భారత ఆర్థిక ప్రణాళికలు
Sakshi Education
- ఆర్థిక వ్యవస్థ ప్లవన దశను సాధించగలిగిందనే ప్రాతిపదికన రూపొందించిన ప్రణాళిక?
మూడో ప్రణాళిక - కనీస అవసరాలు, Directed Antipoverty Programmesను ఏ ప్రణాళిక నవకల్పనగా పేర్కొనొచ్చు?
ఐదో ప్రణాళిక - మొదటిసారిగా 14 వాణిజ్య బ్యాంకుల జాతీయీకరణ ఏ ప్రణాళికలో జరిగింది?
నాలుగో ప్రణాళిక - నిరంతర ప్రణాళికను రూపొందించిన వారు
గున్నార్ మిర్డల్ - పూర్తికాలం ముగియకుండా మధ్యలోనే రద్దయిన ప్రణాళిక?
ఐదో ప్రణాళిక - 2007 నాటికి అక్షరాస్యత, వేతన రేట్లలో లింగ సంబంధ తేడాను ఎంత శాతానికి తగ్గించాలని పదో ప్రణాళిక లక్ష్యంగా నిర్దేశించుకుంది?
50 శాతం - అవస్థాపనా సౌకర్యాలు, వ్యవసాయ రంగానికి సమాన ప్రాధాన్యత ఏ ప్రణాళికలో లభించింది?
ఆరో ప్రణాళిక - పేదరిక నిర్మూలన, స్వయం సమృద్ధి సాధన లక్ష్యాలను ఏ ప్రణాళిక నిర్దేశించుకుంది?
ఐదో ప్రణాళిక - ఎనిమిదో ప్రణాళిక ప్రారంభ సమయంలో భారత్ ఎదుర్కొన్న సమస్యలు?
విదేశీ వ్యాపార చెల్లింపుల శేషంలో లోటు, అధిక రుణభారం, అధిక బడ్జెట్ లోటు, పారిశ్రామిక రంగంలో తిరోగమనం, ద్రవ్యోల్బణం. - Towards Faster and more Inclusive Growth ఏ ప్రణాళిక లక్ష్యం?
11వ ప్రణాళిక. - స్వయం సమృద్ధి, స్వయం పోషకత్వం ఏ ప్రణాళిక ప్రధాన లక్ష్యం?
3వ ప్రణాళిక - నాలుగో ప్రణాళికా కాలంలో ప్రణాళికా సంఘం పునర్ వ్యవస్థీకరణ ఎవరి ఆధ్వర్యంలో జరిగింది?
డి.ఆర్.గాడ్గిల్ - ధరల పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని పెట్టుబడి కేటాయింపులు ముఖ్యంగా ఏ కాలంలో జరిగాయి?
1966-67, 67-68, 68-69 వార్షిక ప్రణాళికల కాలంలో - చిన్న నీటిపారుదల వసతులను కల్పించి భూమికోతను అరికట్టడం, ప్రైవేటు భూముల అభివృద్ధి వంటి కార్యక్రమాలను ఏ ప్రణాళికలో రూపొందించారు?
నాలుగో ప్రణాళిక - బంగ్లాదేశ్ ఆవిర్భావం నేపథ్యంలో కాందిశీకుల వల్ల ప్రణాళికేతర వ్యయం పెరిగి ఎక్కువ బడ్జెట్ లోటు ఏ ప్రణాళికా కాలంలో ఏర్పడింది?
నాలుగో ప్రణాళిక - ఆర్థిక ప్రణాళిక ఏ జాబితాకు సంబంధించింది?
ఉమ్మడి జాబితా - భాక్రానంగల్, హిరాకుడ్, మెట్టూరు డ్యామ్‌ల నిర్మాణం ఏ ప్రణాళికలో ప్రారంభమైంది?
మొదటి ప్రణాళిక - ఎనిమిదో ప్రణాళిక వృద్ధి లక్ష్యం 5.6 శాతం కాగా సాధించిన శాతం?
6.8 - 1991లో భారత్ విదేశీ మారక ద్రవ్య సంక్షోభాన్ని ఎదుర్కొన్న సమయంలో దేశంలోని విదేశీ మారక ద్రవ్య నిల్వల పరిమాణం?
1 బిలియన్ డాలర్లు - రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ఏ ప్రణాళికలో ప్రారంభించారు?
11వ ప్రణాళిక - మిశ్రమ ఆర్థిక వ్యవస్థ స్వరూపాన్ని భారత్ ఏ ప్రణాళికలో తీసుకుంది?
రెండో ప్రణాళిక - నిరంతర ప్రణాళికను అమలుచేసి లబ్ధి పొందిన కంపెనీలు?
అమెరికాలోని ఫోర్‌డ మోటార్ కంపెనీ, నెదర్లాండ్‌సలో ఫిలిప్స్ కంపెనీ. - వ్యవసాయం, వినియోగ వస్తు పరిశ్రమకు ప్రాధాన్యమిస్తూ రూపొందించిన ప్రణాళిక?
ప్రజా ప్రణాళిక. - జవహర్ గ్రామ్ సమృద్ధి యోజన ఏ కార్యక్రమంలో విలీనమైంది?
సంపూర్ణ గ్రామీణ రోజ్‌గార్ యోజన - గ్రామీణ చేతివృత్తుల వారికి మెరుగైన టూల్‌కిట్స్ సరఫరా.. ఏ కార్యక్రమంలో విలీనమైంది?
స్వర్ణజయంతి గ్రామ స్వరోజ్‌గార్ యోజన - ప్రణాళికా సంఘం ఇండియా విజన్ 2020 డాక్యుమెంట్ రూపకల్పన కమిటీ అధ్యక్షుడు?
ఎస్.పి.గుప్తా - Chairman of the Post-war Reconstruction Committee of Indian Trade Union?
ఎం.ఎన్.రాయ్ - కమ్యూనిటీ ఆస్తుల కల్పనతోపాటు గ్రామీణ పేదలకు పనుల్లేని సమయాల్లో (Off Season) వేతన ఉపాధి కల్పనకు 1977లో జనతా ప్రభుత్వం ప్రారంభించిన పథకం?
పనికి ఆహార పథకం - ఆరోగ్యం, ప్రాథమిక విద్య, తాగునీరు, హౌజింగ్, గ్రామీణ రోడ్లు వంటి ఐదు ముఖ్యాంశాల్లో గ్రామస్థాయి అభివృద్ధికి 2000-01 బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన పథకం?
ప్రధానమంత్రి గ్రామోదయ యోజన - MPLAD పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు?
డిసెంబర్ 23, 1993 - తలసరి ఆదాయాన్ని 2016-17 నాటికి రెట్టింపు చేయాలనేది ఏ ప్రణాళిక లక్ష్యం?
11వ ప్రణాళిక - నెహ్రూ రోజ్‌గార్ యోజన ఏ కార్యక్రమంలో విలీనమైంది?
స్వర్ణ జయంతి షహరి రోజ్‌గార్ యోజన - ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమాన్ని ఏ ప్రణాళికలో ప్రారంభించారు?
11వ ప్రణాళిక - 11వ ప్రణాళిక పూర్తయ్యే నాటికి అక్షరాస్యతను ఎంత శాతానికి పెంచాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు?
80 శాతం
Published date : 10 Jun 2016 08:56PM