Skip to main content

టీఎస్ టెన్త్ 2021 పరీక్షల షెడ్యూల్: పరీక్షల సమయం అరగంట పెంపు.. చాయిస్ 50 శాతం..ఇంకా..

సాక్షి, హైదరాబాద్: కరోనా నేపథ్యంలో మే 17 నుంచి 26 వరకు జరగనున్న పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులపై వీలైనంత వరకు ఒత్తిడి లేకుండా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది.
ఇప్పటికే 11 పేపర్లకు బదులు 6 పేపర్లతోనే పరీక్షలను నిర్వహించనున్న ప్రభుత్వం తాజాగా విద్యార్థులకు రెట్టింపు ఆప్షన్లు ఉండేలా ప్రశ్నపత్రాలను రూపొందించనుంది. అలాగే పరీక్షల సమయాన్ని అరగంటపాటు పెంచింది. ప్రత్యక్ష విద్యా బోధన సకాలంలో అందుబాటులోకి రాక, ఆన్‌లైన్/డిజిటల్ బోధన అందరికీ పూర్తిస్థాయిలో అర్థంకాని పరిస్థితులు నెలకొన్నందువల్ల ఈ నిర్ణయం తీసుకుంటూ పరీక్షల పూర్తిస్థాయి షెడ్యూల్ విడుదల చేసింది.

తెలంగాణ పదో తరగతి  2021 పరీక్షల టైం టేబుల్, సిలబస్, స్టడీ మెటీరియల్, ప్రీవియస్ పేపర్స్, ప్రిపరేషన్ టిప్స్, కెరీర్ గెడైన్స్... ఇతర తాజా అప్‌డేట్స్ కోసం క్లిక్ చేయండి.

అలాగే పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలను ప్రకటించింది. పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలను ప్రభుత్వ పరీక్షల విభాగం డెరైక్టర్ సత్యనారాయణరెడ్డి మంగళవారం వెల్లడించారు. విద్యార్థులు ఈ నెల 25 వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు. ఆలస్య రుసుముతో వచ్చే నెల 16 వరకు ఫీజు చెల్లించేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

రెట్టింపు చాయిస్ ఇలా...
గతంలో సోషల్ స్టడీస్‌లో 20 ప్రశ్నల్లో ఏవైనా 16 ప్రశ్నలకు విద్యార్థులు సమాధానాలు రాయాల్సి ఉండగా ప్రస్తుతం 28 ప్రశ్నలు ఇచ్చి అందులో 14 ప్రశ్నలకు జవాబులు రాసేలా విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. తెలుగు సబ్జెక్టులో 20 ప్రశ్నలు ఇచ్చి 10 ప్రశ్నలకు సమాధానాలు రాసేలా చర్యలు చేపడుతోంది. ఇలా ప్రతి సబ్జెక్టులో విద్యార్థులకు 50 శాతం చాయిస్ ఉండేలా విద్యాశాఖ చర్యలు చేపట్టింది. అలాగే ప్రతి సబ్జెక్టులో ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు 20 మార్కులు, ఇంటర్నల్స్‌కు 20 మార్కులు ఉండేలా, 60 మార్కులకు వ్యాసరూప సమాధానాలు రాసేలా ప్రశ్నపత్రాలను రూపొందిస్తోంది. వ్యాసరూప ప్రశ్నల విభాగంలోని రెండు సెక్షన్లలో ఇచ్చే మూడు చొప్పున ప్రశ్నల్లో ఒక్కో దానికి సమాధానం రాసేలా, దానికి 8 మార్కులు చొప్పున కేటాయించేలా చర్యలు చేపడుతోంది. అంటే ఇందులో మొత్తంగా 16 మార్కులు ఉండనున్నాయి. అలాగే స్వీయ రచన విభాగంలోని 2 సెక్షన్లలో ఒక్కో దాంట్లో 4 చొప్పున 8 ప్రశ్నలు ఉంటాయి. అం దులో 2 చొప్పున 4 ప్రశ్నలకు సమాధానం రాయాలి. ఒక్కో దానికి 4 మార్కుల చొప్పున 16 మార్కులు ఉంటాయి. సృజనాత్మకత విభాగంలో 3 ప్రశ్నల్లో ఒక దానికి సమాధానం రాయాలి. దానికి 8 మార్కులు ఉంటాయి. అవగాహన, ప్రతిస్పందన విభాగంలో ప్యాసేజ్ చదివి సమాధానాలు రాయా లని అడిగేవి 3 (ప్యాసేజీలు) ఉంటాయి. వాటికి 20 మార్కులు ఉండనున్నాయి. త్వరలోనే నమూనా ప్రశ్నపత్రాలను హెడ్‌మాస్టర్లకు పంపడంతోపాటు వెబ్‌సైట్‌లోనూ అందుబాటులో ఉంచనుంది.

ఫీజు వివరాలివే..
  • రెగ్యులర్ విద్యార్థులు అన్ని సబ్జెక్టులకు రూ. 125 చెల్లించాలి. గతంలో ఫెయిల్ అయిన విద్యార్థులైతే మూడు, అంతకంటే తక్కువ సబ్జెక్టులకు రూ. 110 ఫీజు చెల్లించాలి. నాలుగు, అంతకంటే ఎక్కువ సబ్జెక్టులకు రూ. 125 చెల్లించాలి.
  • వొకేషనల్ విద్యార్థులైతే రెగ్యులర్ ఫీజుకు (రూ.125) అదనంగా రూ. 60 చెల్లించాలి.
  • రెగ్యులర్ విద్యార్థుల్లో పట్టణ ప్రాంతాలకు చెందిన వారు రూ. 24 వేలలోపు వార్షిక ఆదాయం కలిగి ఉంటే వారికి ఫీజు మినహాయింపు ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల వారైతే రూ. 20 వేల వార్షిక ఆదాయం లేదా 2.5 ఎకరాలలోపు తరి/5 ఎకరాల లోపు మెట్ట భూమి ఉంటే ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.
  • హెడ్‌మాస్టర్లు/ప్రిన్సిపాళ్లు విద్యార్థుల డాటాను ఆన్‌లైన్ ద్వారానే పంపించాలి. ఐసీఆర్ కమ్ ఓఎంఆర్ ఫారాలు, నామినల్ రోల్స్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు.

ఫీజు చెల్లింపు తేదీలివే...
విద్యార్థులు ఈనెల 25వ తేదీలోగా పరీక్ష ఫీజు చెల్లించాలి. దానిని హెడ్‌మాస్టర్లు మార్చి 1వ తేదీలోగా సబ్ ట్రెజరీలో జమ చేయాలి. విద్యార్థులు రూ. 50 ఆలస్య రుసుముతో మార్చి 3వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చు. రూ. 200 ఆలస్య రుసుముతో వచ్చే నెల 10వ తేదీ వరకు, రూ. 500 ఆలస్య రుసుముతో వచ్చే నెల 16వ తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లించాలి.

ప్రతి పరీక్షకు 3:15 గంటల సమయం..
పరీక్షలు ప్రతి రోజు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు ఉంటాయి. ప్రతి పరీక్షకు 3:15 గంటల సమయం ఉంటుంది. గతంలో 2:45 గంటల సమయమే ఉండగా ఈసారి అరగంట అదనంగా పెంచారు. వొకేషనల్ కోర్సు పరీక్షలు మాత్రం ఉదయం 9:30 గంటల నుంచి 11:30 గంటల వరకే ఉంటాయి. - అన్ని సబె ్జక్టుల ఆబ్జెక్టివ్ పేపర్లు (పార్ట్-బీ) పరీక్షల చివరి అరగంట ముందే ఇస్తారు.

టెన్త్‌ పరీక్షల తేదీలివే..

17-5-2021

ప్రథమ భాష, ప్రథమ భాష (కాంపొజిట్ కోర్సు) పేపరు-1, 2

18-5-2021

ద్వితీయ భాష

19-5-2021

ఇంగ్లిష్

20-5-2021

మ్యాథమెటిక్స్

21-5-2021

జనరల్ సైన్స్‌ (ఫిజిక్స్,బయోలజీ)

22-5-2021

సోషల్ స్టడీస్

24-5-2021

ఓఎస్సెస్సీ మెయిన్ లాంగ్వేజ్-1

25-5-2021

ఓఎస్సెస్సీ మెయిన్ లాంగ్వేజ్-2

26-5-2021

ఎస్సెస్సీ వొకేషనల్ కోర్సు (థియరీ)

Published date : 10 Feb 2021 02:54PM

Photo Stories