Skip to main content

టెన్త్ విద్యార్థులకు నేటి నుంచి రివిజన్ క్లాసులు

సాక్షి, హైదరాబాద్: కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో పరీక్షలు వాయిదా పడిన పదో తరగతి విద్యార్థులకు దూరదర్శన్ యాదగిరి చానెల్ ద్వారా పునశ్చరణ తరగతులను ఏర్పాటు చేస్తున్నామని విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
ఈ తరగతులను ఆదివారం నుంచి ఈనెల 23 వరకు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇంగ్లిష్, గణితం, ఫిజికల్ సైన్స్, బయాలజీ, సోషల్ సబ్జెక్టులకు సంబంధించి ఈ పునశ్చరణ తరగతులుంటాయని పేర్కొన్నారు. విద్యార్థుల ప్రయోజనం కోసం ఏర్పాటు చేసిన ఈ సౌకర్యాన్ని ఇంట్లో ఉండే సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
Published date : 13 Apr 2020 03:32PM

Photo Stories