వెబ్‌సైట్‌లో తెలంగాణ టెన్త్ హాల్‌టికెట్లు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 19 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల హాల్‌టికెట్లను తమ వెబ్‌సైట్‌లో ( bse. telangana.gov.in) అందుబాటులో ఉంచినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డెరైక్టర్ సత్యనారాయణరెడ్డి తెలిపారు.
విద్యార్థులు ఈ నెల 12 నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇప్పటికే పాఠశాలలకు హాల్‌టికెట్లను పంపించామని.. 12, 13 తేదీల్లో అవన్నీ పాఠశాలలకు చేరుతాయని చెప్పారు. వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న హాల్‌టికెట్లను కూడా పరీక్ష సమయంలో అనుమతించాలని, దానిపై ఎవరి సంతకం అవసరం లేదని స్పష్టం చేశారు. పరీక్ష ప్రతి రోజు ఉదయం 9:30 గంటలకు ప్రారంభం అవుతుందని, విద్యార్థులు ఉదయం 9 గంటలకల్లా పరీక్ష హాల్‌లో ఉండాలని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి నిమిషం నిబంధన ఏమీ లేదని చెప్పారు.
Published date : 12 Mar 2020 02:48PM