ఆర్థిక సర్వే, కేంద్ర బడ్జెట్
1. ప్రపంచ ఉత్పత్తి వృద్ధి బలహీనంగా ఉండి, ప్రపంచ స్థూల ఆర్థిక వాతావరణంలో అనిశ్చితి ఏర్పడటానికి కారణం?
ఎ) అనేక వస్తు ధరల్లో తగ్గుదల
బి) అస్థిర విత్త మార్కెట్లు
సి) వినిమయ రేటులో ఒడిదొడుకులు
డి) జపాన్ వృద్ధిరేటు అధికంగా ఉండటం
- View Answer
- సమాధానం: బి
2. కింది ఏ స్థూల ఆర్థిక చలాంకంలో ఇటీవలి కాలంలో మెరుగైన స్థితి ఏర్పడింది?
1. ద్రవ్యోల్బణం
2. ద్రవ్యలోటు
3. కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్
ఎ) 1 మాత్రమే
బి) 2, 3
సి) 1, 2, 3
డి) ఏదీకాదు
- View Answer
- సమాధానం: డి
3. 2015-16లో స్థిర ధరల వద్ద జీడీపీ?
ఎ) రూ.1,12,50,962 కోట్లు
బి) రూ.1,12,80,962 కోట్లు
సి) రూ.1,13,50,962 కోట్లు
డి) రూ.1,13,80,962 కోట్లు
- View Answer
- సమాధానం: సి
4. ద్రవ్యోల్బణానికి సంబంధించి కింది వాటిలో సరైంది?
1. 2013-14లో సగటు టోకు ధరల సూచీ 6 శాతం
2. 2014-15లో సగటు టోకు ధరల సూచీ 2 శాతం
3. 2015-16లో సగటు టోకు ధరల సూచీ - 2.8 శాతం
ఎ) 1 మాత్రమే
బి) 2, 3
సి) 1, 2, 3
డి) పైవేవీ కావు
- View Answer
- సమాధానం: సి
5. 2015-16లో ప్రస్తుత మార్కెట్ ధరల వద్ద తలసరి నికర జాతీయాదాయం?
ఎ) రూ.93,231
బి) రూ.93,531
సి) రూ.93,731
డి) రూ.93,931
- View Answer
- సమాధానం: ఎ
6. స్థిర ధరల వద్ద (2011-12) స్థూల కలుపబడిన విలువ వృద్ధిరేటు 2015-16 జీడీపీలో?
ఎ) 7.1 శాతం
బి) 7.2 శాతం
సి) 7.3 శాతం
డి) 7.6 శాతం
- View Answer
- సమాధానం: సి
7. 2015-16లో ముందస్తు అంచనాల ప్రకారం జీడీపీ వృద్ధికి కింది వాటిలో ఏది అధిక చేయూతనిచ్చింది?
ఎ) ప్రైవేట్ అంతిమ వినియోగం
బి) స్థిర మూలధన కల్పన
సి) ప్రభుత్వ అంతిమ వినియోగం
డి) నికర ఎగుమతులు
- View Answer
- సమాధానం: ఎ
8. ప్రైవేట్ వినియోగంలో శాతం పరంగా కింది వాటిలో దేని వాటా ఎక్కువ?
ఎ) హౌసింగ్
బి) విద్య
సి) ఆరోగ్యం
డి) ఆహారం
- View Answer
- సమాధానం: డి
9. 2014-15లో బేసిక్ ధరల వద్ద స్థూల కలుపబడిన విలువలో కింది వాటిలో దేని వాటా ఎక్కువ?
ఎ) ప్రభుత్వ రంగం
బి) కుటుంబ రంగం
సి) ప్రైవేట్ కార్పొరేట్ రంగం
డి) చిన్న తరహా పరిశ్రమల రంగం
- View Answer
- సమాధానం: బి
10. 2015-16లో స్థిర ధరల వద్ద తలసరి నికర జాతీయాదాయం?
ఎ) రూ.75,431
బి) రూ.77,131
సి) రూ.77,431
డి) రూ.77,531
- View Answer
- సమాధానం: సి
11. పేద ప్రజలకు సాంఘిక భద్రత కల్పించే చర్యలో భాగంగా గతేడాది మే 9న ప్రారంభించిన పథకం?
1. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన
2. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన
3. అటల్ పెన్షన్ యోజన
ఎ) 1 మాత్రమే
బి) 2, 3
సి) 1, 2, 3
డి) ఏదీకాదు
- View Answer
- సమాధానం: సి
12. ప్రధానమంత్రి ముద్రా యోజనను ప్రారంభించిన తేది?
ఎ) ఏప్రిల్ 8, 2015
బి) ఏప్రిల్ 15, 2015
సి) ఏప్రిల్ 25, 2015
డి) ఏప్రిల్ 30, 2015
- View Answer
- సమాధానం: ఎ
13. 2016లో పరిమాణం పరంగా ప్రపంచ వాణిజ్య వృద్ధి ఎంత మేర ఉండొచ్చని వరల్డ్ ఎకనమిక్ అవుట్‌లుక్ అంచనా వేసింది?
ఎ) 3.1 శాతం
బి) 3.4 శాతం
సి) 3.6 శాతం
డి) 4.1 శాతం
- View Answer
- సమాధానం: బి
14. 2016-17లో ప్రణాళికేతర రెవెన్యూ వ్యయంలో భాగంగా వడ్డీ చెల్లింపుల తర్వాత అధిక వ్యయం దేనిపై జరుగుతుంది?
ఎ) రక్షణ సేవలు
బి) పోలీస్
సి) పెన్షన్లు
డి) సబ్సిడీలు
- View Answer
- సమాధానం: డి
15. స్థిర ధరల వద్ద స్థూల కలుపబడిన విలువలో 2014-15లో అడవుల వాటా?
ఎ) 1.2 శాతం
బి) 1.3 శాతం
సి) 1.4 శాతం
డి) 1.5 శాతం
- View Answer
- సమాధానం: ఎ
16. ఏ రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిలో సేవా రంగం వాటా ఎక్కువ?
ఎ) అరుణాచల్ ప్రదేశ్
బి) గోవా
సి) ఢిల్లీ
డి) మహారాష్ట్ర
- View Answer
- సమాధానం: సి
17. అల్పాదాయ రాష్ట్రాలకు గ్రామీణ నీటి సరఫరా, పారిశుధ్య ప్రాజెక్టు కోసం ఏ సంస్థ ఆర్థిక సహాయం చేసింది?
ఎ) ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్
బి) ప్రపంచ బ్యాంక్
సి) ఐఎంఎఫ్
డి) యునిసెఫ్
- View Answer
- సమాధానం: బి
18. 2015 సంవత్సరం కింది ఏ అంతర్జాతీయ సంఘటనలను చవి చూసింది?
1. యూఎన్ఎఫ్సీసీసీ కింద చారిత్రాత్మక వాతావరణ మార్పుల ఒప్పందం
2. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు (మిలీనియం వృద్ధి లక్ష్యాల స్థానంలో)
ఎ) 1 మ్రాతమే
బి) 2 మాత్రమే
సి) 1, 2
డి) పైవేవి కావు
- View Answer
- సమాధానం: సి
19. యూనివర్సల్ హెల్త్ కవరేజ్ ఇండెక్స్-2015ను రూపొందించినది?
ఎ) ప్రపంచ బ్యాంక్
బి) ప్రపంచ ఆరోగ్య సంస్థ
సి) యునిసెఫ్
డి) యూఎన్‌సీటీఏడీ
- View Answer
- సమాధానం: ఎ
20. సవరించిన అంచనాల ప్రకారం 2015-16లో వడ్డీ చెల్లింపుల మొత్తం?
ఎ) రూ.4,12,620 కోట్లు
బి) రూ.4,22,620 కోట్లు
సి) రూ.4,32,620 కోట్లు
డి) రూ.4,42,620 కోట్లు
- View Answer
- సమాధానం: డి
21. కింది వాటిలో రుణేతర మూలధన రాబడి కానివి?
1. రుణాలు, అడ్వాన్సుల రికవరీ
2. మార్కెట్ రుణాలు
3. చిన్న మొత్తాల పొదుపు రుణం
4. పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రాబడి
ఎ) 1, 3
బి) 2, 4
సి) 1, 3
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: బి
22. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలు సక్రమంగా అమలయ్యేలా చూడటం కోసం 2014-15 బడ్జెట్లో మొత్తం పథకాలను ఎన్ని రకాలుగా వర్గీకరించారు?
ఎ) 60
బి) 64
సి) 66
డి) 68
- View Answer
- సమాధానం: సి
23. 2014-15లో ఆహార ధాన్యాల సాగు విస్తీర్ణం?
ఎ) 122.1 మి.హె.
బి) 124.1 మి.హె.
సి) 126.1 మి.హె.
డి) 127.1 మి.హె.
- View Answer
- సమాధానం: ఎ
24. రెండో ముందస్తు అంచనాల ప్రకారం 2015-16లో ఆహార ధాన్యాల ఉత్పత్తి?
ఎ) 223.2 మి.టన్నులు
బి) 233.3 మి.టన్నులు
సి) 243.1 మి.టన్నులు
డి) 253.2 మి.టన్నులు
- View Answer
- సమాధానం: డి
25. 2014-15లో మొక్కజొన్న ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ తొలిస్థానంలో ఉండగా, రెండో స్థానంలో ఉన్న రాష్ట్రం?
ఎ) మహారాష్ట్ర
బి) కర్ణాటక
సి) తెలంగాణ
డి) రాజస్థాన్
- View Answer
- సమాధానం: బి
26. 2014-15లో ఆహార ధాన్యాల ఉత్పత్తిలో తొలి మూడు స్థానాలు పొందిన రాష్ట్రాలు వరుస క్రమంలో?
ఎ) మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్
బి) ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక
సి) ఉత్తరప్రదేశ్, పంజాబ్, మధ్యప్రదేశ్
డి) ఉత్తరప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ
- View Answer
- సమాధానం: సి
27. 2014లో పప్పు ధాన్యాల తలసరి లభ్యత రోజుకు?
ఎ) 47.2 గ్రాములు
బి) 48.5 గ్రాములు
సి) 49.3 గ్రాములు
డి) 49.5 గ్రాములు
- View Answer
- సమాధానం: ఎ
28. 2014లో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఎన్ని టన్నుల ఆహార ధాన్యాలను పంపిణీ చేశారు?
ఎ) 41.5 మి.టన్నులు
బి) 42.5 మి.టన్నులు
సి) 43.5 మి.టన్నులు
డి) 44.5 మి.టన్నులు
- View Answer
- సమాధానం: సి
29. సోయాబీన్ ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం?
ఎ) కర్ణాటక
బి) మధ్యప్రదేశ్
సి) రాజస్థాన్
డి) మహారాష్ట్ర
- View Answer
- సమాధానం: బి
30. 2015 జూన్ నాటికి మొత్తం బ్యాంకు శాఖల్లో అధిక శాతం గ్రామీణ శాఖలు ఉన్న బ్యాంకు?
ఎ) ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు
బి) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
సి) లోకల్ ఏరియా బ్యాంకులు
డి) ప్రైవేట్ బ్యాంకులు
- View Answer
- సమాధానం: ఎ
31. స్థిర ధరల వద్ద (2011-12) ముందస్తు అంచనాల ప్రకారం 2015-16లో వాస్తవిక స్థూల కలుపబడిన విలువలో ఏ రంగంలో వృద్ధిరేటు ఎక్కువ?
ఎ) కమ్యూనిటీ, సాంఘిక, వ్యక్తిగత సేవలు
బి) ఫైనాన్సింగ్, బీమా, రియల్ ఎస్టేట్, వ్యాపార సేవలు
సి) తయారీ రంగం
డి) వాణిజ్యం, హోటళ్లు, రవాణా, సమాచారం
- View Answer
- సమాధానం: బి
32. 2014-15తో పోలిస్తే 2015-16లో సేవారంగం వృద్ధి తక్కువగా ఉండటానికి కారణం?
1. ప్రభుత్వ పాలన, రక్షణలో వృద్ధి క్షీణత
2. ఇతర సేవల్లో వృద్ధి క్షీణత
3. వాణిజ్యం, రిపేరు, హోటళ్లు, రెస్టారెంట్లలో వృద్ధి క్షీణత
4. రియల్ ఎస్టేట్, ఫైనాన్షియల్ సర్వీసుల్లో వృద్ధి క్షీణత
ఎ) 1, 2
బి) 3 మాత్రమే
సి) 3, 4
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: ఎ
33. 2014-15లో భారతదేశ వాణిజ్య లోటు?
ఎ) 127.7 బి. డాలర్లు
బి) 132.5 బి. డాలర్లు
సి) 137.7 బి. డాలర్లు
డి) 147.7 బి. డాలర్లు
- View Answer
- సమాధానం: సి
34. 2014-15లో భారత ఎగుమతుల్లో ఏ ప్రాంతం వాటా ఎక్కువ?
ఎ) యూరప్
బి) అమెరికా
సి) ఆఫ్రికా
డి) ఆస్ట్రేలియా
- View Answer
- సమాధానం: ఎ
35. 2015 ఏప్రిల్-డిసెంబర్ మధ్య కాలంలో వినియోగదారుడి ధరల సూచీ తక్కువగా నమోదైన రాష్ట్రం?
1. రాజస్థాన్
2. ఉత్తరప్రదేశ్
3. పశ్చిమ బెంగాల్
4. బిహార్
ఎ) 1, 4
బి) 2, 3
సి) 2, 3, 4
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: సి
36. సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా సంస్థల అభివృద్ధి చట్టం-2006లోని సెక్షన్ 8 దేనికి వీలు కల్పిస్తోంది?
ఎ) ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఫర్ ఎంఎస్ఎంఈ
బి) వెనుకబడిన ప్రాంతాల్లో ఉపాధి
సి) చిన్న తరహా పరిశ్రమలకు రిజర్వేషన్ విధానం రద్దు
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: ఎ
37. 2011-12లో గ్రామీణ పేదరికం 10 శాతం కంటే తక్కువగా ఉన్న రాష్ట్రం?
1. గోవా
2. సిక్కిం
3. కర్ణాటక
4. పంజాబ్
ఎ) 1 మాత్రమే
బి) 2, 3
సి) 1, 2, 4
డి) 1, 2, 3, 4
- View Answer
- సమాధానం: సి
38. నైపుణ్యం గల ఆరోగ్య సిబ్బంది కొరత లేని రాష్ట్రం?
ఎ) జార్ఖండ్
బి) తమిళనాడు
సి) మధ్యప్రదేశ్
డి) ఉత్తరప్రదేశ్
- View Answer
- సమాధానం: బి
39. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-4 ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 12-23 నెలలలోపు పిల్లల్లో పూర్తిగా టీకాలు ఇవ్వడం ఎంత శాతంగా నమోదైంది?
ఎ) 68.1 శాతం
బి) 69.2 శాతం
సి) 70.1 శాతం
డి) 7.1 శాతం
- View Answer
- సమాధానం: ఎ
40. 2013-14లో లేబర్ బ్యూరో నివేదిక ప్రకారం సాధారణ స్థితి కొలమానాన్ని అనుసరించి 15 సంవత్సరాలు పైబడిన వారిలో నిరుద్యోగిత రేటు?
ఎ) 4.6 శాతం
బి) 4.7 శాతం
సి) 4.8 శాతం
డి) 4.9 శాతం
- View Answer
- సమాధానం: డి
41. 2015-16 బడ్జెట్ అంచనాల ప్రకారం మొత్తం సాంఘిక సేవలపై జరిగిన వ్యయంలో ఆరోగ్యంపై వెచ్చించిన మొత్తం?
ఎ) 19.1 శాతం
బి) 19.5 శాతం
సి) 20.5 శాతం
డి) 21.5 శాతం
- View Answer
- సమాధానం: బి
42. 2014-15లో వృత్తిపరమైన నైపుణ్యం గల టీచర్ల శాతం ఏ విద్యా స్థాయిలో తక్కువ?
ఎ) ప్రైమరీ
బి) అప్పర్ ప్రైమరీ
సి) సెకండరీ
డి) హయ్యర్ సెకండరీ
- View Answer
- సమాధానం: డి
43. 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం జనాభాలో సున్నా నుంచి ఆరు సంవత్సరాల వయోవర్గంలోని జనాభా శాతం?
ఎ) 13.6 శాతం
బి) 14.5 శాతం
సి) 15.5 శాతం
డి) 16.1 శాతం
- View Answer
- సమాధానం: ఎ
44. 2015-16లో సవరించిన అంచనాల ప్రకారం మొత్తం పన్ను రాబడిలో కార్పొరేషన్ పన్ను తర్వాత అధిక రాబడి ఇచ్చిన పన్ను?
ఎ) సేవలపై పన్ను
బి) యూనియన్ ఎక్సైజ్ డ్యూటీలు
సి) ఆదాయపు పన్ను
డి) సంపద పన్ను
- View Answer
- సమాధానం: సి
45. 2016-17 కేంద్ర బడ్జెట్ అంచనాల ప్రకారం స్థూల పన్ను రాబడి?
ఎ) రూ.15,90,750 కోట్లు
బి) రూ.16,30,888 కోట్లు
సి) రూ.16,31,745 కోట్లు
డి) రూ.16,35,888 కోట్లు
- View Answer
- సమాధానం: బి