ఆర్థికవృద్ధి - ఆర్థికాభివృద్ధి
1. కింది వాటిలో ఆర్థికాభివృద్ధికి కొలమానం ఏది?
1. తలసరి జీఎన్‌పీ
2. పట్టణీకరణ
3. శ్రామికశక్తి
4. తలసరి వినియోగం
ఎ) 1, 4 మాత్రమే
బి) 2, 3 మాత్రమే
సి) 1,2,3,4
డి) పైవేవీ కావు
- View Answer
- సమాధానం: సి
2. కింది వాటిలో ఆర్థికాభివృద్ధిని ప్రభావితం చేసే సాంఘిక అంశం కానిది
ఎ) అక్షరాస్యత
బి) మూలధన కల్పన
సి) ఆరోగ్యసంరక్షణ
డి) శిశు మరణాలరేటు
- View Answer
- సమాధానం: బి
3. హరాడ్-డోమర్ వృద్ధి సమీకరణం ప్రకారం C/Y= 3/4, △K/△Y=3 అయితే ఒక నియమిత ఆర్థిక వ్యవస్థలో వృద్ధిరేటు ఎంత?
ఎ) 8.6 శాతం
బి) 8.5 శాతం
సి) 8.33 శాతం
డి) 7.8 శాతం
- View Answer
- సమాధానం: సి
4. స్థూల జాతీయోత్పత్తికి సంబంధించి కింది వాటిలో సరైంది?
ఎ) జీఎన్‌పీ అనేది ప్రవాహం
బి) అంతిమ ఉత్పత్తిని జీఎన్‌పీ కొలమానంలో తీసుకుంటారు
సి) జీఎన్‌పీ దేశ స్థానికులు మాత్రమే తయారుచేసిన ఉత్పత్తి
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
5. స్థూల జాతీయోత్పత్తి ఒక ప్రవాహ చలాంకమని, అది ఒక ఏడాది కాలంలో తయారైన వస్తు, సేవల పరిమాణాన్ని కొలుస్తుందని పేర్కొన్న వ్యక్తి ?
ఎ) కాంప్‌బెల్
బి) షాపిరో
సి) ఆడమ్‌స్మిత్
డి) కీన్స్
- View Answer
- సమాధానం: బి
6. ఫ్యాక్టర్ కాస్ట్ వద్ద కొలిచిన జాతీయాదాయంలో లేని అంశం?
ఎ) శ్రామికుల సేవలకు ప్రతిగా సంస్థలు చెల్లించే వేతనం
బి) భాటకం, వడ్డీ
సి) బదిలీ చెల్లింపులు
డి) లాభం
- View Answer
- సమాధానం: సి
7. కింది వాటిలో ఆర్థికాభివృద్ధి కొలమానం ఏది?
ఎ) వాస్తవిక జీడీపీలో పెరుగుదల
బి) మానవాభివృద్ధి సూచీ
సి) శిశు మరణాలరేటు
డి) లింగ సంబంధిత సూచీ
- View Answer
- సమాధానం: ఎ
8. ఆర్థికవృద్ధిలో స్వల్పకాల తేడాను ఏ విధంగా వ్యవహరించవచ్చు?
ఎ) అధిక జనాభా
బి) వ్యాపార చక్రాలు
సి) స్టాగ్ ఫ్లేషన్
డి) పైవేవీ కావు
- View Answer
- సమాధానం: బి
9. తరుగుదలను కింది వాటిలో దేనిగా వ్యవహరించవచ్చు?
ఎ) స్థూల పెట్టుబడి
బి) మూలధన వినియోగం
సి) నికర పెట్టుబడి
డి) నికర లాభం
- View Answer
- సమాధానం: బి
10. బ్యూరో ఆఫ్ ఎకనమిక్ అనాలసిస్ జీడీపీని కొలవడానికి అనుసరించే పద్ధతి -
1) ఉత్పత్తి మదింపు
2) ఆదాయ మదింపు
3) వ్యయాల మదింపు
4) సోషల్ అకౌంటింగ్
ఎ) 1, 4
బి) 2, 3
సి) 2, 3, 4
డి) 1,2,3,4
- View Answer
- సమాధానం: బి
11. కింది వారిలో ఎవరి నమూనా శ్రామికులు, మూలధనానికి సంబంధించి క్షీణ ప్రతిఫలాలను ప్రమేయంగా తీసుకుంది?
ఎ) హరాడ్- డోమర్
బి) షుంపీటల్
సి) సోలో-స్వాన్
డి) రాబిన్సన్
- View Answer
- సమాధానం: సి
12. వ్యాపార ఒడిదొడుకులను కొలవడానికి కింది వాటిలో ఏది ఉపకరిస్తుంది?
ఎ) వాస్తవిక జీడీపీ
బి) వ్యష్టి ఆదాయం
సి) వ్యయార్హ ఆదాయం
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: ఎ
13. వాస్తవిక వడ్డీ + ద్రవ్యోల్బణం = ?
ఎ) రెపోరేటు
బి) నామినల్ వడ్డీ
సి) స్థిరవడ్డీ రేటు
డి) చరవడ్డీ రేటు
- View Answer
- సమాధానం: బి
14. కింది వాటిలో వాస్తవిక జీడీపీ లెక్కింపులో భాగం కానిది
1) రాజకీయ స్వేచ్ఛ
2) సాంఘిక న్యాయం
3) ఆరోగ్యం
4) ఆయుఃప్రమాణం
ఎ) 1, 2
బి) 3, 4
సి) 1, 2, 3
డి) 1, 2, 3, 4
- View Answer
- సమాధానం: డి
15. స్థూల దేశీయోత్పత్తిలో భాగమైన అంశం
1) వినియోగం
2) పెట్టుబడి
3) ప్రభుత్వ వ్యయం
4) దేశ నికర విదేశీ ఎగుమతులు
ఎ) 1, 3
బి) 1, 2, 3
సి) 1, 2, 3, 4
డి) పైవేవీ కావు
- View Answer
- సమాధానం: సి
16. వ్యష్టి ఆదాయాన్ని ఎలా రాబట్టవచ్చు?
ఎ) జాతీయాదాయం - కార్పొరేట్ ఆదాయపన్ను - పంపిణీ కాని కార్పొరేట్ లాభాలు- సాంఘిక భద్రతల భాగస్వామ్యం+ బదిలీ చెల్లింపులు
బి) జాతీయాదాయం - పంపిణీ కాని కార్పొరేట్ లాభాలు + బదిలీ చెల్లింపులు
సి) జాతీయాదాయం - కార్పొరేట్ ఆదాయపన్ను+ బదిలీ చెల్లింపులు
డి) పైవేవీ కావు
- View Answer
- సమాధానం:ఎ
17. వ్యష్టి ఆదాయాన్ని ఎలా రాబట్టవచ్చు?
ఎ) జాతీయాదాయం - కార్పొరేట్ ఆదాయపన్ను - పంపిణీ కాని కార్పొరేట్ లాభాలు- సాంఘిక భద్రతల భాగస్వామ్యం+ బదిలీ చెల్లింపులు
బి) జాతీయాదాయం - పంపిణీ కాని కార్పొరేట్ లాభాలు + బదిలీ చెల్లింపులు
సి) జాతీయాదాయం - కార్పొరేట్ ఆదాయపన్ను+ బదిలీ చెల్లింపులు
డి) పైవేవీ కావు
- View Answer
- సమాధానం: ఎ
18. ఒక దేశ ఆర్థికవృద్ధిని కొలవటానికి సరైన కొలమానం
ఎ) జీడీపీ
బి) తలసరి వాస్తవిక ఆదాయం
సి) వ్యష్టి ఆదాయం
డి) వ్యయార్హ ఆదాయం
- View Answer
- సమాధానం: బి
19. కింది స్టేట్మెంట్లను పరిశీలించండి.
1) జాతీయవ్యయార్హ ఆదాయం = మార్కెట్ ధరల వద్ద నికర జాతీయోత్పత్తి + ప్రపంచంలోని ఇతర దేశాల నుంచి బదిలీ అయిన మొత్తం
2) జీఎన్‌పీ = జీడీపీ+ ఇతర దేశాల నుంచి ఉత్పత్తి కారకాల ద్వారా లభించిన నికర ఆదాయం
3) ఫ్యాక్టర్ కాస్ట్ వద్ద నికర జాతీయోత్పత్తిని జాతీయాదాయంగా భావిస్తాం.
పైవాటిలో ఏది సరైందో గుర్తించండి.
ఎ) 1, 3
బి) 2 మాత్రమే
సి) 1, 2, 3
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: సి
20. కింది ఏ అంశాల్లో దేశాల మధ్య స్థూలదేశీయోత్పత్తుల మధ్య పోలిక ఉంటుంది?
ఎ) దేశాల మధ్య మార్కెటేతర కార్యకలాపాల ధరలు, విలువ ఒకే విధంగా ఉన్నప్పుడు.
బి) దేశాల మధ్య మార్కెటేతర కార్యకలాపాల ధరలు ఒకే విధంగా ఉన్నప్పుడు.
సి) దేశాల మధ్య ధరలు ఒకే విధంగా ఉన్నప్పుడు.
డి) దేశాల మధ్య మార్కెటేతర కార్యకలాపాల విలువ ఒకే విధంగా ఉన్నప్పుడు.
- View Answer
- సమాధానం: ఎ
21. చట్ట బద్దంకాని మాదక ద్రవ్యాల అమ్మకం___.
ఎ) సేవల్లో భాగంగా జీడీపీలో కలిపి ఉంటుంది.
బి) పెట్టుబడిలో భాగంగా జీడీపీలో కలిపి ఉంటుంది.
సి) జీడీపీలో కలిపి ఉండదు.
డి) మార్కెటేతర కార్యకాలాపాల కింద జీడీపీలో కలిపి ఉంటుంది.
- View Answer
- సమాధానం: సి
22.కింది వాటిలో అంతిమ వస్తువు లేదా సేవకు ఉదాహరణ
ఎ) బహుమతిగా సీడీ ప్లేయర్‌ను కొనుగోలు చేయడం
బి) అప్లియన్సెస్ ఉత్పత్తిలో ఉక్కు వినియోగం
సి) సూప్ తయారీకి స్థానిక రెస్టారెంట్లు కూరగాయల కొనుగోలు
డి) పైవేవీ కావు
- View Answer
- సమాధానం: ఎ
23. శ్రామిక ఉత్పాదకతను కింది వాటిలో వేటిని పోల్చడం ద్వారా కొలవొచ్చు?
ఎ) వాస్తవ కాలాన్ని ప్రామాణికాలంతో
బి) మొత్తం ఉత్పత్తిని మొత్తం మ్యాన్ అవర్స్‌తో
సి) ఉత్పత్తికి కలిపిన మొత్తం వేతన వ్యయంతో
డి) పైవేవీ కావు
- View Answer
- సమాధానం: డి
24. కింది వాటిలో ఏది మార్కెట్ ధరల వద్ద జీఎన్‌పీ, మార్కెట్ ధరల వద్ద జీడీపీ మధ్య తేడాను తెల్పుతుంది?
ఎ) ఇతర దేశాల నుంచి నికర సంపద ఆదాయం
బి) తరుగుదల విలువ
సి) ఎగుమతులు
డి) దిగుమతులు
25. ఆర్థిక వ్యవస్థ పూర్ణోద్యోగితలో ఉన్నప్పుడు ద్రవ్యోల్బణ రేటును పెంచేది -
ఎ) పొదుపులో పెరుగుదల
బి) ఆదాయపన్ను రేట్ల తగ్గుదల
సి) ఆదాయపన్ను రేట్ల పెరుగుదల
డి) వినియోగ వ్యయ తగ్గుదల
- View Answer
- సమాధానం: బి
26. జాతీయ ఆదాయ అకౌంటింగ్ ప్రాథమిక ఉపయోగం?
ఎ) ఆర్థిక వ్యవస్థలో కాలుష్య వ్యయ విశ్లేషణ
బి) ఉత్పత్తేర లావాదేవీల వ్యయ అంచనా
సి) కొన్ని ప్రత్యేక పరిశ్రమలతో ఆర్థిక సమర్థత అంచనా
డి) ఆర్థిక వ్యవస్థ పనితీరును అంచనా వేయవచ్చు
- View Answer
- సమాధానం: డి
27. పెట్టుబడి అనేది మూలధన పరికరాలు, ఇన్వంటరీల కొనుగోలుతో పాటు కింది అంశాల్లో దేనికి సంబంధించి కూడా ఉంటుంది?
ఎ) తరుగుదల
బి) నిర్మాణాలు
సి) పెట్టుబడి దిగుమతి
డి) పైవేవీ కావు
- View Answer
- సమాధానం: బి
28. అసమానతల మిళిత మానవాభివృద్ధి సూచీని ఏ సంవత్సరంలో మానవాభివృద్ధి సూచీలో ప్రవేశపెట్టారు?
ఎ) 2008
బి) 2009
సి) 2010
డి) 2011
- View Answer
- సమాధానం: సి
29. కొనుగోలు శక్తి సామ్యం ఆధారంగా 2014లో ప్రపంచ వృద్ధిలో భారతదేశ భాగస్వామ్యం -
ఎ) 14.4 శాతం
బి) 15.2 శాతం
సి) 16.3 శాతం
డి) 17.2 శాతం
- View Answer
- సమాధానం: ఎ
30.వ్యయంవైపు ప్రస్తుత మార్కెట్ ధరల వద్ద జీడీపీని ఎలా రాబట్టవచ్చు?
1) వినియోగం (ప్రైవేటు, పబ్లిక్ కలిపి)
2) స్థూల మూలధన కల్పన
3) నికర ఎగుమతులు
ఎ) 1 మాత్రమే
బి) 3 మాత్రమే
సి) 1, 2, 3
డి) పైవేవీ కావు
- View Answer
- సమాధానం: సి
31. 2014-15లో ప్రస్తుత మార్కెట్ ధరల వద్ద జీడీపీలో పొదుపు రేటు -
ఎ) 32 శాతం
బి) 33 శాతం
సి) 34 శాతం
డి) 35 శాతం
- View Answer
- సమాధానం: బి
32.2015-16లో టోకు ధరల సూచీ సగటు -
ఎ) -2.1 శాతం
బి) -2.2 శాతం
సి) -2.5 శాతం
డి) -2.8 శాతం
- View Answer
- సమాధానం: డి
33. 2015-16లో భారత్ తలసరి నికర జాతీయాదాయం (మార్కెట్ ధరల వద్ద)
ఎ) రూ.92231
బి) రూ.93231
సి) రూ.93331
డి) రూ.93431
- View Answer
- సమాధానం: బి
34. 2014-15లో ఏ రాష్ట్ర జీఎస్డీపీలో సేవారంగం వాటా 87.5 శాతంగా నమోదైంది?
ఎ) మహరాష్ట్ర
బి) అరుణాచల్ ప్రదేశ్
సి) ఢిల్లీ
డి) కేరళ
- View Answer
- సమాధానం: సి
35.ఆర్థిక సర్వే 2015-16లో భారతదేశ వృద్ధిని ఎంతగా అంచనా వేసింది?
ఎ) 7-7.2 శాతం
బి) 7-7.5 శాతం
సి) 7-7.75 శాతం
డి) 7-8 శాతం
- View Answer
- సమాధానం: బి
36. 2015-16లో సేవారంగ వృద్ధిని ఆర్థిక సర్వే ఎంతగా అంచనా వేసింది?
ఎ) 8.2 శాతం
బి) 8.7 శాతం
సి) 9.1 శాతం
డి) 9.2 శాతం
- View Answer
- సమాధానం: డి
37. కింది వాటిలో ప్రవాహ భావన.
ఎ) ఒక వ్యక్తి నెల ఆదాయం
బి) వ్యక్తి మొత్తం సంపద
సి) ద్రవ్యసప్లయ్
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: ఎ
38. జీడీపీ అంచనాలో భాగంగా ఒక వస్తువు విలువను రెండుసార్లు లెక్కించడాన్ని అరికట్టేందుకు ఆర్థికవేత్తలు కింది వాటిలో దేన్ని ఉపయోగిస్తారు?
ఎ) జీడీపీ డీఫ్లేటర్
బి) రిటైల్ ధరలు
సి) ఉత్పత్తి ప్రతి దశలో కలిపిన విలువ
డి) మాథ్యమిక వస్తువుల ధరలను మాత్రమే
- View Answer
- సమాధానం: సి
A. పేదరికం విషవలయం | 1. అల్పాభివృద్ధి దేశాల్లో ఆర్థికాభివృద్ధి కోసం పెట్టుబడుల్లో పెరుగుదల |
B. సంతులిత వృద్ధి | 2. పెట్టుబడి స్తంభన |
C. బిగ్‌పుష్ | 3. అంతర్ సంబంధిత పరిశ్రమల్లో ఒకేసారి పెట్టుబడులు పెట్టడం |
A | B | C | |
ఎ) | 2 | 3 | 1 |
బి) | 1 | 2 | 3 |
సి) | 3 | 2 | 1 |
డి) | 2 | 1 | 3 |
- View Answer
- సమాధానం: ఎ
40. కింది వాటిలో దేని విలువ ఎక్కువగా ఉంటుంది?
ఎ) స్థూల జాతీయోత్పత్తి
బి) నికర జాతీయోత్పత్తి
సి) వ్యయార్హ ఆదాయం
డి) తలసరి ఆదాయం
- View Answer
- సమాధానం: ఎ
41. స్థిర ధరల వద్ద (2011-12) 2015-16 తలసరి నికర జాతీయ ఆదాయ వృద్ధి
ఎ) 5.6 శాతం
బి) 5.7 శాతం
సి) 6.1 శాతం
డి) 6.2 శాతం
- View Answer
- సమాధానం: డి
42. కింది వాటిలో ఏది సరైంది.
ఎ) జాతీయ వ్యయం= జాతీయ ఆదాయం + పొదుపు
బి) జాతీయ వ్యయం = జాతీయ ఆదాయం
సి) జాతీయ వ్యయం = జాతీయ ఆదాయం + పన్నులు
డి) జాతీయ వ్యయం = జాతీయ ఆదాయం - పన్నులు
- View Answer
- సమాధానం:బి