Skip to main content

AP DSC Preparation Tips: తక్కువ సమయం.. ఎక్కువ సిలబస్.. పరీక్ష విధానం, ప్రిపరేషన్ ఇలా!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన AP DSC 2025 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. పరీక్షలు జూన్ 6 నుండి జూలై 6 వరకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) విధానంలో నిర్వహించనున్నారు. అంటే అభ్యర్థులకు సిద్ధం కావడానికి ఉన్న సమయం కేవలం 36 రోజులు మాత్రమే. సమయం తక్కువగా ఉండటంతో అభ్యర్థులకు గట్టినిర్ణయాలతో ప్రిపరేషన్ అవసరం.
ap dsc preparation plan  AP DSC 2025 teacher posts notification  Andhra Pradesh DSC 2025 exam schedule

AP DSC 2025 పోస్టుల వివరాలు:

  • స్కూల్ అసిస్టెంట్: 7,207 పోస్టులు.
  • ఎస్‌జీటీ: 5,985 పోస్టులు.
  • టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపల్, ఫిజికల్ డైరెక్టర్: 2,228 పోస్టులు.
  • ట్రైబల్, మున్సిపల్, రెసిడెన్షియల్ స్కూల్స్ పరిధిలో ఇతర పోస్టులు.

అర్హతలు:

  • టెట్ పాస్ తప్పనిసరి (20% వెయిటేజీ).
  • ఎస్‌జీటీకి ఇంటర్ + డీఈడీ/బీఈడీ.
  • స్కూల్ అసిస్టెంట్కి డిగ్రీ/పీజీ + బీఈడీ.

గరిష్ట వయసు: జనరల్ అభ్యర్థులకు 44, రిజర్వ్డులకు 49 సంవత్సరాలు.

చదవండి: AP డీఎస్సీ - AP టెట్‌ | మోడల్ పేపర్స్ | సెకండరీ గ్రేడ్ టీచర్ బిట్ బ్యాంక్ | స్కూల్ అసిస్టెంట్ బిట్ బ్యాంక్

 

పరీక్ష విధానం:

  • మొత్తం మార్కులు: ఎస్‌జీటీ, స్కూల్ అసిస్టెంట్, టీజీటీకి 80 మార్కులు; పీజీటీ, ప్రిన్సిపల్కి 100 మార్కులు.
  • సబ్జెక్టులు: జీకే & కరెంట్ అఫైర్స్, ఎడ్యుకేషన్ పర్స్పెక్టివ్, సైకాలజీ, కంటెంట్, మెథడాలజీ.
  • ఇంగ్లిష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా నిర్వహించబడుతుంది.

ప్రిపరేషన్ గైడెన్స్:

  • జీకే & కరెంట్ అఫైర్స్: వార్తల్లో వ్యక్తులు, బడ్జెట్, సైన్స్ అండ్ టెక్నాలజీ.
  • ఎడ్యుకేషన్ పర్స్పెక్టివ్: RTE, NEP, NCF-2005.
  • సైకాలజీ: బాలల వికాసం, అభివృద్ధి దశలు.
  • కంటెంట్ & మెథడాలజీ: తెలుగు, ఇంగ్లిష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ — 10వ తరగతి వరకు పాఠ్య పుస్తకాలు ఆధారంగా.

ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేది: 2025, మే 15

పరీక్ష తేదీలు: 2025, జూన్ 6 నుంచి జూలై 6 వరకు

ఆఫిషియల్ వెబ్‌సైట్: https://apdsc.apcfss.in

Join our WhatsApp Channel: Click Here
 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 02 May 2025 08:47AM

Photo Stories