తెలంగాణ పదో తరగతి పరీక్షలపై కోర్టులో పిల్
Sakshi Education
సాక్షి హైదరాబాద్: కోవిడ్ వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను వైద్య నిపుణుల సలహాలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారంటూ హైకోర్టు లో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది.
రాష్ట్రంలో కోవిడ్ మహమ్మారిలా విజృంభిస్తుంటే.. ఎలాంటి వైద్యపరమైన జాగ్రత్తలు లేకుండానే టెన్‌త పరీక్షలను నిర్వహిస్తున్నారని పిల్‌లో పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని ఈస్ట్ మారేడ్‌పల్లికి చెందిన ఎం.బాలకృష్ణ ఈ పిల్ దాఖ లు చేశారు. ఈ పిల్‌లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్య దర్శి, వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యద ర్శి, పాఠశాల విద్యాశాఖ కమిషనర్, డెరైక్టర్‌లతోపా టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతివాదులుగా చేశారు. ఈ నెల 19 నుంచి ఏప్రిల్ 6 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని పేర్కొన్నారు. అయితే టెన్‌త పరీక్షా కేంద్రాల వద్దకు గురువారం వెళ్లి పరిశీలిస్తే పరీక్షా కేంద్రాల వద్ద వైరస్ వ్యాప్తి నిరోధక చర్యలు తీసుకోలేదని హై కోర్టు దృష్టికి తెచ్చారు. విద్యార్థులు, ఇన్విజిలేటర్లు మాస్కులు ధరించలేదని, చేతు లు కడుక్కునేందుకు సబ్బులు, శానిటైజర్లు పెట్టలేదని, థర్మల్ స్కానర్లు ఏర్పాటు చేయలేదని పిల్‌లో పేర్కొన్నారు. కోవిడ్ నేపథ్యంలో పరీక్షల నిర్వహణ సందర్భం గా కనీస వైద్య జాగ్రత్తలు తీసుకునేలా ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని కోరారు.
Published date : 20 Mar 2020 03:27PM