YS Jagan Mohan Reddy: స్కూళ్లకు వచ్చే విద్యార్ధులపై నిరంతరం ట్రాకింగ్ ఉండాలి
Sakshi Education
సాక్షి, అమరావతి: విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. ఏప్రిల్ 10న క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్, ఇంటర్మీడియట్ విద్య కమిషనర్ ఎంవీ శేషగిరిబాబు, పాఠశాల విద్యాశాఖ (మౌలికవసతులు) కమిషనర్ కాటమనేని భాస్కర్ సహా ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
స్కూళ్లకు వచ్చే విద్యార్ధులపై నిరంతరం ట్రాకింగ్ ఉండాలి
ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే..
స్కూళ్లుకు వచ్చే విద్యార్ధులపై నిరంతరం ట్రాకింగ్ ఉండాలి
సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థతో క్షేత్రస్ధాయిలో విద్యాశాఖ ఇప్పటికే సినర్జీతో ఉంది
దీన్ని మరింత సమర్ధవంతంగా వాడుకోవాలి
పిల్లలు పాఠశాలకు రాని పక్షంలో తల్లిదండ్రులకు మెసేజ్ వెళ్తుంది
అయినా పిల్లలు బడికి రాని పక్షంలో తల్లిదండ్రులను ఆరా తీస్తున్నారు
పిల్లలను బడికి పంపేలా అమ్మ ఒడిని అందిస్తున్నాం
ఇంటర్మీడియట్ వరకూ అమ్మ ఒడి వర్తిస్తుంది
ఆ తర్వాత కూడా విద్యాదీవెన, వసతి దీవెన ఉన్నాయి
ఇలా ప్రతి దశలోనూ చదువులకు ప్రభుత్వం అండగా నిలుస్తుంది
ఇలా ప్రతి విద్యార్థిని కూడా ట్రాక్ చేస్తున్నాం
–అందుకే డ్రాప్‌అవుట్ అనే ప్రశ్నే ఉత్పన్నం కాకుండా అన్నిరకాలుగా చర్యలు తీసుకుంటున్నాం
దీనిపై ఎప్పటికప్పుడు సమర్థవంతమైన పర్యవేక్షణ జరగాలి
వచ్చే విద్యాసంవత్సరంలో విద్యాకానుకపై సీఎం సమీక్ష
విద్యార్థులకు పంపిణీచేయాల్సిన పుస్తకాల ముద్రణ ముందుగానే పూర్తిచేయాలని సీఎం ఆదేశాలు
మే 15 నాటికి అన్నిరకాలుగా సిద్ధమవుతున్నామన్న అధికారులు
పిల్లలకు ప్రతి సబ్జెక్టులోనూ పట్టుకోసం ఈ విధానాన్ని తీసుకు వచ్చామన్న సీఎం
దీనివల్ల చక్కటి పునాది ఏర్పడుతుందని, పిల్లల్లో నైపుణ్యాలు మెరుగుపడుతాయన్న సీఎం
గతంలో సబ్జెక్టు టీచర్లకు మంచి శిక్షణ ఇవ్వాలని సీఎం ఆదేశాల నేపథ్యంలో సబ్జెక్టు టీచర్లకు బోధనా పద్ధతులపై ఐఐటీ మద్రాస్ ఆధ్వర్యంలో సర్టిఫికెట్ కోర్సులు ఏర్పాటుకు సీఎం గ్రీన్ సిగ్నల్