననాలకు?
21 - 2011 లెక్కల ప్రకారం బీహార్ జనాభాలో పట్టణ జనాభా శాతం?
11.3 శాతం - ఇటీవల కాలంలో గ్రామీణ ప్రాంతాల్లోని మొత్తం వ్యయంలో భాగంగా ఆహారంపై అధిక వ్యయం చేసిన రాష్ట్రం?
అసోం - 2011-12లో బీహార్ గ్రామీణ ప్రాంతాల్లో తలసరి వినియోగ వ్యయం నెలకు (రూపాయల్లో)?
రూ.1127 - 2011-12లో పట్టణ ప్రాంతాల మొత్తం వ్యయంలో భాగంగా ఆహారంపై తక్కువ వ్యయం చేసిన రాష్ట్రం?
కేరళ - 2011 జనాభా లెక్కల ప్రకారం పట్టణ ప్రాంతాల్లో అధికంగా పెరిగిన జనాభా?
91 మిలియన్లు - 2011 జనాభా లెక్కల ప్రకారం పట్టణ జనాభా వృద్ధి (శాతాల్లో)?
31.8 శాతం - అధిక పట్టణ జనాభా కలిగిన రాష్ర్టం (శాతాల పరంగా)?
గోవా - ఢిల్లీ తర్వాత అధిక పట్టణీకరణ కలిగిన కేంద్ర పాలిత ప్రాంతం?
చండీగఢ్ - ప్రాంతీయ అసమానతలను సూచించే అంశాలను పేర్కొంది?
రాజ్‌కృష్ణ - కేంద్ర ప్రణాళికా విధానం కంటే జిల్లా, బ్లాక్, రాష్ట్ర స్థాయిలో గ్రామీణ పథకాలను రూపొందించాలని సూచించింది?
కె.ఎన్. రాజ్ - జిల్లాలు, రాష్ట్రాల స్థాయిలో ప్రణాళికా నిర్ణయాలు జరిగితే సంతులిత ప్రాంతీయ అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపింది?
ఎన్.చక్రవర్తి - జిల్లాను యూనిట్‌గా, తిరిగి జిల్లాను కూడా చిన్న ఖండాలుగా విభజించి ప్రణాళికలు రూపొందించాలని సూచించింది?
డి.ఆర్.గాడ్గిల్ - కేరళ తర్వాత 2001-2011 మధ్యకాలంలో అధిక పట్టణ జనాభా వృద్ధిని నమోదు చేసిన రాష్ర్టం?
సిక్కిం - జిల్లా స్థాయిలో బ్లాక్ ప్రణాళికలు రూపొందించాలని పేర్కొంది?
వీకేఆర్‌వీ రావ్, అలఘ్ - గ్రామ స్థాయి నుంచి ప్రాంతీయ ప్రణాళికలు రూపొందించినప్పుడు ప్రాంతీయ అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పిన వ్యక్తి?
ఎల్.ఎస్ భట్ - 11వ ప్రణాళికలో ఆర్థికంగా ముందజంలో ఉన్న రాష్ట్రాల్లో గరిష్ట వృద్ధిరేటు నమోదు చేసిన రాష్ట్రం?
గుజరాత్ - పదకొండవ ప్రణాళికలో బీహార్ సాధించిన సగటు వృద్ధిరేటు?
12 శాతం - 1990-91లో తలసరి ఆదాయంలో మొదటి స్థానం పొందిన రాష్ట్రం?
పంజాబ్ - సంస్కరణల తర్వాత కాలం నుంచి దేశంలోని మొత్తం పెట్టుబడుల్లో 69.2 శాతం అభివృద్ధి చెందిన రాష్ట్రాలకు తరలిపోయిందని పేర్కొన్న వ్యక్తి?
ఎం.జె. కురియన్ - సంస్కరణల కాలంలో భారతదేశంలోని విత్తసంస్థల నుంచి అధికంగా ఆర్థిక సహాయం పొందిన రాష్ట్రాలు?
మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ - మొత్తం పంట భూమిలో సాగునీటి వసతి అధికంగా ఉన్న రాష్ట్రం?
పంజాబ్ - అవస్థాపనా అభివృద్ధి సూచీ దేన్ని తెలుపుతుంది?
అవస్థాపనా సౌకర్యాల లభ్యత - అవస్థాపనా అభివృద్ధి సూచీలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం?
పంజాబ్ - 1980 నుంచి భారత్‌లో ప్రైవేటు పెట్టుబడులు పెరిగాయని పేర్కొంది?
ఎంజే కురియన్ - నేషనల్ శాంపుల్ సర్వే 68వ రౌండు ప్రకారం బీహార్‌లో నమోదైన పేదరికం?
33.7 శాతం - 2013లో భారతలో శిశు మరణాలు (ప్రతి వెయ్యి జననాలకు)?
40 - ఏ పంటకు సంబంధించిన వంగడాల కార్యక్రమం (అధిక దిగుబడి ఇచ్చే) కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమైందని విమర్మ ఉంది?
గోధుమ - 2013-14లో మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో పంజాబ్, హరియాణాల వాటా?
7.5 శాతం - 2013-14లో మొత్తం ఆహార ధాన్యాల ఉత్పాదకత ఏ రాష్ట్రంలో ఎక్కువ?
పంజాబ్ - 2013-14లో ఎరువుల వినియోగ సగటుతో పోల్చినప్పుడు ఏ రాష్ట్రాల్లో ఎరువుల వినియోగం ఎక్కువ?
పంజాబ్, హరియాణ - 2013లో శిశు మరణాల రేటుకు సంబంధించి తక్కువ శిశు మరణాలు నమోదైన రాష్ట్రం?
కేరళ - భారతదేశంలో ఏ రాష్ట్రాల్లో ఆయుః ప్రమాణం తక్కువగా నమోదవుతోంది?
మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఒడిషా - 2011-12లో గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి తలసరి సగటు వినియోగ వ్యయం ఏ రాష్ట్రంలో ఎక్కువ?
కేరళ - 2011-12లో పట్టణ ప్రాంతాలకు సంబంధించి తలసరి సగటు వినియోగ వ్యయం (నెలకు) ఏ రాష్ట్రంలో ఎక్కువ?
హరియాణ - వలసలు, జనాభా సహజ పెరుగుదల భారతదేశంలో దేనికి కారణం అవుతున్నాయి?
పట్టణీకరణ - 2001-11 మధ్యకాలంలో అధిక జనాభా వృద్ధి నమోదు చేసిన నగరం?
ఢిల్లీ - 2011 లెక్కల ప్రకారం భారతదేశంలో పట్టణ జనాభా?
37.7 కోట్లు - మురికివాడలు అత్యధికంగా ఉన్న రాష్ట్రం?
తమిళనాడు - మురికివాడల జనాభా అత్యధికంగా ఉన్న రాష్ట్రం?
మహారాష్ట్ర - 2001తో పోల్చినప్పుడు 2011లో హిందూ జనాభా శాతం?
తగ్గింది - ముస్లిం జనాభా (శాతం పరంగా) ఏ కేంద్రపాలిత ప్రాంతంలో ఎక్కువగా ఉంది?
లక్ష దీవులు - దేశంలోని ఎంతశాతం ప్రజలు ఏ మతానికి చెందని వారుగా ఉన్నారు?
0.2 శాతం - Slum Free India అనేది ఏ పథక నినాదం?
రాజీవ్ ఆవాస్ యోజన - పంజాబ్ తర్వాత తలసరి విద్యుత్ వినియోగం ఏ రాష్ట్రంలో ఎక్కువ?
తమిళనాడు - తలసరి బ్యాంకు డిపాజిట్లు ఏ రాష్ట్రంలో ఎక్కువగా నమోదవుతున్నాయి?
ఢిల్లీ - అవస్థాపనా సౌకర్యాల అభివృద్ధి ద్వారా ప్రాంతీయ అసమానతలు తగ్గించొచ్చని పేర్కొన్న ప్రణాళిక?
12వ ప్రణాళిక - రఘరామ్ రాజన్ మల్టి డైమన్షనల్ ఇండెక్స్ ప్రకారం అభివృద్ధిలో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు?
గోవా, కేరళ - ఎక్కువ మంది జనాభా, వస్తు ఉత్పత్తి రంగం కేంద్రీకృతమైన ప్రదేశాలను అభివృద్ధి చెందిన ప్రాంతాలుగా వర్ణించింది?
కోలిన్ క్లార్క్ - ప్రతి వెయ్యి చదరపు కిలోమీటర్లుకు రోడ్ల విస్తరణ అధికంగా ఉన్న రాష్ర్టం?
కేరళ - ప్రతి వెయ్యి చదరపు కిలోమీటర్లుకు రోడ్ల విస్తరణ తక్కువగా ఉన్న రాష్ర్టం?
బీహార్
Published date : 05 Feb 2016 03:11PM