Skip to main content

విద్యార్ధులకు చక్కని వ్యక్తిత్వం ముఖ్యం.. !

అలవాట్లు.. విద్యార్ధుల వ్యక్తిత్వ నిర్మాణంలో కీలకపాత్ర పోషిస్తారుు. మన అలవాట్లే మనలను మంచివాడిగా లేదా దుష్టుడిగా మారుస్తారుు. ఏ అలవాటు మంచిదో, ఏది చెడ్డతో ఆలోచించుకుని ముందుకు సాగితే ఇబ్బందులు రావు.
 మన అలవాట్ల వల్ల సమాజానికి మేలు కలగకపోరుునా ఇబ్బందేమీ అరుుతే అవే అలవాట్లు ఇతరులకు ఇబ్బంది కలిగిస్తే ఏదో ఒకరోజు దాని విపరిణామాలను ఎదుర్కోక తప్పదు సుమా. అలవాట్ల గురించి చెప్పుకునేందుకు మన కళ్లెదుట ఉన్న ప్రకృతిని ఓ మారు పరిశీలిద్దాం. చెట్లను తీసుకుంటే ప్రాణవాయువును అందజేస్తుంది. నీడ ఇస్తుంది. పూలు ఇస్తుంది. ఫలాలు ఇస్తుంది.   వంట చెరకుగా ఉపయోగపడుతుంది. మనిషి చనిపోతే కాల్చడానికీ ఉపయోగపడుతుంది. ఒక చెట్టు వల్ల సమాజానికి ఇంత మేలు జరుగుతుంటే మనిషిగా పుట్టినందుకు మనవల్ల సమాజానికి ఎటువంటి మేలు కలుగుతుందని ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోవాలి. ప్రతి వ్యక్తి తన అన్ని అవసరాలను తీర్చుకునేందుకు నిద్ర లేచినది మొదలు పడుకునేవరకూ సమాజంపైనే ఆధారపడతాడు. మరి ఆ రుణం తీర్చుకునే బాధ్యత ఎవరిది. ఈ విషయాన్ని నిరంతరం మదిలో ఉంచుకోవాలి. మానవ సేవే మాధవ సేవ. కాబట్టి విద్యార్ధులు మంచి అలవాట్లను అలవరచుకుని, సేవా భావం కలిగి, ఇతరులకు స్ఫూర్తి దాయకంగా నిలవాలి.
Published date : 11 Jan 2020 03:02PM

Photo Stories